Wednesday, February 4, 2026 07:55 PM
Wednesday, February 4, 2026 07:55 PM

దొంగలు పడ్డ ఆరు నెలలకు.. మౌనం వీడిన మంత్రి గారు…!

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ నేతలను… తెలుగుదేశం పార్టీ నాయకులు అలాగే అధికారులు కాపాడుతున్నారు అనే విషయం చాలా వరకు స్పష్టత ఉంది. రాజకీయంగా వైసిపి బలంగా ఉన్న సమయంలో తెలుగుదేశం పార్టీని నానా రకాలుగా ఇబ్బంది పెట్టినా సరే వారి విషయంలో చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేస్తోంది తెలుగుదేశం పార్టీ నాయకత్వం. అసలు వారిని విమర్శించే ప్రయత్నం కూడా చేయటం లేదు. మరి భయపడుతున్నారా లేక వారితో ఉన్న స్నేహమా లేదంటే లాలూచీపడ్డారా ఏంటి అనేదానిపై క్లారిటీ లేదు.

కానీ కొన్ని కొన్ని పరిణామాలు చూస్తుంటే చాలా ఆశ్చర్యకరంగా ఉన్నాయి. ఎందుకిలా ప్రవర్తిస్తున్నారు అనే అనుమానాలు కలుగుతున్నాయి. తాజాగా మాజీ మంత్రి పేర్ని నాని వ్యవహారంలో కృష్ణాజిల్లా మంత్రి కొల్లు రవీంద్ర అనుసరించిన వైఖరి పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు వస్తున్నాయి. దాదాపు ఈ వ్యవహారం పై పది రోజుల నుంచి ఆరోపణలు వస్తున్నా… ఆయనపై అధికారులు కేసులు నమోదు చేసినా… కొల్లు రవీంద్ర మాత్రం చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నారు. అలాగే మరో మాజీ మంత్రి కొడాలి నాని విషయంలో కూడా పెద్దగా రియాక్ట్ అయ్యే ప్రయత్నం చేయడం లేదు కొల్లు రవీంద్ర.

Also Read : అరంబిందో అక్రమాలపై ఫోకస్.. డోంట్ కేర్ అంటున్న శరత్ చంద్రారెడ్డి..!

పేర్ని నాని ఊరు వదిలి పారిపోయిన తర్వాత సోషల్ మీడియాలో విమర్శలు రావడంతో ఆయనను ఎక్కడున్నా వదిలిపెట్టే ప్రసక్తి లేదంటూ సోమవారం మీడియాతో మాట్లాడారు. ఒకవైపు ఈ కేసు నుంచి బయటకు రావడానికి నాని ప్రభుత్వానికి డబ్బులు కట్టేందుకు కూడా సిద్ధమయ్యారు. అలాగే ఆయనకు కొంతమంది అధికారులు సహకరించి రాష్ట్రం దాటించారు అనే అనుమానాలు కూడా ఉన్నాయి. అయినా సరే కొల్లు రవీంద్ర మాత్రం స్పందించే ప్రయత్నం చేయలేదు. ఒక హత్య కేసులో తన ప్రమేయం లేకుండానే రవీంద్రను అప్పుడు పేర్ని నాని ఇరికించారు అని ఆరోపణలు వినిపించాయి.

అయినా సరే రవీంద్ర మాత్రం మౌనంగా ఉండటం పట్ల చాలామంది షాక్ అయ్యారు. అయితే ఇప్పుడు ఎల్లో మీడియా అలాగే సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో ఆరోపణలు రావడంతో రవీంద్ర రియాక్ట్ అయ్యారు. ఇక పోలీసులు కూడా నాని తప్పుకున్న తర్వాత ఆయన కోసం వెతకడం మొదలుపెట్టారు. ఆయన హైదరాబాదులో ఎక్కడ ఉంటారో తెలిసిన అలాగే మచిలీపట్నంలో ఎక్కడ ఉంటారో తెలిసినా పోలీసులు మాత్రం అరెస్టు చేసే ప్రయత్నం ఏ విధంగా కూడా చేయలేదు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

గుంటూరు కారమా.. మజాకానా…!

గుంటూరు కారం పవర్ ఇన్నాళ్లకు కన్పించింది.....

బాబు-పవన్ భేటీ.. ఆ...

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్...

చంద్రబాబు సలహదారుగా మళ్లీ...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్...

అందరికీ తలో రోగం.....

ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల...

తెలంగాణా సైనికులకు జనసేనాని...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న...

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

పోల్స్