Sunday, March 22, 2026 10:10 AM
Sunday, March 22, 2026 10:10 AM

క్లోజ్ ఫ్రెండ్స్ ను నిండా ముంచిన కొడాలి

మాజీ మంత్రి కొడాలి నానీ అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. గుడివాడ నియోజకవర్గంలో మంత్రిగా ఆయన చేసిన దందాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. కొందరి భూములను కబ్జా చేసిన విధానంపై అప్పట్లో టీడీపీ అనుకూల మీడియా సాక్ష్యాలతో బయటపెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు శరత్ థియేటర్ ను అడ్డం పెట్టుకుని కొడాలి నానీ ఆడిన డ్రామాలు వెలుగులోకి వచ్చాయి. వైస్సార్సీపీ అధికారంలో ఉన్న సమయంలో… థియేటర్ యజమానినని బెదిరించి థియేటర్‌ సొంతం చేసుకున్నాడని గుర్తించారు.

Also Read : జగన్ కి వాసిరెడ్డి పద్మ సంచలన సలహా

గుడివాడ పట్టణ నడిబొడ్డున ఉన్న శరత్‌ థియేటర్‌లో కేవలం అతి తక్కువ వాటా కలిగి ఉన్న మాజీ మంత్రి కొడాలి నాని దాన్ని ఏకంగా సొంతం చేసుకున్నారట. మిగిలిన ఇద్దరు వాటాదారులను బెదిరించి దాదాపు పదేళ్లుగా తన ఆధీనంలో ఉంచుకున్నారట. కూటమి ప్రభుత్వం వచ్చాక ఇటీవల అసలు వాటాదారులు ముందుకొచ్చి తమ థియేటర్‌ను స్వాధీనం చేసుకోవడం గమనార్హం. నియోజకవర్గంలో ఎన్నో ప్లాట్లు, భూములు ఆక్రమించుకున్నారన్న ఆరోపణలు ఇప్పటికే నానీపై ఉన్నాయి. గుడివాడలో కీలక ప్రాంతాల్లో నానీ కబ్జాలకు పాల్పడినట్టు గుర్తించారు.

Also Read : హమ్మయ్య… కష్టపడి సీరీస్ సమం చేశారు..!

గుడివాడలో స్థానిక టీచర్స్‌ కాలనీలోని అక్షర స్కూల్‌కు చెందిన 1,600 గజాల స్థలాన్ని సెటిల్‌మెంట్‌ పేరుతో ఆక్రమించుకున్నారట నానీ. దాన్ని నాని ముఖ్య అనుచరుడు కొల్లి విజయ్‌ పేరుతో ది గుడివాడ అర్బన్‌ బ్యాంకులో తనఖా పెట్టడం గమనార్హం. నందివాడ మండలం పుట్టగుంట వద్ద పాఠశాలకు చెందిన ఖాళీ స్థలంతో పాటు మరికొందరు వ్యక్తులకు చెందిన 7.75 ఎకరాల పొలాలను ఆక్రమించుకుని చెరువు తవ్వడం గమనార్హం. ఇక దేవుడి మాన్యాలను కూడా నానీ వదిలిపెట్టలేదు. ఆయన మంత్రి హోదాలో కబ్జా చేసిన వాటిలో ఆలయాల భూములు కూడా ఉన్నాయని గుర్తించారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దుమారం రేపుతున్న గరికపాటి...

మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహరావు...

బీఆర్ఎస్ వర్సెస్ కౌశిక్...

రాజకీయాల్లో దూకుడు స్వభావం ఉన్నా పర్వాలేదు...

టీటీడీలో కమాండ్ కంట్రోల్.....

ఏపీ సిఎం చంద్రబాబు మనువడు, మంత్రి...

బ్రేకింగ్: మొయినాబాద్ డ్రగ్స్...

మొయినాబాద్ డ్రగ్స్ ఉదంతంలో అత్యంత కీలకంగా...

గ్రాండ్ గా రామ్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

షిర్డీ సాయిని వెంటాడుతున్న...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని...

పోల్స్