Sunday, March 22, 2026 05:52 PM
Sunday, March 22, 2026 05:52 PM

సెన్సేషన్ క్రియేట్ చేసిన రెడ్డప్పగారి మాధవి.. ఇది కడప పౌరుషం అంటే..!

తెలుగుదేశం పార్టీ రాజకీయ చరిత్రలో… ఆ పార్టీలో దూకుడుగా వ్యవహరించి నాయకులు అరుదుగా కనపడుతూ ఉంటారు. పార్టీ నుంచి బయటికి వెళ్లిన నాయకులు దూకుడుగా వ్యవహరించడమే మినహా పార్టీలో ఉన్న వాళ్ళు మాత్రం సైలెంట్ గానే ఉంటారు. క్రమశిక్షణ కారణంగా వీళ్ళందరూ మీడియా సమావేశాల్లో కూడా తమకు నచ్చిన ప్రసంగాలు చేసే అవకాశం సైతం ఉండదు. కానీ కడప ఎమ్మెల్యే రెడ్డప్ప గారి మాధవి రెడ్డి విషయంలో మాత్రం ఇది భిన్నంగా జరుగుతుంది.

Also Read : లోపలికి వెళ్లాలంటే పర్మిషన్ ఉండాల్సిందే..!

కడప కోటను బద్దలు కొట్టి.. 2024లో కడప అసెంబ్లీ నియోజకవర్గ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన రెడ్డప్ప గారి మాధవి రెడ్డి.. దూకుడు వైసిపి నేతలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. దాదాపు 4-5 నెలల నుంచి ఆమె మేయర్ తో పోరాటం చేస్తూ వస్తున్నారు. మేయర్ సురేష్ బాబు తనను పదే పదే అవమానించే ప్రయత్నం చేస్తున్నారని ఆమె పలు మీడియా సమావేశాల్లో కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చారు.. కౌన్సిల్ మీటింగ్ జరిగిన సమయంలో కూడా ఆమె కుర్చీలో కూర్చోకుండా నిలబడి నిరసన తెలిపిన సందర్భం కూడా ఉంది.

Also Read : కేసీఆర్ చేస్తే రైట్.. మరి రేవంత్ చేస్తే..!

ఇక ఎట్టకేలకు మేయర్ సురేష్ బాబును పదవి నుంచి తప్పించడంలో ఆమె అత్యంత కీలకంగా వ్యవహరించారు. సురేష్ బాబు చేస్తున్న వ్యవహారాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి ఆధారాలతో సహా ఫిర్యాదు చేసిన ఆమె.. సురేష్ బాబు రాజకీయ భవిష్యత్తుపై కూడా ఒకరకంగా దెబ్బ కొట్టారని చెప్పాలి. కడప మున్సిపాలిటీ వ్యవహారాలపై సీరియస్ గా ఉన్న ఆమె.. తన దూకుడుతో ఇతర ఎమ్మెల్యేలతో పోలిస్తే కాస్త స్వేచ్ఛగానే పనిచేస్తున్నారు.

Also Read : లోకేష్ కు ప్రమోషన్, మహానాడులో సంచలన నిర్ణయం

సురేష్ బాబుని సస్పెండ్ చేసిన వ్యవహారం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం అవుతుంది. తనని ఇబ్బంది పెట్టాలనుకున్న వ్యక్తిని పదవి నుంచి ఓ మహిళ నేత దింపడం ఆశ్చర్యం కలిగించే విషయమే. 2024 ఎన్నికలకు ముందు కూడా ఆమె ఇలాగే దూకుడుగా వ్యవహరించారు. తన భర్త రెడ్డప్ప గారి శ్రీనివాసులు రెడ్డితో పోలిస్తే ఈమెలో దూకుడు ఎక్కువ. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఆమెకు ఇమేజ్ కూడా పెరుగుతూ వస్తుంది. మరి కొంతమంది అయితే ఓ అడుగు ముందుకేసి ఆమెకు మంత్రి పదవి కూడా ఇవ్వాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దుమారం రేపుతున్న గరికపాటి...

మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహరావు...

బీఆర్ఎస్ వర్సెస్ కౌశిక్...

రాజకీయాల్లో దూకుడు స్వభావం ఉన్నా పర్వాలేదు...

టీటీడీలో కమాండ్ కంట్రోల్.....

ఏపీ సిఎం చంద్రబాబు మనువడు, మంత్రి...

బ్రేకింగ్: మొయినాబాద్ డ్రగ్స్...

మొయినాబాద్ డ్రగ్స్ ఉదంతంలో అత్యంత కీలకంగా...

గ్రాండ్ గా రామ్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

షిర్డీ సాయిని వెంటాడుతున్న...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని...

పోల్స్