Sunday, October 19, 2025 05:54 PM
Sunday, October 19, 2025 05:54 PM
roots

గవాయ్ పై షూ ఎందుకు విసిరినట్టు..? కారణం అదేనా..?

న్యాయ వ్యవస్థ అంటే ఓ రకమైన భయం ఉంటుంది. కోర్ట్ లు అంటే మరింత ఉంటుంది. సుప్రీం కోర్ట్ అంటే.. భయంతో పాటు గౌరవం కూడా ఉంటుంది. కానీ.. తాజాగా సుప్రీం కోర్ట్ లో చోటు చేసుకున్న ఓ ఘటన మాత్రం ఒక్కసారిగా దేశాన్ని కుదిపేస్తోంది. ఏకంగా చీఫ్ జస్టీస్ పైనే షూ విసిరెందుకు ప్రయత్నం చేయడం హాట్ టాపిక్ అయింది. కోర్టు కార్యకలాపాలు జరుగుతుండగా ఒక న్యాయవాది తన షూ తీసి విసిరెందుకు ప్రయత్నం చేసారు ఓ లాయర్. భద్రతా సిబ్బంది అప్రమత్తంగా ఉండటంతో ప్రమాదం తప్పింది.

Also Read : గర్భంతో ఉన్న మహిళలు మద్యం సేవించవచ్చా..?

చీఫ్ జస్టీస్ నేతృత్వంలోని ధర్మాసనం న్యాయవాదుల కేసుల గురించి విచారిస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక వెంటనే ఆ లాయర్ ను బయటకు తీసుకెళ్ళారు సిబ్బంది. ప్రస్తుతం అతను ఢిల్లీ పోలీసుల అదుపులో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఈ దాడి వెనుక కారణం ఏంటీ అనే దానిపై జాతీయ మీడియా ఆసక్తికర విషయం ప్రస్తావించింది. మధ్యప్రదేశ్‌ లోని ఖజురహో ఆలయ సముదాయంలో భాగమైన జవారీ ఆలయంలో ఏడు అడుగుల విష్ణువు విగ్రహాన్ని ఇటీవల కూల్చివేసారు.

Also Read : ఆ ముగ్గురినీ వేటాడుతున్న బోర్డు..?

విగ్రహాన్ని పునర్నిర్మించి, తిరిగి ప్రతిష్టించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ ను గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం తిరస్కరించింది. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఆ దేవుడ్నే ఏదైనా చేయమని అడగాలి అంటూ ఆయన కామెంట్ చేసారు. ఇది పూర్తిగా ప్రచార ప్రయోజన వ్యాజ్యం అని కామెంట్ చేసారు. విష్ణువు కు మీరు నిజమైన భక్తుడు అయితే వెళ్లి ప్రార్ధన చేయాలి అంటూ వ్యాఖ్యానిస్తూ పిటీషన్ కొట్టేసారు. ఇక అక్కడి నుంచి వివాదం మొదలైంది. తాజా ఘటన వెనుక ఇదే కారణం అంటున్నాయి మీడియా వర్గాలు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

పాక్ ఏడుపు అందుకే.....

ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ పాకిస్తాన్ యుద్ధం ఇప్పుడు...

పాకిస్తాన్ కు కెలకడం...

పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ విషయంలో...

సీమలో భారీగా ఉగ్ర...

ఆంధ్రప్రదేశ్ తో పాటుగా దేశవ్యాప్తంగా ఇప్పుడు...

ప్రభుత్వ ప్రత్యేక ఆహ్వానం.....

- ఆస్ట్రేలియా వర్సిటీల్లో అధునాతన బోధనా...

రాజకీయాల్లోకి మరో వారసుడు.....

తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల కవిత కొంతకాలంగా...

ఒకరు క్లాస్.. మరొకరు...

ఏపీలో కూటమి సర్కార్‌ అన్ని విధాలుగా...

పోల్స్