Wednesday, February 4, 2026 11:10 AM
Wednesday, February 4, 2026 11:10 AM

మెస్సి బస చేసే హోటల్ రూమ్ ధర తెలిస్తే..!

ఫుట్ బాల్ దిగ్గజ క్రీడాకారుడు లియోనల్ మెస్సికి భారత్ లో ఎంత క్రేజ్ ఉందో తెలిసిందే. అర్జెంటీనాకు ఫీఫా వరల్డ్ కప్ అందించిన తర్వాత మేస్సీకి భారత్ లో ఫాలోయింగ్ భారీగా పెరుగుతూ వచ్చింది. ప్రస్తుతం మెస్సి భారత పర్యటనకు వచ్చిన నేపధ్యంలో.. అభిమానులు ఆయనను చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. క్రీడా ప్రపంచంలో అత్యంత ఫాలోయింగ్ ఉన్న మెస్సి హైదరాబాద్ లో, తెలంగాణా సిఎం రేవంత్ రెడ్డి తో కలిసి ఫుట్ బాల్ ఆడనున్నారు.

Alao Read : భారత క్రికెట్ కు పట్టిన దరిద్రం గౌతమ్ గంభీర్

ఈ నేపధ్యంలో ఈ పర్యటనకు సంబంధించిన అనేక విశేషాలు వైరల్ అవుతున్నాయి. మెస్సితో ఫోటో దిగాలంటే పది లక్షలు కట్టాల్సిందే అనే వార్త నుంచి అతను ఉండే హోటల్ వరకు ప్రతీ ఒక్కటీ ఆసక్తికరంగా మారాయి. శనివారం తెల్లవారుజామున మెస్సి కలకత్తా చేరుకున్నారు. భారీ భద్రత నడుమ మెస్సీని విమానాశ్రయం నుండి తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో హయత్ హోటల్ వెనుక ద్వారం నుంచి హోటల్‌ కు తీసుకెళ్లారు. దీనితో అప్పటికే వేచి ఉన్న వేలాది మంది అభిమానులకు నిరాశతో వెనుతిరిగిన పరిస్థితి.

Alao Read : నెల్లూరులో వైసీపీ చివరి కోట కూడా కూలుతోందా..?

ప్రైవేట్ గల్ఫ్‌స్ట్రీమ్ V విమానంలో కలకత్తా చేరుకున్న మెస్సి ఉండే హయత్ హోటల్ అత్యంత ఖరీదైన హోటల్ గా చెప్పుకోవచ్చు. కోల్‌కతాలోని హయత్ రీజెన్సీలోని రూమ్ నంబర్ 730లో అతను బస చేయనున్నాడు. అతని కోసం ఏడవ అంతస్తు మొత్తం ఖాళీ చేయించింది హోటల్ యాజమాన్యం. అయితే రూమ్ ధర ఎంత అనేది క్లారిటీ లేకపోయినా.. హోటల్ అధికారిక సైట్ డిసెంబర్ 13 ప్రకారం.. ప్రెసిడెన్షియల్ సూట్ (వంటగది, ప్రత్యేక సిట్టింగ్ ఏరియా, ప్రత్యేక వర్క్ ఏరియా, ఎనిమిది సీట్ల డైనింగ్ ఏరియాతో) ఉంటుంది.

డిసెంబర్ 14కి, దాని ధర ఒక రాత్రికి రూ. 1,42,500. డిప్లొమాటిక్ సూట్ ధర రాత్రికి రూ. 1,12,500. రీజెన్సీ ఎగ్జిక్యూటివ్ సూట్ ధర రాత్రికి రూ. 51,000, రీజెన్సీ సూట్ కింగ్ ధర రాత్రికి రూ. 38,000. దీన్ని పరిగణనలోకి తీసుకుంటే, మెస్సీ ఈ విలాసవంతమైన సూట్‌ లలో ఒకదానిలో బస చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. భద్రత అత్యున్నత స్థాయిలో ఉండటంతో, కొంతమంది అభిమానులు మెస్సీకి వీలైనంత దగ్గరగా ఉండటానికి హోటల్‌లో గదులు బుక్ చేసుకున్నారు అంటే అతని క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఇప్పుడు వాళ్లంతా ఏమయ్యారు..?

కూటమి అంటే.. ఒక ఉమ్మడి కుటుంబం...

ఏపీ కేబినేట్ సంచలన...

తిరుమల కల్తీ లడ్డు వ్యవహారానికి సంబంధించి...

దమ్ముంటే అసెంబ్లీకి రా.....

గత రెండు రోజులుగా తనను ఉద్దేశించి...

బ్రేకింగ్: చంద్రబాబు –...

ఏపీలో ప్రస్తుతం జరుగుతోన్న రాజకీయ పరిణామాలు...

సింఘాల్‌ సరే.. తర్వాత...

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి...

అందరి బ్రతుకు నాకు...

గతవారం పది రోజుల నుంచి ఏపీలో...

పోల్స్