ప్రయాణీకులకు మెరుగైన సేవలు అందించే దిశగా రైల్వే శాఖ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని రైల్వే ట్రాక్‌లను అప్ గ్రేడ్ చేస్తోంది. 130 కిలోమీటర్ల వేగంతో రైళ్లు నడిచేలా ట్రాక్‌ల సామార్థ్యంలో మార్పులు చేస్తున్నారు. అలాగే అమృత్ భారత్ పధకంలో భాగంగా దేశ వ్యాప్తంగా అన్ని రైల్వేస్టేషన్‌లలో కూడా మెరుగైన సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రయాణీకులక కోసం ఎస్కలేటర్లు, లిఫ్ట్‌లు, ప్లాట్‌ఫామ్ విస్తరణ, ఆధునిక వసతులు సమకూరుస్తున్నారు. అలాగే అన్ని మార్గాలను డబ్లింగ్ చేస్తోంది. రద్దీ ఎక్కువగా ఉన్న మార్గాల్లో ట్రిపుల్ ట్రాక్ కూడా సిద్ధం చేస్తోంది. ప్రయాణీకుల కోసం వందేభారత్ వంటి హైస్పీడ్ రైళ్లను కూడా రైల్వే శాఖ నడుపుతోంది. త్వరలోనే వందేభారత్ స్లీపర్ రైళ్లు కూడా పట్టాలెక్కనున్నాయి.
Also Read : రాహుల్ కోపం ఎవరిపై..?
ఈ నేపథ్యంలో రైల్వే శాఖ టికెట్ల జారీలో కీలక మార్పులు చేసింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న తత్కాల్ టికెట్ విధానంలో మార్పులు చేస్తూ రైల్వే శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త రూల్స్ ఈ నెల 15వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. ఇప్పటికే టికెట్ల జారీ సమయాన్ని తగ్గించిన రైల్వే శాఖ.. తత్కాల్ టికెట్ల జారీ సమయంలో రద్దీని దృష్టిలో పెట్టుకుని 5 విధానాల్లో మార్పులు చేస్తున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. ఇందులో ప్రీమియం తత్కాల్‌తో పాటు ఏజెంట్ లాగిన్ సమయం వరకు మార్చేసింది. ప్రయాణీకుల రద్దీకి అనుగుణంగా మార్పులు చేస్తున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది.
Also Read : 2025 లో ఏ హీరో సినిమా కోసం మీరు ఎదురు చూస్తున్నారు?
ఏసీ తరగతిలోని ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ, చైర్ కార్ సమయాలను గంట పొడిగించింది. ఇప్పటి వరకు ఉదయం 10 గంటలకు మొదలయ్యే ఏసీ తత్కాల్ రిజర్వేషన్ ఇకపై 11 గంటలకు ప్రారంభమవుతుంది. అలాగే నాన్ ఏసీ విభాగంలోని స్లీపర్, సెకండ్ సీటింగ్ తత్కాల్ రిజర్వేషన్ సమయాన్ని కూడా గంట పొడిగించింది. ఇప్పటి వరకు ఉన్న 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటలకు మార్చేసింది. ఇక ప్రీమియం తత్కాల్ బుకింగ్‌లో కూడా అరగంట మార్చేసింది. ఇక నుంచి ఉదయం 10 గంటలకు బదులుగా పదిన్నరకు ప్రీమియం తత్కాల్ అందుబాటులో ఉంటుంది. కరెంట్ రిజర్వేషన్ బుకింగ్‌లో మార్పులు చేయలేదు. రైలు బయలుదేరేందుకు సరిగ్గా 4 గంటల ముందు కరెంట్ బుకింగ్ టికెట్లు అందుబాటులో ఉంటాయి. ఇక కీలకమైన ఏజెంట్ బుకింగ్ విషయంలో మాత్రం రైల్వే శాఖ పెద్ద మార్పు చేసేసింది. సామాన్య ప్రయాణీకుల కోసం ఏసీ, నాన్ ఏసీ ప్రయాణీకుల కోసం ఏజెంట్ బుకింగ్ సమయంలో మార్పులు చేసింది. మధ్యాహ్నం 12 గంటలకు అవకాశం ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మార్పులన్నీ ఏప్రిల్ 15 నుంచి అందుబాటులోకి వస్తాయని రైల్వే శాఖ ప్రకటించింది.

