ఇటీవల తెలంగాణా విషయంలో ఏపీ డిప్యూటి సిఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపుతున్నాయి. తన వ్యాఖ్యలను వక్రీకరించారని పవన్ కళ్యాణ్ వివరణ ఇచ్చినప్పటికీ.. ఈ వ్యవహారంలో ఇంకా వేడి కొనసాగుతోంది. దీనిపై తెలంగాణా నేతలు కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. తెలంగాణా మంత్రులు కూడా స్పందిస్తూ పవన్ కళ్యాణ్ పై విమర్శలకు దిగారు. ఇదిలా ఉంచితే తాజాగా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై తెలంగాణా జాగృతి అధ్యక్షురాలు కవిత స్పందించారు.
Also Read : కాంగ్రెస్ ను బెదిరిస్తోన్న సిఎం..?
పవన్ కళ్యాణ్ దిష్టి వ్యాఖ్యలపై స్పందించిన కవిత.. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం మన బిడ్డలు ప్రాణాలే త్యాగం చేశారని, కానీ సినిమా యాక్టర్ పవన్ కళ్యాణ్ మాత్రం ఆనాటి నుంచి ఇనాటి వరకు తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్నారని మండిపడ్డారు. తెలంగాణ ప్రజలు ఏనాడు దిష్టి పెట్టలేదన్న ఆమె.. కోనసీమ మాదిరిగా తెలంగాణ కావాలనుకున్నాం అంటూ కామెంట్ చేసారు. తెలంగాణ బిడ్డల మనసు చాలా గొప్పది.. తాము పెద్దగా ఆలోచిస్తామన్నారు కవిత. మా రాష్ట్రం ఏర్పడి 12 ఏండ్లు అయ్యిందని, ఎప్పుడు కూడా ‘జై తెలంగాణ, జై ఆంధ్రా’ అనే అన్నామన్నారు.
Also Read : వినసొంపుగా స్వచ్ఛమైన తెలుగు టైటిల్స్.. ఈ సంక్రాంతికి..!
ఆంధ్రకు ప్రత్యేక హోదా ఇవ్వాలని నేను పార్లమెంట్ లో మాట్లాడానని కవిత గుర్తు చేసుకున్నారు. మేము బాగుండాలనే కోరుకుంటామని, కానీ పక్కోడు చెడిపోవాలని అనుకోం అంటూ స్పష్టం చేసారు. కనుక పవన్ కళ్యాణ్ గారు జాగ్రత్తగా ఆలోచన చేసి మాట్లాడాలని హెచ్చరించారు. అటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సైతం ఈ వ్యాఖ్యల విషయంలో ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు. ఇక వీటికి జనసేన నేతలు కౌంటర్ లు ఇవ్వడంతో రెండు రాష్ట్రాల రాజకీయం ఆసక్తిగా మారింది.

