దాదాపు పది రోజుల నుంచి మరాఠా ముఖ్యమంత్రి పీఠంపై ఎవరు కూర్చుంటారు అనే అంశంలో స్పష్టత రావడం లేదు. మహారాష్ట్ర సీఎంగా బిజేపి నుంచి ఉండే అవకాశం ఉందనే క్లారిటీ ఉన్నా… జరుగుతున్న పరిణామాలు మాత్రం ఈ విషయంలో టెన్షన్ పెంచుతున్నాయి. ఏక్నాథ్ షిండే రెండు రోజుల పాటు ఢిల్లీలోనే ఉండటంతో అసలు ఏం జరుగుతుందో బిజేపి నేతలకు కూడా క్లారిటీ రావడం లేదు. బిజేపి పెద్దలకు షిండే ఎదురు చెప్పే పరిస్థితి లేకపోయినా… ఈ విషయంలో ఏం చేస్తారనేది ఓ అంచనాకు రాలేని పరిస్థితి.
Also Read : జగన్ బెయిల్ రద్దు కేసులో కీలక ముందడుగు
శాఖల కూర్పు విషయంలో బిజేపి పెద్దలతో ఎన్సీపీ, శివసేన ఓ అంగీకారానికి వచ్చాయి. కాని షిండే మాత్రం తన కుమారుడ్ని లేదంటే తనను కేంద్రంలోకి తీసుకోవాలని కోరుతున్నట్టు తెలుస్తోంది. ఇక తాజాగా వెలువడుతున్న నేషనల్ మీడియా కథనాల ప్రకారం మహా సీఎం ను ఖరారు చేసినట్టు సమాచారం. మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ పేరు ఖరారైందని జాతీయ మీడియాకు ఓ బిజేపి నేత వెల్లడించారు. కొత్త బిజెపి శాసనసభా పక్ష నేతను ఎన్నుకునే సమావేశం డిసెంబర్ 2 లేదా 3 తేదీల్లో జరుగుతుందని ఆయన తెలిపారట.
Also Read : తెలంగాణాలో టీడీపీ గేమ్ స్టార్ట్
ఇక 5వ తేదీ లేదా ఆరున మహారాష్ట్ర సిఎం ప్రమాణ స్వీకార కార్యక్రమం చాలా గ్రాండ్ గా జరగనుంది. దీనికి బిజెపి పాలిత సిఎంలు, ఎన్డియే పక్షాల సీఎంలు, పార్టీల అధినేతలు హాజరు కానున్నారు. ఇటీవల ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే మాట్లాడుతూ, ముఖ్యమంత్రి పేరుకు సంబంధించి ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా తీసుకున్న నిర్ణయానికి తాను పూర్తిగా మద్దతు ఇస్తానని ప్రకటించారు. ఏక్‌నాథ్ షిండే కుమారుడు శ్రీకాంత్ షిండేకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వవచ్చని ఊహాగానాలు వెలువడుతున్నాయి. బిజెపి, శివసేన (షిండే), ఎన్‌సిపి (అజిత్ పవార్) భాగస్వామ్య పక్షాలందరితో ఏకాభిప్రాయం కుదిరిన తర్వాత పోర్ట్‌ఫోలియోలపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

