Tuesday, April 7, 2026 02:54 PM
Tuesday, April 7, 2026 02:54 PM

కవితను బుజ్జగించేందుకు రంగంలోకి కీలక వ్యక్తి..?

బిఆర్ఎస్ అంతర్గత వ్యవహారాలు ఇప్పుడు కల్వకుంట్ల కుటుంబంలో చీలిక తెచ్చిన సంగతి తెలిసిందే. పార్టీ నుంచి కవితను సస్పెండ్ చేసిన తర్వాత కుటుంబంతో కవితకు పెరిగిన దూరం ఒకటి అయితే.. ఆమె పార్టీ పెట్టాలి అనుకోవడం మరో సంచలనం. ఈ నేపధ్యంలో ఈ దూరాన్ని తగ్గించేందుకు కేసీఆర్ సతీమణి శోభ రావు రంగంలోకి దిగడం ఇప్పుడు హాట్ టాపిక్‌ గా మారింది. రాజకీయ విభేదాల కారణంగా కుటుంబం విచ్ఛిన్నం కాకూడదనే ఉద్దేశంతో ఆమె స్వయంగా రంగంలోకి దిగి అమ్మ రాయబారం నడుపుతున్నట్లు తెలుస్తోంది.

Also Read : అధికారుల తీరును బహిరంగంగా.. చంద్రబాబు మార్క్ ట్రీట్మెంట్..!

విభేదాలు ఉన్నప్పటికీ.. కేసీఆర్ సతీమణి మాత్రం రెగ్యులర్ గా కవిత నివాసానికి వెళ్తున్నారట. పార్టీ పరంగా కేసీఆర్ కఠిన నిర్ణయం తీసుకున్నప్పటికీ, తల్లిగా ఆమె కవిత ఇంటికి వెళ్ళడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవల కూడా వీరి మధ్య కీలక భేటీ జరిగినట్లుగా తెలుస్తోంది. దాదాపు గంటకు పైగా సాగిన ఈ భేటీలో రాజకీయాల కంటే కుటుంబ బంధాలకే ప్రాధాన్యత ఇచ్చినట్లు సమాచారం. తన తండ్రిపై, సోదరుడు కేటీఆర్‌ పై కవిత పెంచుకున్న అసంతృప్తిని తగ్గించి, ఆమెను బుజ్జగించేందుకు శోభ రావు ప్రయత్నించినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ముఖ్యంగా, పార్టీలో తనకు జరిగిన అవమానంపై కవిత తీవ్ర ఆవేదనతో ఉన్నారని, అందుకే ఆమె సొంత రాజకీయ పార్టీని స్థాపించేందుకు అడుగులు వేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే, కుటుంబం మొత్తం ఏకతాటిపై ఉండాలని, సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని శోభ రావు సూచించినట్లు తెలుస్తోంది. హరీష్ రావు, సంతోష్ రావులపై కవిత చేసిన వ్యాఖ్యల వల్ల తలెత్తిన వివాదాలను పక్కన పెట్టి, తిరిగి కుటుంబం కలిసి ఉండాలని ఆమె కోరినట్లు సమాచారం.

Also Read : ఫౌజీ లీకులపై మేకర్స్ సీరియస్.. లీక్ చేస్తే అంతే..!

కవిత తీసుకున్న నిర్ణయాన్ని మార్చుకోవాలని కోరడం కంటే, కవితను శాంతింపజేయడమే లక్ష్యంగా ఈ భేటీ జరిగినట్లు కనిపిస్తోంది. ఒకవేళ కవిత పట్టువీడకపోతే అది రాబోయే ఎన్నికల్లో పార్టీపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని అటు కేసీఆర్ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా గ్రేటర్ ఎన్నికలతో పాటుగా మిగిలిన కొన్ని కార్పోరేషన్ లు, మున్సిపాలిటీలలో కవిత పోటీకి దిగితే తమకు నష్టమనే భావనలో కేసీఆర్, కేటిఆర్ ఉన్నట్లు తెలుస్తోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఏపీ లిక్కర్ స్కాంలో...

ఏపీలో సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణం...

అలకపాన్పు ఎక్కిన జమ్మలమడుగు...

గత కొన్నాళ్ళుగా ప్రభుత్వాన్ని ప్రత్యక్షంగా, పరోక్షంగా...

ఇలా అయితే కష్టమే.....

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్...

అధికారుల తీరును బహిరంగంగా.....

అనంతపురం జిల్లా పర్యటనకు వెళ్ళిన ఏపీ...

నరసరావుపేటలో వైసీపీలో రచ్చరచ్చ.....

పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేట వైసీపీలో.....

సట్టా బజార్ షాకింగ్...

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల వేళ...

పోల్స్