ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రముఖ నేతల్లో కరణం బలరాం ఒకరు. ప్రకాశం జిల్లాకు చెందిన కరణం బలరాం జిల్లాతో పాటుగా రాష్ట్రంలో కూడా మంచి పేరు సంపాదించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకప్పుడు ఆయన పేరు ప్రముఖంగా వినపడేది. తెలుగుదేశం పార్టీలో అత్యంత నమ్మకమైన నాయకుడిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉండేది. అధినేత చంద్రబాబు విషయంలో వీరభక్తుడు అనే కామెంట్స్ కూడా అప్పట్లో వినపడేవి. కానీ 2019 తర్వాత ఆయన పార్టీ మారడం చూసి చాలామంది షాక్ అయ్యారు. అయితే జగన్ బెదిరింపులతో ఆయన పార్టీ మారారు అనే విషయం అప్పట్లో ప్రముఖంగా చర్చకు వచ్చింది.
Also Read : కొలికపూడి కథ కంచికి చేరినట్లేనా..?
ఇక 2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత కరణం బలరాం సైలెంట్ అయిపోయారు. ఇక వైసీపీలో కూడా ఆయనకు ప్రాధాన్యత క్రమంగా తగ్గుతూ వచ్చింది. ఇక కుమారుడి రాజకీయ భవిష్యత్తు కూడా ఆ పార్టీలో పెద్దగా కరణం బలరాంకు ఈ మధ్యకాలంలో కనపడటం లేదనే కామెంట్స్ ప్రకాశం జిల్లాలో వినపడుతున్నాయి. సొంత నియోజకవర్గంలో అద్దంకిలో కూడా పరిస్థితులు తమకు అనుకూలంగా లేకపోవడం కరణం కుటుంబాన్ని కాస్త కలవరపెడుతోంది. ఈ నేపథ్యంలో టిడిపి అధిష్టానంతో రాజీ కోసం కరణం బలరాం ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు వార్తలు వస్తున్నాయి.
Also Read : కరీంనగర్ వాసులకు బండి బంపర్ ఆఫర్..!
ఇటీవల వివాహం సందర్భంగా అత్యంత సన్నిహితుల వద్ద కరణం బలరాం ఓ కామెంట్ చేశారట. తాను మనిషిని వైసీపీలో ఉన్న.. ప్రాణం మాత్రం టీడీపీలోనే ఉందని, అధినేతతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నానని, కానీ కొందరు అడ్డుపడుతున్నారని కొంత ఆవేదనగా మాట్లాడారట. అందుకే ప్రకాశం జిల్లా అధ్యక్ష బాధ్యతలను కరణం వెంకటేష్ కు అప్పగిస్తానన్నా సరే తాము వద్దని చెప్పామని వ్యాఖ్యానించారట. తనకు ఏ పదవులు వద్దని, బే షరతుగా పార్టీలో చేరేందుకు అనుమతించాలని కరణం కోరుతున్నట్లు సమాచారం. అటు బిజెపి కోసం కూడా ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.

