కూటమి అంటే.. ఒక ఉమ్మడి కుటుంబం అని అర్థం. కుటుంబంలో కష్టమైన, నష్టమైనా సరే.. అందరూ సమానంగా పంచుకుంటారు. ఒక కుటుంబంలో ఒకరికి కష్టం వస్తే.. మిగిలిన వారు అండగా నిలుస్తారు. అప్పుడే స్నేహానికి విలువ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి పార్టీల మధ్య పొత్తును గమనిస్తుంటే.. పైకి మాత్రమే కలిసి ఉంటున్నారు.. లోపల మాత్రం కత్తులు దూస్తున్నారా అనే అనుమానాలు బాగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ మాట భారతీయ జనతా పార్టీ నేతలకు వర్తిస్తుంది. కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నప్పటికీ.. సాటి మిత్రులకు కష్టం వస్తే.. తోటి నేతలపై విమర్శలు చేస్తుంటే.. నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు.. కనీసం స్పందించటం లేదు.
Also Read : నాన్‌వెజ్ తిన్న వెంటనే నిద్రపోతున్నారా? ఎంత ప్రమాదమో తెలుసా..!
ఏపీలో తిరుమ్లల కల్తీ నెయ్యి వ్యవహారం పెద్ద దుమారం రేపుతోంది. కల్తీ నెయ్యి సరఫరా చేసిన మాట వాస్తవం అని ఇప్పటికే సిట్ నివేదిక స్పష్టం చేస్తోంది. అయినా సరే.. అందులో జంతువుల కొవ్వు లేదంటూ వైసీపీ నేతలు బుకాయిస్తున్నారు. పైగా గతంలో జంతువుల కొవ్వు కలిసిన నెయ్యి అంటూ వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు, పవన్ కల్యాణ్.. వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. పైగా చంద్రబాబు, లోకేష్ పైన అసభ్య పదజాలంతో బూతులతో రెచ్చిపోయారు. టీడీపీ నేతలను, కార్యకర్తలను రెచ్చగొట్టి.. దాడులకు ప్రేరేపిస్తున్నారు. ఆ తర్వాత కులం పేరుతో రాజకీయం చేస్తున్నారని టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా వ్యాఖ్యానించారు.
అయితే ఇంత జరుగుతున్నా కూడా.. కూటమిలోని జనసేన, బీజేపీ నేతలు కనీసం స్పందించటం లేదు. నిజానికి వైసీపీ నేతలు పవన్ కల్యాణ్‌పై కూడా నోరు పారేసుకుంటున్నారు. పవన్ కూడా తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. అయినా సరే.. ఆ పార్టీ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు కనీసం ఒక్కరు కూడా వైసీపీ నేతలకు కౌంటర్ ఇవ్వటం లేదు. పైగా వైసీపీ నేతలు చంద్రబాబును కదా తిట్టారు.. అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. దీంతో స్వయంగా రంగంలోకి దిగిన జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. సొంత పార్టీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌంటర్ ఇవ్వకపోతే ఎలా అని నిలదీశారు. తక్షణమే వైసీపీ నేతల నోటికి తాళం వేసేలా వాస్తవాలు బయటకు చెప్పాలని ఆదేశించారు.
అయితే ఈ వ్యవహారంలో భారతీయ జనతా పార్టీ నేతల తీరు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. కూటమి సర్కార్‌లో బీజేపీ భాగస్వామిగా కొనసాగుతోంది. ఇంకా చెప్పాలంటే.. కేంద్రంలో ఎన్‌డీఏ సర్కార్ కొనసాగుతుందంటే.. అందుకు టీడీపీ ఎంపీల మద్దతు వల్లే మోదీ సర్కార్ మూడోసారి అధికారంలోకి వచ్చింది. అయినా సరే.. ఆ పార్టీ నేతలు ఏ మాత్రం కృతజ్ఞత చూపించటం లేదు. నిజానికి బీజేపీ అంటే హిందుత్వ పార్టీ అనే పేరు. హిందుత్వానికి పేటెంట్ తామే అని గొప్పగా చెప్పుకుంటారు కూడా. అలాంటి బీజేపీ నేతలు పవిత్రమైన తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగించారని సిట్ నివేదిక ఇచ్చినప్పటికీ.. కాషాయ పార్టీ నేతలు కనీసం స్పందించటం లేదు. పైగా మాకెందుకులే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.
Also Read : బరితెగింపు వెనుక జగన్ ఆశీస్సులు..!
టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు ఆలయాలు కూల్చేశారంటూ పెద్ద ఎత్తున ఆందోళనలు చేసిన సోము వీర్రాజు, జీవీఎల్ నరసింహారావు, విష్ణువర్థన్ రెడ్డి వంటి బీజేపీ కండువా కప్పుకున్న నేతలు.. వైసీపీకి మద్దతుుగా ధర్నాలు, ఆందోళనలు చేశారు. కానీ.. అదే నేతలు.. ఇప్పుడు కల్తీ నెయ్యి గురించి కనీసం పల్లెత్తు మాట కూడా అనటం లేదు. ఇక కూటమి ప్రభుత్వ సారధి చంద్రబాబుపై అంబటి రాంబాబు అసభ్య పదజాలంతో జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేసినా కూడా.. కాషాయా పార్టీ పెద్దలు సైతం మనకెందుకులే అన్నట్లుగా సైలెంట్‌గా ఉన్నారు తప్ప.. వైసీపీ నేతల వ్యాఖ్యలను కనీసం ఖండిస్తున్నట్లు కూడా ప్రకటన విడుదల చేయలేదు. దీంతో.. ఇలాంటి వారి గెలుపు కోసమా మనం పని చేసింది అని తెలుగు తమ్ముళ్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

