Wednesday, February 4, 2026 10:50 AM
Wednesday, February 4, 2026 10:50 AM

లోకేష్ కమిట్మెంట్ కు షాక్ అయిన టీడీపీ నేతలు

సాధారణంగా అమెరికా, యూరప్ వంటి దేశాలు, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి సుదూర దేశాల్లో పర్యటించి తిరిగి ప్రయాణాలు చేసినప్పుడు అలసిపోతూ ఉంటారు. ఒకటి రెండు రోజులు విశ్రాంతి తీసుకోవడం అనేది సహజంగా జరిగేదే. జెట్ లాగ్ సమస్య చాలా మందికి ఉంటుంది. దానికి తోడు అక్కడ వాతావరణ పరిస్థితికి ఇక్కడ వాతావరణ పరిస్థితికి చాలా తేడాలుంటాయి. కానీ తాజాగా మంత్రి నారా లోకేష్ స్పీడ్ చూసిన చాలామంది ఆశ్చర్యపోయారు. ఈనెల 4న అమెరికా బయలుదేరి వెళ్లిన లోకేష్ అక్కడ పలువురు ప్రముఖులతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చేందుకు గూగుల్, మైక్రోసాఫ్ట్ సహా పలు ప్రముఖ కంపెనీల అధినేతలతో ఆయన భేటీలు నిర్వహించారు.

Also Read : దువ్వాడ, దివ్వెల దంపతుల అరెస్ట్..?

దీనికి సంబంధించిన ప్రతి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇక అక్కడి నుంచి వెంటనే లోకేష్ విశాఖ చేరుకున్నారు. ఏమాత్రం విశ్రాంతి లేకుండా కాగ్నిజెంట్ కార్యాలయ ఓపెనింగ్ లో పాల్గొన్నారు మంత్రి. కార్యక్రమం మొత్తం లోకేష్ ఉత్సాహంగానే కనిపించారు. ఇదే సమయంలో అక్కడ నాయకులతో కూడా ఆయన ముచ్చటించారు. వాస్తవానికి నిన్న క్యాబినెట్ సమావేశానికి లోకేష్ హాజరు కావాల్సి ఉండగా.. అమెరికా పర్యటన కారణంగా అది రద్దయింది. కానీ విశాఖలో ఉన్న కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న లోకేష్ వెంటనే కుటుంబ సభ్యులను కూడా కలవకుండా విశాఖ వెళ్లిపోయారు. అమెరికాలో ప్రస్తుతం వింటర్ సీజన్ నడుస్తోంది.

Also Read : నలుగురు మంత్రులపై సీఎం సీరియస్..?

దీనితో చలి కొన్నిచోట్ల మైనస్ డిగ్రీల్లో కూడా ఉండే అవకాశం ఉంటుంది. అయినా సరే అక్కడ కార్యక్రమాలను ఆపని లోకేష్.. వెంటనే విశాఖ రావడం, ఇక్కడ కాస్త వేడి వాతావరణం ఉన్నప్పటికీ ఇబ్బంది పడకుండా.. అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడం వంటివి జరిగాయి. అక్కడ నుంచి నేరుగా మళ్ళీ లోకేష్ మంగళగిరి వెళ్ళే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో లోకేష్ ను విమర్శించిన వారు కూడా ఆయన పట్టుదల చూసి ఆశ్చర్యపోతున్నారు. ముందు లోకేష్ ను ట్రోల్ చేసిన వైసీపీ కార్యకర్తలు కూడా సైలెంట్ అయ్యారు. ప్రస్తుతం వైజాగ్ లో టిడిపి నాయకులతో లోకేష్ సమావేశం నిర్వహిస్తున్నారు. అక్కడే మరో రెండు అధికారిక కార్యక్రమాల్లో కూడా ఆయన పాల్గొనే అవకాశం ఉంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఇప్పుడు వాళ్లంతా ఏమయ్యారు..?

కూటమి అంటే.. ఒక ఉమ్మడి కుటుంబం...

ఏపీ కేబినేట్ సంచలన...

తిరుమల కల్తీ లడ్డు వ్యవహారానికి సంబంధించి...

దమ్ముంటే అసెంబ్లీకి రా.....

గత రెండు రోజులుగా తనను ఉద్దేశించి...

బ్రేకింగ్: చంద్రబాబు –...

ఏపీలో ప్రస్తుతం జరుగుతోన్న రాజకీయ పరిణామాలు...

సింఘాల్‌ సరే.. తర్వాత...

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి...

అందరి బ్రతుకు నాకు...

గతవారం పది రోజుల నుంచి ఏపీలో...

పోల్స్