Friday, August 29, 2025 09:33 PM
Friday, August 29, 2025 09:33 PM
roots

అంతా అబద్దం.. ధర్మస్తలి కేసు క్లోజ్.. సాక్షి అరెస్ట్..!

కర్ణాటకలోని ధర్మస్తలిలో సామూహిక దహనాల వ్యవహారం మరో మలుపు తిరిగింది. దాదాపు నెల రోజుల నుంచి ఈ పరిణామం అక్కడి ప్రభుత్వానికి, పోలీసులకు తలనొప్పిగా మారిన సంగతి తెలిసిందే. రాజకీయంగా కూడా ఇది బిజెపి, కాంగ్రెస్ మధ్య మాటల యుద్దానికి వేదికగా మారింది. గుర్తు తెలియని వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో పెద్ద ఎత్తున పోలీసులు రంగంలోకి దిగి తవ్వకాలు మొదలుపెట్టారు. దీనిపై కర్ణాటక సర్కార్ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని కూడా ఏర్పాటు చేసి విచారణకు ఆదేశించింది.

Also Read : కవితకు అండగా సీనియర్లు.. కెటిఆర్ కు అడ్డు పడుతున్నారా..?

కానీ ఇప్పటి వరకు అక్కడ ఏ విధమైన ఆధారాలు దొరకలేదు అని పోలీసుల విచారణలో వెల్లడి అయింది. దీనితో ఈ వ్యవహారంపై తప్పుడు ఫిర్యాదు చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రమాణం చేసి కూడా అతను అబద్దం చెప్పాడని, అధికారులు పేర్కొన్నారు. ఇది కేవలం కల్పిత కథ అని పోలీసులు స్పష్టం చేసారు. ధర్మస్థలానికి సంబంధించిన కేసులో.. ఫిర్యాదు చేసిన వ్యక్తి పేరు చెన్నా అని పోలీసులు వెల్లడించారు. తనను తాను సాక్షిగా చెప్పుకుంటూ ఫిర్యాదు చేసాడు.

Also Read : చంద్రబాబు.. మళ్లీ అదే బూస్టింగ్..!

విచారణ సమయంలో, అతను తన వాంగ్మూలాన్ని మేజిస్ట్రేట్ వద్ద వినిపించాడు. కాని దానిని నమ్మలేని సిట్.. క్రాస్ ఎగ్జామిన్ చేసింది. దీనితో అతను అబద్దం చెప్తున్నాడని సిట్ నిర్ణయానికి వచ్చింది. ఈ కేసుకు సంబంధించి మరో షాకింగ్ పరిణామం చోటు చేసుకుంది. ధర్మస్థలిలో తన కూతురు తప్పిపోయిందని ఫిర్యాదు చేసిన ఒక మహిళ తన ఫిర్యాదును వెనక్కి తీసుకుంది. సుజాత భట్ తన కూతురు అనన్య భట్ కనిపించకుండా పోయిందని, ఆమె ఎంబీబీఎస్ విద్యార్థిని అని భట్ పేర్కొంది. తర్వాత ఆమె స్థానిక యూట్యూబ్ ఛానల్ లో.. అసలు తనకు కూతురే లేదని చెప్పడం గమనార్హం.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

ఒక్కటే రాజధాని.. కానీ.....

ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడులను ఆహ్వానించే విషయంలో...

ఇదేం ప్యాలెస్.. రిషికొండ...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో నిర్మించిన...

ఏ క్షణమైనా పిన్నెల్లి...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో మాచర్ల...

మరో అవకాశం ఇచ్చినట్లేనా..?

పావలా కోడికి ముప్పావల మసాలా.. అనేది...

అమరావతికి కేంద్రం గుడ్...

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి కేంద్రం గుడ్...

బండి సంజయ్ కు...

తెలంగాణా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి....

పోల్స్