Wednesday, February 4, 2026 12:24 PM
Wednesday, February 4, 2026 12:24 PM

బీఆర్ఎస్ కొత్త బాస్ ఫిక్స్..!

భారత రాష్ట్ర సమితి అధ్యక్షులు, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం ఇప్పుడు బీఆర్ఎస్‌లో పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ శాసనసభ నాయకత్వంలో గణనీయమైన మార్పులను కేసీఆర్ ప్రకటించారు. సభలో సమన్వయం, ప్రభావాన్ని బలోపేతం చేసే ప్రయత్నాలలో భాగంగా కేసీఆర్ మార్పులు చేసినట్లు సన్నిహితులు చెబుతున్నారు.

Also Read : షమీకి బిగ్ షాక్..? ఎందుకింత కక్ష..?

బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్, ప్రతిపక్ష నాయకుడు కూడా అయిన కేసీఆర్, తన మేనల్లుడు సిద్దిపేట ఎమ్మెల్యే టి.హరీష్ రావు, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్‌లను అసెంబ్లీలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా నియమించారు. అలాగే శాసనమండలిలో సీనియర్ నాయకులు ఎల్.రమణ, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిలను డిప్యూటీ లీడర్లుగా నియమించగా, దేశపతి శ్రీనివాస్‌ను పార్టీ విప్‌గా నియమించారు. సీనియర్ నాయకుడు ఎస్.మధుసూధనా చారి కౌన్సిల్‌లో బీఆర్‌ఎస్ ఫ్లోర్ లీడర్‌గా కొనసాగుతారు.

ఈ తాజా నియామకాల్లో కేసీఆర్ కుమారుడు కల్వకుంట్ల తారక రామారావు.. కేటీఆర్ గురించి ప్రస్తావన లేకపోవడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్ వ్యవహరిస్తున్నారు. పార్టీ వ్యవహారాలను కేటీఆర్ నిర్వహిస్తున్న తీరు పట్ల కేసీఆర్ అసంతృప్తిగా ఉన్నారనే మాట బాగా వినిపిస్తోంది. కేటీఆర్ తీరు వల్లే కుమార్తె కవిత పార్టీ నుంచి వెళ్లిపోయారని కేసీఆర్ నమ్ముతున్నట్లు తెలుస్తోంది. అందుకే రాష్ట్ర అసెంబ్లీలో పార్టీ వ్యూహాన్ని కేటీఆర్ కంటే మెరుగ్గా హరీష్ రావు నిర్వహించగలరని కేసీఆర్ భావిస్తున్నట్లుందని విశ్లేషకులు అంటున్నారు.

Also Read : ఏపీ వారికి రేవంత్ సంక్రాంతి గుడ్ న్యూస్..!

అసెంబ్లీ కార్యకలాపాల సమయంలో మెరుగైన సమన్వయం, క్రమశిక్షణ, పార్టీ స్థానాలను సమర్థవంతంగా వ్యక్తీకరించడం ఈ పునర్వ్యవస్థీకరణ లక్ష్యమని పార్టీ నాయకులు తెలిపారు. కొత్త నిర్మాణం పార్టీ పనితీరును మెరుగుపరుస్తుందని, తెలంగాణ అసెంబ్లీలో బలమైన ప్రతిపక్షంగా తన పాత్రను పటిష్టం చేస్తుందని బీఆర్ఎస్ నాయకత్వం విశ్వాసం వ్యక్తం చేసింది. నిజానికి హరీష్‌ పైన కేసీఆర్‌కు తొలి నుంచి గట్టి నమ్మకం ఉంది. పార్టీ ప్రారంభించిన తొలి నాళ్లలోనే అసెంబ్లీలో గట్టిగా పోరాడిన నేతల్లో హరీష్ ఒకరు. అందుకే మరోసారి హరీష్ రావుకు ఆ బాధ్యతలన కేసీఆర్ అప్పగించారనే మాట బాగా వినిపిస్తోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తెలంగాణా సైనికులకు జనసేనాని...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న...

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

ఇప్పుడు వాళ్లంతా ఏమయ్యారు..?

కూటమి అంటే.. ఒక ఉమ్మడి కుటుంబం...

ఏపీ కేబినేట్ సంచలన...

తిరుమల కల్తీ లడ్డు వ్యవహారానికి సంబంధించి...

దమ్ముంటే అసెంబ్లీకి రా.....

గత రెండు రోజులుగా తనను ఉద్దేశించి...

బ్రేకింగ్: చంద్రబాబు –...

ఏపీలో ప్రస్తుతం జరుగుతోన్న రాజకీయ పరిణామాలు...

పోల్స్