“చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ను బాగా తిట్టాలి..” వైసీపీ ప్లీనరీ సమావేశంలో మాజీ మంత్రి రోజాకు వైసీపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు చెప్పిన మాట. ఈ మాట చెబుతున్నప్పుడు మైక్ ఆన్‌లో ఉండటంతో.. ఆ విషయం అందరికీ వినిపించింది. ఈ విషయం అప్పట్లో పెద్ద దుమారం రేపింది కూడా. ఈ విషయం జగన్ స్వయంగా తనకు చెప్పాడని కూడా రోజాకు ఉమ్మారెడ్డి చెప్పడంతో అసలు వైసీపీ నేతలు ఎందుకు తిడుతున్నారో అందరికీ ఫుల్ క్లారిటీ వచ్చేసింది. వాస్తవానికి ఈ రోజు వైసీపీలో కీలక పదవుల్లో ఉన్న వారిలో సగం మంది తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వాళ్లే. అటు కాంగ్రెస్ పార్టీ నుంచి వైసీపీలో చేరిన వాళ్లు కూడా ఎప్పుడూ నోరు పారేసుకోలేదు. రాజకీయ పరమైన విమర్శలు చేశారు తప్ప… వ్యక్తిగత దూషణలు చేయలేదు.
Also Read : మళ్ళీ పవన్ తో సున్నం పూసుకుంటున్న వైసీపీ
ఇక కొడాలి నాని, రోజా, వల్లభనేని వంశీ వంటి నేతలు టీడీపీలో ఉన్నప్పుడు చాలా పద్దతిగానే ఉన్నారు. ఏ రోజు నోరు పారేసుకోలేదు. కానీ వైసీపీలోకి వచ్చిన వెంటనే తన నోటికి పని చెప్పారు. పోసాని కూడా ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీ చేసినప్పుడు ఎలాంటి వివాదాలు లేవు. కానీ వైసీపీ చేరిన తర్వాత మాత్రం… రెచ్చిపోయారు. వాస్తవానికి టెక్నాలజీని వాడుకోవడంలో తెలుగుదేశం పార్టీ అగ్రస్థానంలో ఉంటుందనేది అందరి మాట. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సోషల్ మీడియాను విస్తృతంగా వినియోగించారు. ఇంకా చెప్పాలంటే ఫేక్ అకౌంట్లను క్రియేట్ చేసి.. టీడీపీ, జనసేన నేతలపై వ్యక్తిగత దూషణలు చేయడంలో రెచ్చిపోయారు. రాజకీయాల్లో పదవి కావాలంటే పని చేయాలి.. ప్రజల్లో అభిమానం సంపాదించాలి… లేదా కులం కార్డు అయినా ఉండాలి.
Also Read : బీఆర్ఎస్ కు నిద్ర లేకుండా చేస్తున్న రేవంత్ టూర్
కానీ వైసీపీలో మాత్రం ఇవేవీ అవసరం లేదు. జస్ట్ ప్రతిపక్ష నేతలను దూషిస్తే చాలు.. ప్రతిపక్ష నేతలపై దాడులు చేస్తే చాలు.. ఎదుటి పార్టీ వాళ్లను భయబ్రాంతులకు గురి చేస్తే చాలు. రాజకీయ ప్రత్యర్థులను తిడితే చాలు.. ఇంట్లో వారికి అక్రమ సంబంధాలు అంటగడితే చాలు.. జగన్‌ను ప్రసన్నం చేసుకోవచ్చు. అలా చేసిన వారికే పదవులు ఇచ్చారు జగన్. చంద్రబాబు ఇంటిపై దాడికి యత్నించిన జోగి రమేష్‌కు మంత్రి పదవి వచ్చింది. చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్‌ను తిట్టిన రోజాకు మంత్రి పదవి, పోసానికి కార్పొరేషన్ పదవి, బైరెడ్డి సిద్ధార్ధ రెడ్డికి శాప్ ఛైర్మన్.. దువ్వాడ శ్రీనివాస్‌కు ఎమ్మెల్సీ.. ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ పెద్దగానే వస్తుంది. రాజకీయ సభలైనా సరే.. ప్రభుత్వ వేదికలైనా సరే… ప్రతిపక్ష నేతలను తిట్టడమే ఏకైక లక్ష్యంగా నాడు వైసీపీ నేతలు పెట్టుకున్నారు. సీఎం హోదాలో జగన్ హాజరైన సభల్లో వైసీపీ నేతలు మరింత రెచ్చిపోయారు. ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేస్తుంటే… జగన్ కూడా ఎంజాయ్ చేశారు.
Also Read: చంద్రబాబు చెప్పినా లెక్క లేదా…?
చంద్రబాబు, పవన్ కల్యాణ్‌పై బహిరంగ సభలో వ్యాఖ్యలు చేసిన జోగి రమేష్‌ను జగన్ మెచ్చుకోవడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది కూడా. చివరికి అసెంబ్లీలో కూడా చంద్రబాబు కుటుంబ సభ్యులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వ్యక్తిత్వ హననానికి దిగారు. ఇలాంటి వారికే జగన్ పదవులతో పాటు ఆర్థిక లబ్ది వచ్చేలా వ్యవహరించారు. అయితే కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. చేసిన కర్మ ఫలం ఎప్పటికైనా అనుభవించాల్సిందే అన్నట్లుగా.. నాడు జగన్ మెప్పు కోసం నోటీ దూలతో ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేసిన ప్రతి ఒక్కరూ.. ఇప్పుడు ఫలితం అనుభవిస్తున్నారు. జగన్ రెడ్డి వికృత ఆనందం కోసం దాడులు చేసి తిట్టిన వారంతా.. ఇప్పుడు నోరెత్తడానికే భయపడుతున్నారు. ఇలాంటి వారికి న్యాయపరమైన సహాయం చేసేందుకు కూడా వైసీపీ ముందుకు రావటం లేదు. దీంతో ఇలాంటి వ్యక్తి పైశాచిక ఆనందం కోసమా మనం బలయ్యాం అని జగన్‌ను సొంత పార్టీ నేతలే తిట్టుకుంటున్నారు.