Sunday, March 22, 2026 07:05 AM
Sunday, March 22, 2026 07:05 AM

ఏపిలో పెట్టుబడులకు ముందుకొచ్చిన కొరియా సంస్థలు

రాష్ట్రంలో పెట్టుబడుల ఆకర్షణ, ఉపాధి కల్పనే లక్ష్యంగా విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ముందుకు సాగుతున్నారు. భారతదేశంలో ముఖ్యంగా ఏపీలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారి సమర్థ నాయకత్వంపై విశ్వాసంతో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు దక్షిణ కొరియాకు చెందిన పలు సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయి. చెన్నైలోని కొరియా కాన్సులేట్ జనరల్ కిమ్ చాంగ్ యున్ తో పాటు కొరియన్ ఎక్సిమ్ (KEXIM) బ్యాంక్ ఈడీసీఎఫ్ ఆపరేషన్స్ డిపార్ట్ మెంట్-2 డైరెక్టర్ జనరల్ కెవిన్ చోయ్, కెక్సిమ్ బ్యాంక్ ఎన్డీఆర్వో ముఖ్య ప్రతినిధి జంగ్ వాన్ రియూ, కొరియా ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ(KOICA) డైరెక్టర్ చాంగ్ వూ చాన్ బుధవారం సచివాలయంలో మంత్రి నారా లోకేష్ తో సమావేశమయ్యారు.

Also Read : పరామర్శ సరే… సాయం ఏదీ సారు….!

పెట్టుబడులకు గల అవకాశాలపై చర్చించారు. రాష్ట్రంలో చేపడుతున్న పలు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు సహకారం అందించేందుకు కెక్సిమ్ బ్యాంక్ సంసిద్ధత వ్యక్తం చేసింది. రాష్ట్రంలో పెట్టుబడుల అనుకూల వాతావరణం కోసం ప్రభుత్వం చేపడుతున్న చర్యలు, అందిస్తున్న రాయితీలను ఈ సందర్భంగా ఎగ్జిమ్ బ్యాంకు ప్రతినిధులకు మంత్రి నారా లోకేష్ వివరించారు. పరిశ్రమలకు త్వరితగతిన అనుమతుల మంజూరు కోసం ఈడీబీని పునరుద్ధరించామన్నారు. ఏపీ అభివృద్ధిలో కొరియా సంస్థలు భాగస్వామ్యం కావాలని ఈ సందర్భంగా కోరారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దుమారం రేపుతున్న గరికపాటి...

మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహరావు...

బీఆర్ఎస్ వర్సెస్ కౌశిక్...

రాజకీయాల్లో దూకుడు స్వభావం ఉన్నా పర్వాలేదు...

టీటీడీలో కమాండ్ కంట్రోల్.....

ఏపీ సిఎం చంద్రబాబు మనువడు, మంత్రి...

బ్రేకింగ్: మొయినాబాద్ డ్రగ్స్...

మొయినాబాద్ డ్రగ్స్ ఉదంతంలో అత్యంత కీలకంగా...

గ్రాండ్ గా రామ్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

షిర్డీ సాయిని వెంటాడుతున్న...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని...

పోల్స్