రాష్ట్ర శాంతి భద్రతలకు ముప్పుగా మారుతున్న వైసీపీ అధినేత జగన్ అంటూ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కు టీడీపీ లోక్‌సభ ఫ్లోర్ లీడర్ లావు శ్రీకృష్ణ దేవరాయలు లేఖ రాసారు. పర్యటనల పేరుతో జగన్ విధ్వంసం సృష్టించాలని చూస్తున్నాడని లేఖలో ప్రస్తావించారు. పాపిరెడ్డిపల్లిలో జగన్ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అప్రజాస్వామికం. రాజ్యాంగబద్ధంగా పనిచేస్తున్న ప్రభుత్వంపై విషం కక్కుతూ పోలీసుల నైతికతను దెబ్బతీసే కుట్ర అంటూ ఎంపీ ఆరోపించారు.
Also Read : కాకాణికు హైకోర్టు షాక్.. అరెస్టు ఖాయమా..!
13 ఏళ్లుగా CBI–ED కేసుల్లో బెయిల్‌పై తిరుగుతున్న జగన్, వ్యవస్థలను బెదిరించేలా వ్యవరిహస్తున్నాడని.. నిజాయితీగా పని చేస్తున్న పోలీసులపై జగన్ చేసిన వ్యాఖ్యలు బెయిల్ షరతుల ఉల్లంఘించడమే అన్నారు. సొంత బాబాయి వివేకానంద రెడ్డి హత్యను గుండెపోటుగా చిత్రీకరించి, ఆ మరణాన్ని రాజకీయ ప్రయోజనానికి వాడుకున్న నీచ వ్యక్తి జగన్ రెడ్డి అని మండిపడ్డారు. ‘కోడి కత్తి’ నుంచి ‘రాళ్ల దాడి’ వరకూ ప్రతిదీ ఒక నాటకమన్నారు. కోడి కత్తి కేసులో NIA ముందు ఒక్కసారి కూడా హాజరుకాని వ్యక్తి, ఇప్పుడు పోలీసులపై ఆరోపణలు చేయడం హాస్యాస్పదమన్నారు.
Also Read : కశిరెడ్డి నోరు విప్పుతాడా..?
Z+ భద్రత, 2,500 పోలీసులతో బందోబస్తు ఇచ్చిన కూడా నిసిగ్గుగా జగన్ ప్రభుత్వాన్ని తప్పుపడుతున్నాడని మండిపడ్డారు. కులాల మధ్య, వర్గాల మధ్య చిచ్చు రేపేలా జగన్ ప్రసంగాలు చేయడం… కార్యకర్తల్ని రెచ్చగొట్టడం… ఇవన్నీ శాంతి భద్రతలకు ముప్పు కలిగించే కుట్రలన్నారు. ముందుగానే రోడ్డు ప్రయాణం ప్లాన్ చేసి స్క్రిప్ట్ ప్రకారం డ్రామాకి తెర లేపి అలజడులు సృష్టించడానికి నక్కజిత్తుల కుట్రలు జగన్ ముఠా ప్రయత్నిస్తోందని.. ప్రజలు ఆదరించిన ఎన్డియే కూటమి ప్రభుత్వం, రాష్ట్రంలో శాంతిభద్రతలు నిలబెట్టేందుకు అహర్నిశలు శ్రమిస్తోందన్నారు.