ఏపీలో గత ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో చెలరేగిపోయిన వారిని ఒక్కొక్కరిగా బయటకు లాగుతున్నారు పోలీసులు. తెలుగుదేశం పార్టీ ఆఫీసుపై దాడి చేసిన వారి విషయంలో కఠినంగా వ్యవహరించిన పోలీసులు పలువురు నేతలను అదుపులోకి తీసుకున్నారు. కొందరు సుప్రీం కోర్ట్ వరకు వెళ్లి బెయిల్ తెచ్చుకున్నారు. ఇక ఇప్పుడు అరెస్ట్ అయిన కొందరు బెయిల్ పై బయటకు వస్తున్నారు. అయితే విచారణలో వాళ్ళు ఎంత వరకు సహకరించారు, వాళ్ళ నుంచి పోలీసులు ఏ సమాచారం రాబట్టారు అనేదే ఆసక్తికరంగా మారిన విషయం.
పడవల విషయంలో గాని, పార్టీ ఆఫీసు విషయంలో గాని కొందరికి బెయిల్ రావడం ఆశ్చర్యంగా ఉంది చాలా మందికి. పోలీసులు ఏమో మీడియా ముందు అసలు వాళ్ళు ఏం సహకరించలేదు అని చెప్తున్నారు. వాళ్ళ ఫోన్ లు కూడా ఇవ్వడం లేదు.. వాళ్ళు ఏ సమాచారం చెప్పడం లేదని అంటున్నారు. నందిగం సురేష్ విషయంలో గాని, జోగి రమేష్ విషయంలో గాని ఇదే జరిగింది. కానీ నందిగం సురేష్ కు హైకోర్ట్ లో బెయిల్ వచ్చేసింది. పోలీసుల వివరాల ప్రకారం ఆయన రెండు ఐఫోన్ లు పోయాయి అని చెప్పారు. పోయినప్పుడు కేసు ఎందుకు పెట్టలేదో అడిగితే సమాధానం లేదు.
Read Also : చంద్రబాబు ముందున్న అతి పెద్ద సవాల్ ఇదే…!
అయితే హైకోర్ట్ లో బెయిల్ రాకుండా చేయడానికి పోలీసులు గాని, ప్రభుత్వం గాని గట్టి వాదనలు వినిపించలేదు అనే ఆరోపణలు ఉన్నాయి. నందిగం సురేష్ వ్యవహారాల మీద చాలా ఆరోపణలు ఉన్నాయి. వాటి విషయంలో సాక్ష్యాలు కూడా ఉన్నాయి. అయినా కూడా నందిగం సురేష్ పై పెట్టింది ఒకటి రెండు కేసులు మాత్రమే. గతంలో టీడీపీ నేతలకు తప్పు చేయకుండా నెలలు నెలలు జైల్లో రిమాండ్ లో ఉంచడంలో జగన్ సక్సెస్ అయ్యారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో చూసి చూడనట్టు వ్యవహరిస్తోంది. చేసిన తప్పులు కూడా కోర్ట్ ముందు ఉంచడంలో పోలీస్ విభాగం ఫెయిల్ అవుతోంది అనే ఆరోపణలు వస్తున్నాయి.

