Sunday, March 22, 2026 04:33 AM
Sunday, March 22, 2026 04:33 AM

నోటీసులు.. కొడుకు అలా.. కుమార్తె ఇలా..!

ఒక కుటుంబంలో భిన్నమైన వాదనలు.. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో భాగంగా మాజీ ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు ప్రత్యేక దర్యాప్తు బృందం.. సిట్ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 30న విచారిస్తామని సిట్ అధికారులు సూచించారు. అలాగే.. స్టేషన్‌కు రావాల్సిన అవసరం లేదు.. మేము ఇంటికి వచ్చి విచారిస్తాం.. మీరు ప్లేస్ చెప్పండి చాలు అని వెసులుబాటు ఇచ్చారు. అయితే ఆ నోటీసుకు కేసీఆర్ కూడా వెంటనే బదులిచ్చారు. ప్రస్తుతం మునిసిపల్ ఎన్నికలు జరుగుతున్న కారణంగా.. తాను విచారణకు హాజరు కాలేనని.. త్వరలోనే విచారణ తేదీ చెబుతా అన్నారు. అలాగే తాను విచారణకు పూర్తిగా సహకరిస్తానన్నారు కూడా. అలాగే ఇకపై తనకు నోటీసులు కూడా ఎర్రవెల్లి ఫామ్ హౌస్‌కే పంపాలని.. అక్కడే తనను విచారించాలని సూచించారు.

Also Read  : సింఘాల్‌ అవుట్.. టీటీడీ కొత్త ఈవో ఆయనేనా..?

కేసీఆర్‌కు నోటీసులు ఇవ్వటం తెలంగాణ రాజకీయాల్లో పెద్ద దుమారం రేపింది. నిజానికి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చిన రోజే కేసీఆర్ పేరు ప్రస్తావించారు సీఎం రేవంత్ రెడ్డి. ఫోన్ ట్యాపింగ్ జరిగిన మాట వాస్తవం. అలా చేయాలంటే.. అందుకు ప్రభుత్వ పెద్దల అనుమతి తప్పనిసరి. పైగా ఫోన్ ట్యాపింగ్‌ ఆరోపణలు వచ్చిన కొత్తలో.. అప్పుడు మంత్రిగా కొనసాగుతున్న కేటీఆర్.. వింటే తప్పేంటి అని చేసిన వ్యాఖ్యలు అప్పట్లో పెద్ద దుమారం రేపాయి కూడా. అంటే ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు అప్పట్లోనే ఆయన నర్మగర్భంగా ఒప్పుకున్నట్లు అయ్యింది.

తాజాగా ఈ కేసు విచారణలో భాగంగా కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావులు సిట్ ఎదుట హాజరయ్యారు. దీంతో కేసీఆర్‌ను కూడా విచారిస్తారనే పుకార్లు వచ్చాయి. అంతలోనే కేసీఆర్‌కను నోటీసులిచ్చారు. దీంతో రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చ మొదలైంది. కేసీఆర్‌ను అరెస్టు చేస్తారా.. అసలు కేసీఆర్‌కు నోటీసులు ఎలా ఇస్తారు.. అనే వాదనలు తెరపైకి వస్తున్నాయి. అయితే కేసీఆర్ కుటుంబంలో మాత్రం నోటీసులపై విభిన్న వాదనలు వినిపిస్తున్నాయి. కేసీఆర్‌కు నోటీసులు ఎలా ఇస్తారని ఒకరంటే.. ఇస్తే తప్పేంటని మరొకరు అంటున్నారు.

కేసీఆర్‌కు సిట్ నోటీసులు ఇవ్వటాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా తప్పుబట్టారు. కేసీఆర్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం టార్గెట్ చేసిందని.. సిట్ విచారణ పేరుతో రాజకీయ వేధింపులకు పాల్పడుతున్నట్లు ఆరోపించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయలేక ఇలా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందన్నారు. కేసీఆర్‌కు నోటీసులు ఇవ్వడం వల్ల కాంగ్రెస్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. “తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు, పాలనా లోపాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు, ఇప్పుడు విచారణల పేరుతో కేసీఆర్ పై నోటీసులు ఇవ్వడం అత్యంత దుర్మార్గమైన కక్షసాధింపు రాజకీయానికి నిదర్శనం. ప్రజల పక్షాన నిలబడి, ప్రజల గొంతుకగా ఈ అన్యాయ పాలనపై పోరాటం కొనసాగిస్తాం. తెలంగాణ చరిత్రను విచారణలతో కాదు.. ప్రజల తీర్పుతోనే రాస్తారు.” అంటూ సోషల్ మీడియాలో ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Also Read  : కల్తీ నెయ్యి కేసు.. అసలు నిందితులు సేఫ్..!

అయితే కేసీఆర్ కుమార్తె కవిత మాత్రం నోటీసులను స్వాగతించారు. సిట్ విచారణకు కేసీఆర్ హాజరవ్వాలన్నారు. ఆయన తరఫు వాదనలు కూడా వినిపించాలని సూచించారు. రెండేళ్లుగా ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ కొనసాగుతోందని.. ఈ కేసు విచారణ వేగంగా జరగటం లేదన్నారు. కేసు విచారణలో రేవంత్ సర్కార్ పూర్తిగా విఫలమైందని కవిత విమర్శించారు. తన ఫోన్ కూడా ట్యాపింగ్‌కు గురైనట్లు గతంలోనే కవిత ఆరోపించారు. కాబట్టి ట్యాపింగ్ వ్యవహారంలో విచారణ జరగాలని.. నిజానిజాలు వెలుగులోకి రావాలన్నారు. అసలు దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు. ఓ వైపు అన్న కేటీఆర్ విచారణ వద్దంటుంటే.. చెల్లి కవిత మాత్రం దర్యాప్తు లోతుగా జరగాలని డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దుమారం రేపుతున్న గరికపాటి...

మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహరావు...

బీఆర్ఎస్ వర్సెస్ కౌశిక్...

రాజకీయాల్లో దూకుడు స్వభావం ఉన్నా పర్వాలేదు...

టీటీడీలో కమాండ్ కంట్రోల్.....

ఏపీ సిఎం చంద్రబాబు మనువడు, మంత్రి...

బ్రేకింగ్: మొయినాబాద్ డ్రగ్స్...

మొయినాబాద్ డ్రగ్స్ ఉదంతంలో అత్యంత కీలకంగా...

గ్రాండ్ గా రామ్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

షిర్డీ సాయిని వెంటాడుతున్న...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని...

పోల్స్