Sunday, March 22, 2026 07:45 AM
Sunday, March 22, 2026 07:45 AM

మద్యం రేట్లు తగ్గిద్దాం.. మరో 11 కంపెనీల ప్లాన్ ఇదే

స్వతంత్ర భారతదేశంలో ఎన్నో మద్యం పాలసీలు వచ్చినా గత ఐదేళ్లపాటు అమలు చేసిన మద్యం పాలసీ మాత్రం ఓ సెన్సేషన్. ప్రపంచంలో ఏ ప్రభుత్వానికి రాని ఆలోచన అప్పటి ముఖ్యమంత్రి వైయస్ జగన్ కు వచ్చింది. ప్రభుత్వం మద్యం అమ్మడం అనేది అప్పట్లో ఒక సంచలనం. మద్యపాన నిషేధం పేరుతో అధికారంలోకి వచ్చిన జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం మద్యం ఏకంగా ప్రభుత్వమే అమ్మేలాగా ప్లాన్ చేయడం వివాదాస్పదమైంది. ఇదే సమయంలో ధరలు కూడా భారీగా మద్యం కంపెనీలు పెంచేశాయి.

అసలు ప్రపంచంలో ఎవరికీ తెలియని బ్రాండ్ లు ఆంధ్రప్రదేశ్ లో అడుగుపెట్టేసాయి. దీని కారణంగా చాలామంది అనారోగ్యానికి కూడా గురయ్యారు. ఏళ్ల తరబడి మద్యం తాగినా అనారోగ్యానికి గురికాని చాలామంది గత ఐదేళ్లపాటు మద్యానికి బానిసై ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారు. ఇక ధరల విషయంలో మాత్రం తీవ్ర స్థాయిలో ఆరోపణలు వచ్చాయి. భారీగా మద్యం ధరలను పెంచడం పట్ల అప్పట్లో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఇక మద్యం కంపెనీలు కూడా అప్పటి ప్రభుత్వ పెద్దలకు అనుకూలంగా ధరలను భారీగా పెంచేసి వాళ్లకు మామూళ్ళు కూడా ఇవ్వటం మొదలుపెట్టాయి.

Also Read : సీన్ లోకి ఈడీ..? కేటిఆర్ తక్కువ అంచనా వేసారా..?

అయితే ఇప్పుడు మాత్రం చాలా కంపెనీలు క్రమంగా తమ మద్యం ధరను తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నాయి. వైసిపి హయాంలో బేసిక్ ప్రైస్ ను భారీగా పెంచేసిన సరఫరా కంపెనీల్లో కొన్ని ఇప్పుడు వాటంత ధరలు తగ్గిస్తున్నాయి. అప్పటి ప్రభుత్వ పెద్దలు ఆయా కంపెనీల నుంచి కమిషన్ తీసుకునేందుకు వీలుగా వాటికి చెల్లించే మూలధరల్ని భారీగా పెంచేశారు అనే ఫిర్యాదులు కూడా వచ్చాయి. అయితే నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొత్త మద్యం పాలసీని తీసుకువచ్చింది. వినియోగదారుల డిమాండ్ కు అనుగుణంగా పారదర్శకంగా ఆర్డర్ ఇస్తున్న నేపథ్యంలో దాదాపు 11 కంపెనీలు వాటి బేసిక్ ప్రైస్ ను తగ్గించాయి. ఫలితంగా కంపెనీల నుంచి రాష్ట్ర బేవరేజ్ సంస్థ మద్యం కొనే ధర తగ్గిందారు. ఆయా బ్రాండ్లను బట్టి ఒక్కో క్వార్టర్ ధర ఎంఆర్పి పై 30 రూపాయల వరకు తగ్గనుంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దుమారం రేపుతున్న గరికపాటి...

మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహరావు...

బీఆర్ఎస్ వర్సెస్ కౌశిక్...

రాజకీయాల్లో దూకుడు స్వభావం ఉన్నా పర్వాలేదు...

టీటీడీలో కమాండ్ కంట్రోల్.....

ఏపీ సిఎం చంద్రబాబు మనువడు, మంత్రి...

బ్రేకింగ్: మొయినాబాద్ డ్రగ్స్...

మొయినాబాద్ డ్రగ్స్ ఉదంతంలో అత్యంత కీలకంగా...

గ్రాండ్ గా రామ్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

షిర్డీ సాయిని వెంటాడుతున్న...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని...

పోల్స్