Friday, September 12, 2025 09:20 PM
Friday, September 12, 2025 09:20 PM
roots

బోరుగడ్డ ఇంట్లో కీలక పత్రాలు స్వాధీనం

వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రిపబ్లిక్ పార్టీలో ఉంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ అంటే తనకు అభిమానం అంటూ అప్పట్లో బోరుగడ్డ అనీల్ కుమార్ అనే రౌడీ షీటర్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. రాజకీయాల్లో విమర్శలు సహజమే గాని అనీల్ చేసిన వ్యాఖ్యలను ఏ రాజకీయ పార్టీ గాని ప్రజల్లో ఏ వర్గం గాని సమర్ధించే అవకాశం అయితే ఉండదు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అనీల్ పై చర్యలు ఉంటాయని చాలా మంది భావించారు. కానీ అనీల్ విషయంలో రెండు రోజుల క్రితం వరకు ఏ చర్యలు లేకపోవడంతో కాస్త అసహనం కోల్పోయారు.

అయితే అనూహ్యంగా ఇంట్లో ఉన్న బోరుగడ్డ అనీల్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు… రిమాండ్ కు తరలించారు. ప్రస్తుతం అతన్ని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు పోలీసులు. ఇక బోరుగడ్డ అనీల్ విషయంలో పోలీసులు పక్కాగా వ్యవహరించినట్టు సమాచారం. అతనిపై దాదాపుగా 18 కేసులు ఉన్నాయి. ఒక్కో కేసు నుంచి మొదలుపెట్టి అరెస్ట్ చేసారు. ఏ కేసులో బెయిల్ వచ్చినా మరో కేసులో అరెస్ట్ చేసేందుకు సిద్దమయ్యారు. దీనితో అనీల్ బయటకు వచ్చే అవకాశం అయితే దాదాపుగా లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Also Read : దేవినేని ప్రస్థానం ముగిసినట్లేనా..?

ఇదిలా ఉంటే… రెండు రోజుల క్రితం బోరుగడ్డ అనిల్ ఇంట్లో పోలీసులు పెద్ద ఎత్తున సోదాలు చేసారు. వైసీపీ తో బోరుగడ్డ జరిపిన సంభాషణలకు సంబందించిన పలు అనుమానాస్పద పత్రాలను కూడా పోలీసులు ఈ సందర్భంగా స్వాధీనం చేసుకున్నారు. కొన్ని కీలక పత్రాలలో వైసీపీ లోని బడా నేతల పేర్లు ఉన్నట్టుగా సమాచారం. అదే విధంగా… వైసీపీ లోని కొందరు నేతలతో ఆర్ధిక లావాదేవీలకి సంబందించిన కీలక పత్రాలు పోలీసులు గుర్తించినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే తన ఇంట్లో సోదాల సమయంలో బంగారం పోయిందని లేదా విలువైన వస్తువులు పోయాయి అని గాని ఆరోపించాకుండా సోదాలను వీడియో తీసారు పోలీసులు. దీంతో బోరుగడ్డని రెచ్చగొట్టిన వైసీపీ నేతలు ఆందోళనలో ఉన్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్