Thursday, February 5, 2026 03:11 AM
Thursday, February 5, 2026 03:11 AM

కవిత కొత్త పార్టీకి ముహుర్తం ఖరారు..!

రాజకీయాల్లో మరో కొత్త పార్టీకి ముహుర్తం ఖరారైంది. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే ప్రధాన పార్టీలు తమ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. అలాగే దాదాపు అన్ని పార్టీలు ఎన్నికల్లో సత్తా చాటాయి. తాజాగా మరో కొత్త పార్టీ కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ప్రత్యేక తెలంగాణ సాధనే ఏకైక లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర సమితిని ప్రారంభించిన మాజీ సీఎం కేసీఆర్.. తొమ్మిదిన్నర ఏళ్ల పాటు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగారు. అయితే భారతీయ రాష్ట్ర సమితిగా పార్టీ పేరు మార్చిన తర్వాత నుంచి కారు జోరుకు బ్రేకులు పడుతున్నాయి. 2023 ఎన్నికల్లో గులాబీ పార్టీ ఓడిపోయింది. ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కనీసం బోణీ కూడా కొట్టలేదు. ఇక కేసీఆర్ కూడా యాక్టివ్ పాలిటిక్స్‌కు దూరంగా ఉంటున్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్‌ను వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు అన్నీ తానే అయ్యి నడిపిస్తున్నారు. ఇదే ఇప్పుడు గులాబీ పార్టీలో తుఫాన్‌కు కారణమైంది.

Also Read : ఏకతాటిపైకి పార్టీ.. లోకేష్ కు రూట్ క్లియర్

తెలంగాణ రాష్ట్ర సమితి ప్రారంభమైన తొలి నుంచే కేసీఆర్‌కు కుటుంబ సభ్యులు అండగా నిలిచారు. కుమారుడు కేటీఆర్, మేనల్లుడు హరీష్ రావుతో పాటు కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత కూడా ప్రత్యేక రాష్ట్ర పోరాటంలో భాగం పంచుకున్నారు. తెలంగాణ జాగృతి పేరు మీద ప్రత్యేక విభాగం ప్రారంభించారు. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. బతుకుమ్మ పండుగ ద్వారా తెలంగాణ ఉద్యమానికి ఊతమిచ్చారు. కాంగ్రెస్ పార్టీకి గట్టి పోటీ ఇచ్చారు కూడా. కేసీఆర్ కుమార్తెగా కాకుండా.. తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సాధించుకున్నారు. జాగృతితో ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చారు. అదే సమయంలో టీఆర్ఎస్ తరఫున ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేశారు. బస్సు యాత్రలు చేశారు. పార్టీ గెలుపులో భాగమయ్యారు. అందుకే కవితకు ఎంపీ టికెట్ ఇచ్చారు కేసీఆర్. పోటీ చేసిన తొలి ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంట్ నుంచి గెలిచిన కవిత.. ఐదేళ్లు పార్లమెంట్ సభ్యురాలిగా కొనసాగారు.

Also Read : అధినేతపై సన్నగిల్లుతున్న నమ్మకం..!

ఆ తర్వాత 2019లో జరిగిన ఎన్నికల్లో మరోసారి పోటీ చేసిన కవిత.. బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ చేతుల్లో ఓడారు. అయితే కుమార్తె ఓటమిని తట్టుకోలేక పోయిన కేసీఆర్.. ఆమెకు శాసనమండలి అవకాశం కల్పించారు. నాటి నుంచి ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. 2023లో బీఆర్ఎస్ ఓటమి తర్వాత కవితను ఇబ్బందులు చుట్టుముట్టాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. మార్చి 15న అరెస్టైన కవితకు సుప్రీం కోర్టు ఆగస్టు 27న షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఆ తర్వాత నుంచి ప్రత్యక్ష రాజకీయాలకు కాస్త దూరంగా ఉంటున్న కవిత.. తాజాగా యాక్టివ్ అయ్యారు.

Also Read : కడప జిల్లా స్వీప్ చెయ్యాలి.. చంద్రబాబు సంచలన కామెంట్స్

కుమారుడి గ్రాడ్యూయేట్ ఫంక్షన్ కోసం అమెరికా వెళ్లిన కవిత.. పార్టీ అధినేత కేసీఆర్‌కు లేఖ రాశారు. అందులో పార్టీలో జరుగుతున్న పరిణామాలను ప్రస్తావించారు. కేసీఆర్ చుట్టూ దెయ్యాలున్నాయంటూ పరోక్షంగా అన్న కేటీఆర్ గురించి ప్రస్తావించారు. పార్టీ 25వ ఆవిర్భావ సభలో బీజేపీ గురించి తక్కువ మాట్లాడటాన్ని కూడా కవిత జీర్ణించుకోలేక పోయారు. తనను అరెస్టు చేసిన బీజేపీ గురించి ఇలా తక్కువగా మాట్లాడటం కమలం పార్టీ పెద్దలతో లోపాయకారి ఒప్పందం చేసుకున్నారనే విషయం కార్యకర్తల్లో వెళ్లే అవకాశం ఉందని లేఖలో ప్రస్తావించారు. ఈ లేఖ తెలంగాణ రాజకీయాల్లో పెద్ద దుమారం రేపింది. ముందు ఈ లేఖ కాంగ్రెస్ పార్టీ కుట్ర అని బీఆర్ఎస్ నేతలు కొట్టిపారేశారు. కానీ అమెరికా నుంచి వచ్చిన కవిత.. ఆ లేఖ తానే రాసినట్లు స్పష్టం చేయడంతో పార్టీలో విబేధాలు తారాస్థాయికి చేరుకున్నట్లు తేలిపోయింది.

Also Read : ఏకతాటిపైకి పార్టీ.. లోకేష్ కు రూట్ క్లియర్

బీఆర్ఎస్‌లో తనకు గుర్తింపు లభించే పరిస్థితి లేదని భావించిన కవిత.. ప్రత్యేక పార్టీ స్థాపించే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే జాగృతి నేతలతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. పలు కమిటీలను ఏర్పాటు చేశారు. బహుజన సామాజిక ట్యాగ్ లైన్‌తో ప్రజల్లోకి వెళ్లేందుకు కవిత ప్లాన్ చేస్తున్నారు. కవిత ప్రత్యేక పార్టీ పెడతారనే సమాచారం కేసీఆర్ తన దూతలను ఆమె దగ్గరకు పంపారు. ఆ చర్చలు విఫలమవ్వడంతో.. జూన్ 2వ తేదీన కవిత కొత్త పార్టీ ప్రకటన ఉంటుందనే పుకార్లు ఇప్పుడు తెలంగాణలో పెద్ద దుమారం రేపుతున్నాయి. కవిత పార్టీ పేరు ఏమిటీ.. ఎవరు చేరనున్నారు.. బీఆర్ఎస్‌కు గట్టి పోటీ ఇస్తుందా లేదా అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. ఏదీ ఏమైనా జూన్ 2న కొత్త పార్టీ ప్రకటన వస్తుందని పొలిటికల్ సర్కిల్‌లో బాగా వినిపిస్తోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

గుంటూరు కారమా.. మజాకానా…!

గుంటూరు కారం పవర్ ఇన్నాళ్లకు కన్పించింది.....

బాబు-పవన్ భేటీ.. ఆ...

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్...

చంద్రబాబు సలహదారుగా మళ్లీ...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్...

అందరికీ తలో రోగం.....

ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల...

తెలంగాణా సైనికులకు జనసేనాని...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న...

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

పోల్స్