Sunday, March 22, 2026 01:13 PM
Sunday, March 22, 2026 01:13 PM

మొదటి దెయ్యం ఆయనే.. కవిత మరో సెన్సేషన్..!

గత కొన్నాళ్ళుగా భారత రాష్ట్ర సమితి విషయంలో తీవ్ర వ్యాఖ్యలు చేస్తోన్న మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణా జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసారు. తాజాగా నిజామాబాద్ జిల్లాలో పర్యటించిన కవిత.. సంతోష్ రావు టార్గెట్ గా తీవ్ర వ్యాఖ్యలు చేసారు. గుంపు మేస్త్రికీ ప్రధాన గూఢచారియే సంతోష్ రావు, కేసీఆర్ తినే ఇడ్లి సమాచారాన్ని కూడా రేవంత్ రెడ్డికి చేరేవేసే వ్యక్తే ఆయన అంటూ సంచలన కామెంట్స్ చేసారు. తన గూఢచారికి శిక్షపడకుండా రేవంత్ రెడ్డి కాపాడుకునే పరిస్థితి ఉందన్నారు.

Also Read : మెగాస్టార్‌తో ఢీ అంటున్న సింగర్

కేసీఆర్ కు ఉద్యమకారులను, అమరవీరుల కుటుంబాలను దూరం చేసిన దుర్మార్గుడు అని మండిపడ్డారు. పోలీసులు నిజాయితీగా పనిచేస్తే సంతోష్ రావు కు ఖచ్చితంగా శిక్ష పడుతుందన్నారు. నేను చెప్పిన దయ్యాల్లో మొదటి దెయ్యం సంతోష్ రావే అని.. ఆయనకు హరీష్ రావు, కేటీఆర్ లు ఎందుకు వత్తాసు పలుకుతున్నారో అర్థం కావటం లేదని ఆశ్చర్యం వ్యక్తం చేసారు. గంజాయి, డ్రగ్స్ ముఠాలకు తగిన గుణపాఠం చెప్పాలన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు ఉద్యమకారులకు, అమరవీరుల కుటుంబాలకు దూరం కావటానికి కారణం సంతోష్ రావని వ్యాఖ్యానించారు.

Also Read : బెంగళూరు అంకుల్ ఎక్కడ..? సోషల్ మీడియాలో రచ్చ

గద్దర్ లాంటి నాయకులు గంటలు గంటలు గేట్ బయట వేచి చూడటం, ఈటల లాంటి వారు బయటకు రావటానికి కూడా ఈ సంతోష్ రావే కారణమన్నారు. కేసీఆర్ గారు ఫార్మ్ హౌస్ లో సగం ఇడ్లి తిన్నారా? పూర్తిగా ఇడ్లి తిన్నారా? అన్న సమాచారాన్ని కూడా గుంపు మేస్త్రీకి చేరవేసేది సంతోష్ రావే అని విమర్శించారు. గుంపుమేస్త్రికి ప్రధాన గూఢచారి సంతోష్ రావు. అందుకే ఆ గూఢచారిని శిక్షిస్తాడని నేను నమ్మటం లేదన్నారు. సంతోష్ రావు ను సిట్ పిలవటం మంచిదే.. కానీ ఆయనకు శిక్ష పడటం అనుమానమేనన్నారు. రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా పోలీసులు తమ పని తాము చేయాలని నేను విజ్ఞప్తి చేస్తున్నానన్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దుమారం రేపుతున్న గరికపాటి...

మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహరావు...

బీఆర్ఎస్ వర్సెస్ కౌశిక్...

రాజకీయాల్లో దూకుడు స్వభావం ఉన్నా పర్వాలేదు...

టీటీడీలో కమాండ్ కంట్రోల్.....

ఏపీ సిఎం చంద్రబాబు మనువడు, మంత్రి...

బ్రేకింగ్: మొయినాబాద్ డ్రగ్స్...

మొయినాబాద్ డ్రగ్స్ ఉదంతంలో అత్యంత కీలకంగా...

గ్రాండ్ గా రామ్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

షిర్డీ సాయిని వెంటాడుతున్న...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని...

పోల్స్