Sunday, March 22, 2026 10:33 AM
Sunday, March 22, 2026 10:33 AM

ఫేక్ బతుకులు.. వైసీపీపై లోకేష్ ఫైర్

తప్పుడు ప్రచారం చేసే విషయంలో వైసీపీ 2014 నుంచి ఏ విషయాన్ని వదిలిపెట్టడం లేదు. రాజకీయంగా బలహీనపడిన సమయంలో రాష్ట్ర ప్రభుత్వం 2014 తర్వాత అలాగే 2024 తర్వాత తప్పుడు ప్రచారాలతో వైసీపీ రాజకీయం చేస్తుందని టిడిపి నేతలు విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా రాష్ట్ర ప్రభుత్వ ఉపాధ్యాయులపై కూడా వైసీపీ తప్పుడు ప్రచారానికి దిగింది. దీనిపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియా వేదికగా వైసీపీకి ఘాటు కౌంటర్ ఇచ్చారు. టీచర్లపై వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఖండించారు.

Also Read : ట్రంప్ తో ఏం మాట్లాడానో.. మోడీకి చెప్పా.. పుతిన్ కామెంట్స్

ఆంధ్రప్రదేశ్ లో టీచర్లు తాగి బెంచీల కింద పడుకుంటున్నారని.. వైసిపి ఓ వీడియోను తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. దీనిపై లోకేష్ ఆవేదన వ్యక్తం చేస్తూ ఎక్కడో పక్క రాష్ట్రంలో ఏదో ఒక సందర్భంలో బయటకు వచ్చిన ఫోటోను.. ఆంధ్రప్రదేశ్ లో జరిగినట్లు చెప్పడం, దానిపై దారుణంగా వ్యాఖ్యానించడం క్షమించరాని నేరమని లోకేష్ మండిపడ్డారు. విద్యను నేర్పే గురువులు పైన అతినీచంగా వ్యవహరించిన వైసిపి నీతి బాహ్యమైన చర్యల్లో మరో మెట్టు కిందకి దిగజారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read : రాజీనామాకు సిద్ధమైన అక్క శిష్యులు..? గులాబీ పార్టీలో అలజడి

ఎంతో బాధ్యతాయుతంగా పనిచేస్తూ.. విద్యార్థులను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దుతున్న ఉపాధ్యాయులను అతి నీచంగా.. చిత్రీకరిస్తూ వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తున్న వైసీపీ చర్యలను తాను తీవ్రంగా ఖండిస్తున్నానని లోకేష్ పేర్కొన్నారు. ఫేక్ సోషల్ మీడియా ఖాతాల ద్వారా తప్పుడు ప్రచారం చేసే వైసిపి చర్యలను అర్థం చేసుకొని తగిన రీతిలో స్పందించాల్సిందిగా టీచర్లను కోరుతున్నట్లు తెలిపారు. ఇటువంటి వాటిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. టీచర్లు స్పందించకపోతే.. వైసిపి విద్యార్థుల భవిష్యత్తుతో పాటుగా టీచర్ల జీవితాలను కూడా నాశనం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దుమారం రేపుతున్న గరికపాటి...

మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహరావు...

బీఆర్ఎస్ వర్సెస్ కౌశిక్...

రాజకీయాల్లో దూకుడు స్వభావం ఉన్నా పర్వాలేదు...

టీటీడీలో కమాండ్ కంట్రోల్.....

ఏపీ సిఎం చంద్రబాబు మనువడు, మంత్రి...

బ్రేకింగ్: మొయినాబాద్ డ్రగ్స్...

మొయినాబాద్ డ్రగ్స్ ఉదంతంలో అత్యంత కీలకంగా...

గ్రాండ్ గా రామ్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

షిర్డీ సాయిని వెంటాడుతున్న...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని...

పోల్స్