Saturday, October 25, 2025 08:50 PM
Saturday, October 25, 2025 08:50 PM
roots

మాకు ఈ పదవులు వద్దు సార్..!

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కావొస్తోంది. పార్టీ కోసం కష్టపడిన వారికి నామినేటెడ్ పదవులు ఇస్తోంది ప్రభుత్వం. అయితే ఈ పదవుల కేటాయింపుపై చాలా మంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు ఏకైక కారణం.. వారికి సరైన గుర్తింపు రాలేదనే భావన. పార్టీ కోసం చేసిన కష్టాన్ని అధినేత గుర్తించలేదనే భావనతో కొంతమంది పదవులను తిరస్కరిస్తుంటే.. మరికొందరు మాత్రం.. పార్టీకి కూడా రాజీనామా చేసి సైలెంట్‌గా సైడ్ అయిపోతున్నారు.

Also read : ప్రభాస్ పైనే ఆశలన్నీ.. నిర్మాతలను కాపడతాడా..?

2024లో టీడీపీ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం కార్యకర్త. పార్టీ గెలుపు కోసం ఎంతో కృషి చేసిన మాట వాస్తవం. ఐదేళ్ల వైసీపీ సర్కార్‌లో ఎన్నో ఇబ్బందులకు గురైన నేతలు, కార్యకర్తలు.. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తమకు గుర్తింపు వస్తుందని.. గౌరవప్రదమైన పదవులు వస్తాయని ఆశించారు. కానీ పార్టీ మాత్రం కొందరి విషయంలో చిన్న చూపు చూసిందనే భావన ఇప్పుడు ఆ నేతల్లో స్పష్టంగా కనిపిస్తోంది. కొందరు బహిరంగంగానే విమర్శలు కూడా చేస్తున్నారు.

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అంగన్వాడీ, డ్వాక్రా విభాగం అధ్యక్షురాలు ఆచంట సునీతను ఏపీ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ బోర్డు డైరెక్టర్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నియామకంతో సునీత షాక్ అయ్యారు. సుమారు 27 ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడుతున్నానని.. పదేళ్ల పాటు ఉమ్మడి కృష్ణా జిల్లా తెలుగు మహిళ అధ్యక్షురాలుగా పని చేసిన తనకు ఇలా డైరెక్టర్ పదవి ఇవ్వటాన్ని అవమానంగా భావిస్తున్నారు. తన తోటి వారికి తన తర్వాత పార్టీలోకి వచ్చిన వారికి కూడా ఛైర్మన్ పదవులు కట్టబెట్టారని.. కానీ తనను మాత్రం ఇలా డైరెక్టర్‌గా నియమించటం ఏమిటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై పార్టీ అధినేత చంద్రబాబుకు బహిరంగ లేఖ రాశారు. తనకు ఇచ్చిన గౌరవానికి కృతజ్ఞతలు తెలిపిన ఆచంట సునీత.. ఇచ్చిన పదవిని తిరస్కరిస్తున్నట్లు లేఖలో తెలిపారు.

Also read : గ్లాస్ స్కై వాక్ పాలిట్రిక్స్.. మా వల్లే అంతా..!

గతంలో కూడా ఇదే మాదిరిగా ఇద్దరు నేతలు చంద్రబాబుకు లేఖ రాశారు. తొలి జాబితాలో డైరెక్టర్ల పదవులు కేటాయించిన వారు తమకు అవసరం లేదంటూ లేఖలు రాశారు. అలాంటి వారిలో శిష్ట్లా లోహిత్, సప్తగిరి ప్రసాద్, మజ్జి పద్మావతి వంటి నేతలున్నారు. పార్టీ కోసం ఎంతో కష్టపడి పని చేస్తే.. గుర్తింపు ఇవ్వటం లేదనే మాట కూడా వినిపిస్తోంది. మరి ఇలాంటి వారిని అధినేతఎలా బుజ్జగిస్తారో చూడాల్సి ఉంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

సస్పెండ్ చేస్తే తిరువూరు...

తిరువూరు నియోజకవర్గం టీడీపీలో అలజడి కొనసాగుతోంది....

పులివెందులకు కేంద్రం గుడ్...

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్...

వరల్డ్ కప్‌కు మేం...

గత నాలుగు నెలల నుంచి భారత...

రోహిత్ రికార్డుల మోత.....

భారత క్రికెట్ అభిమానులకు టీమిండియా ఓపెనర్...

ఒక్కొక్కరికి కోటి ఇచ్చే...

బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన తర్వాతి...

హైడ్రా కమీషనర్ రంగనాథ్...

హైదరాబాద్‌లోని హైడ్రా కమీషనర్ రంగనాథ్ శుక్రవారం...

పోల్స్