Wednesday, February 4, 2026 02:31 PM
Wednesday, February 4, 2026 02:31 PM

కేసీఆర్ లో చంద్రబాబు భయం..? పక్కా స్కెచ్ తోనే పాత రాజకీయం..?

భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ లో టీడీపీ భయం కనపడుతోందా..? అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. తెలంగాణా టీఆర్ఎస్ నయా బీఆర్ఎస్ రాజకీయ నిర్మాణం మొత్తం కూడా టీడీపీ నాయకులతోనే జరిగిన మాట వాస్తవం. పది లేదా పదిహేను మంది మినహా కేసీఆర్ కొత్తగా తయారు చేసిన నాయకత్వం కంటే.. ఆ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో చక్రం తిప్పిన వాళ్ళు అందరూ మాజీ టీడీపీ నాయకులే. అయినప్పటికీ కేసీఆర్ మాత్రం.. టీడీపీ అధినేత, ఏపీ సిఎం చంద్రబాబుపై విమర్శలు చేస్తూనే ఉంటారు.

Also Read : వైసీపీ క్యాడర్ లో కేసీఆర్ జోష్.. పండగే..!

రాజకీయంగా పార్టీ క్షేత్ర స్థాయిలో ఇబ్బంది పడుతోన్న సమయంలో బయటకు వచ్చిన కేసీఆర్ ఇప్పుడు పార్టీని బ్రతికించుకోవడానికి కష్టపడుతున్నారు అనే సంకేతాలు వచ్చాయి. ఇదిలా ఉంచితే.. ఇప్పుడు కేసీఆర్ లో టీడీపీ భయం కనపడుతోంది అనే కామెంట్ బలంగా వినపడుతోంది. దీని వెనుక కారణం.. తెలంగాణాలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం వెనుక చంద్రబాబు లేదా టీడీపీ క్యాడర్ ఉందనే భావనలో బీఆర్ఎస్ ఉంది. సోషల్ మీడియాలో కూడా టీడీపీ.. కాంగ్రెస్ కు అనుకూలంగా పని చేసింది.

Also Read : మోదీ తర్వాత ప్రధాని పదవి ఎవరికో తెలుసా..?

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం.. చంద్రబాబుతో సన్నిహితంగా ఉంటారు. దీనికి తోడు తెలంగాణాలో టీడీపీ పోటీ చేయకపోవడంతో క్యాడర్ మొత్తం రేవంత్ వెంట నడుస్తోంది. పార్టీతో సంబంధం లేకుండా జై రేవంత్ అంటున్నారు. అందుకే ఇప్పుడు చంద్రబాబును అడ్డం పెట్టుకుని విమర్శలు చేస్తే.. తెలంగాణాలో రేవంత్ పై ప్రాంతీయ వాదంతో వ్యతిరేకత పెంచవచ్చు అనే భావనలో కేసీఆర్ ఉండి ఉండవచ్చు. అందుకే పరోక్షంగా చంద్రబాబును మరోసారి కేసీఆర్ టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. జూబ్లిహిల్స్ తో పాటుగా స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం టీడీపీ.. కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చింది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

అందరికీ తలో రోగం.....

ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల...

తెలంగాణా సైనికులకు జనసేనాని...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న...

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

ఇప్పుడు వాళ్లంతా ఏమయ్యారు..?

కూటమి అంటే.. ఒక ఉమ్మడి కుటుంబం...

ఏపీ కేబినేట్ సంచలన...

తిరుమల కల్తీ లడ్డు వ్యవహారానికి సంబంధించి...

దమ్ముంటే అసెంబ్లీకి రా.....

గత రెండు రోజులుగా తనను ఉద్దేశించి...

పోల్స్