Sunday, March 22, 2026 10:10 AM
Sunday, March 22, 2026 10:10 AM

నిరూపిస్తే.. రూ.10 కోట్లు కానుక..!

వైసీపీ నేతలకు మంత్రి నారా లోకేష్ బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఏకంగా రూ.10 కోట్లు ఇస్తా అంటూ సవాల్ విసిరారు లోకేష్. అది కూడా వ్యక్తిగతంగా చెక్ ఇస్తా అంటూ ఆఫర్ ఇచ్చారు. ఏపీ ఇప్పుడు డేటా చోరీ అంశం హాట్ టాపిక్‌గా నడుస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు మెరుగైన సేవలు అందించే లక్ష్యంతో ప్రభుత్వ సేవలను సులభతరం చేస్తున్నారు. అందులో భాగంగా ఇటీవల వాట్సప్ గవర్నెన్స్ ప్రారంభించారు మంత్రి నారా లోకేష్. ఒక నెంబర్‌కు మెసేజ్ చేస్తే చాలు… ఏకంగా 161 సేవలు అందుబాటులోకి వస్తాయి. ఎవరికీ ఎలాంటి లంచం ఇవ్వాల్సిన అవసరం లేదు… ఏ కార్యాలయం చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండానే ఈ సేవలు వినియోగించుకోవచ్చు అనేది ప్రభుత్వం మాట.

Also Read : వైసీపీకి చావు దెబ్బ.. బాలినేని రివేంజ్ మోడ్..?

అయితే ఇప్పుడు ఇదే వాట్సప్ గవర్నెన్స్‌పై వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. మంత్రి నారా లోకేష్ ప్రారంభించిన వెంటనే… ఇదే జగన్ 2023లోనే ప్రారంభించారని గొప్పలు చెప్పారు. అయితే ఆ రోజు ఏ నంబర్‌తో ప్రారంభించారో చెప్పాలని టీడీపీ నేతలు సవాల్ చేయడంతో… సైలెంట్ అయ్యారు. బటన్ నొక్కాడు కానీ… ప్రజలకు అందుబాటులోకి తీసుకురాలేదని గుర్తు చేశారు టీడీపీ నేతలు. ప్రజలకు ఉపయోగపడని బటన్ నొక్కుడు ఎవరి కోసమంటూ ఎదురు ప్రశ్నించడంతో… ఏం జవాబు చెప్పాలో దిక్కుతోచని స్థితిలో వైసీపీ నేతలు టాపిక్ డైవర్ట్ చేశారు. ఆ తర్వాత ఇదే వాట్సప్ గవర్నెన్స్‌పై మరో విమర్శ చేస్తున్నారు. దీని ద్వారా డేటా చోరీ జరుగుతుందని.. ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని ప్రభుత్వం అమెరికా వాళ్లకు అమ్మేస్తోందని ఆరోపించారు.

Also Read : చంద్రబాబుకు షర్మిల సలహా.. ఆ ఒక్కటి జాగ్రత్త…!

ఈ ఆరోపణలకు మంత్రి నారా లోకేష్ ఘాటుగా జవాబిచ్చారు. వైసీపీ నాయకులకు ఛాలెంజ్ చేస్తున్నా… ఎక్కడైనా డేటా చోరీ జరిగిందని నిరూపిస్తే రూ.10 కోట్లు కానుక కింద ఇస్తా… ప్రభుత్వం తరఫున కాకుండా వ్యక్తిగతంగా నేనే చెక్ ఇస్తా… అంటూ లోకేష్ ఓపెన్ ఛాలెంజ్ చేశారు. అదే సమయంలో తనకు అసలు ఫోనే లేదని చెప్పిన జగన్‌కు వాట్సాప్ గవర్నెన్స్ గురించి ఏమి తెలుస్తుందంటూ ఎదురు ప్రశ్నించారు. తాము గతంలో అధికారంలో ఉన్నప్పుడు డేటా చోరీ చేసినట్లు ఆరోపించిన వైసీపీ నాయకులు.. ఐదేళ్లలో నిరూపించలేకపోయారని విమర్శించారు. చంద్రబాబుపై దొంగ కేసు పెట్టి, చేయని తప్పునకు 52 రోజులు జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉంచారని… తాను ఐటీ మంత్రిగా ఉన్నప్పుడు తప్పు చేసి ఉంటే ఊరికే వదిలిపెడతారా అని ప్రశ్నించారు. తమకు ప్రజల డేటా అక్కర్లేదన్న లోకేష్… కావాల్సింది ఓటర్ లిస్టు మాత్రమే. అది పబ్లిక్ డాక్యుమెంట్ అని వెల్లడించారు. దమ్ముంటే వైసీపీ నేతలు డేటా చోరీ గురించి రుజువు చేయాలని సవాల్ చేశారు లోకేష్.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దుమారం రేపుతున్న గరికపాటి...

మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహరావు...

బీఆర్ఎస్ వర్సెస్ కౌశిక్...

రాజకీయాల్లో దూకుడు స్వభావం ఉన్నా పర్వాలేదు...

టీటీడీలో కమాండ్ కంట్రోల్.....

ఏపీ సిఎం చంద్రబాబు మనువడు, మంత్రి...

బ్రేకింగ్: మొయినాబాద్ డ్రగ్స్...

మొయినాబాద్ డ్రగ్స్ ఉదంతంలో అత్యంత కీలకంగా...

గ్రాండ్ గా రామ్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

షిర్డీ సాయిని వెంటాడుతున్న...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని...

పోల్స్