Friday, September 12, 2025 04:59 PM
Friday, September 12, 2025 04:59 PM
roots

భారత్ కు బూమ్రా షాక్.. రెండో టెస్ట్ లో కష్టమే

ఇంగ్లాండ్ తో వచ్చే నెల రెండు నుంచి మొదలుకానున్న రెండో టెస్ట్ లో భారత జట్టు కూర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. తుది జట్టులో ఎవరికి చోటు కల్పిస్తారు అనే దానిపై అభిమానుల్లో ఇంకా క్లారిటీ రాలేదు. ఇంగ్లాండ్ రెండో టెస్ట్ కు తుది జట్టును ప్రకటించడంతో భారత్ కూడా త్వరలోనే క్లారిటీ ఇచ్చే అవకాశం కనపడుతోంది. మొదటి టెస్ట్ లో బ్యాటింగ్ ఇబ్బంది లేకపోయినా బౌలింగ్ మాత్రం భారత్ ను ఇబ్బంది పెట్టింది. ఒక్క బూమ్రా మినహా ఏ ఒక్క బౌలర్ కూడా మొదటి టెస్ట్ లో ప్రభావం చూపలేదు.

Also Read : మరో ఇద్దరు హీరోయిన్ల ఫోన్ ట్యాప్..?

భారీ లక్ష్యాన్ని కూడా కాపాడుకునే విషయంలో భారత్ ఘోరంగా ఫెయిల్ అయింది. ప్రసిద్ కృష్ణ, సిరాజ్ ను పక్కన పెట్టాలని డిమాండ్ లు ఉన్నాయి. అయితే ఈ సమయంలో వచ్చిన ఓ వార్త అభిమానులను కలవరపెడుతోంది. బూమ్రా రెండో టెస్ట్ నుంచి తప్పుకునే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అతను ఇప్పటికే జట్టు యాజమాన్యానికి చెప్పినట్టు సమాచారం. అతను తప్పుకుంటే ఆ స్థానాన్ని ఎవరితో భర్తీ చేయవచ్చు అనేది క్లారిటీ లేని పరిస్థితి నెలకొంది. సీనియర్ బౌలర్ షమీని ఇంగ్లాండ్ పిలిచే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Also Read : డబ్బు కోసం లైంగిక వీడియోల అమ్మకం.. హైదరాబాద్ జంట అరెస్ట్

ఇక ఇదే సమయంలో అర్షదీప్ సింగ్ కు తుది జట్టులో చోటు కల్పించడం ఖాయమే అనే అభిప్రాయలు సైతం వినపడుతున్నాయి. లెఫ్ట్ ఆర్మ్ పేసర్ కాబట్టి అతని ప్రభావం ఇంగ్లాండ్ మైదానాల్లో స్పష్టంగా ఉంటుంది. ఇక ప్రసిద్ కృష్ణను, సిరాజ్ ను తప్పించి ఆకాష్ దీప్ సింగ్ ను తుది జట్టులోకి తీసుకోవాలని కోరుతున్నారు ఫ్యాన్స్. బూమ్రా తప్పుకుంటే మాత్రం భారత్ కు ఖచ్చితంగా ఎదురు దెబ్బే. ఆ స్థానాన్ని భర్తీ చేయడం కూడా కష్టమే. ఇక బ్యాటింగ్ లో కూడా అభిమన్యు ఈశ్వరన్ తుది జట్టులోకి వచ్చే సూచనలు కనపడుతున్నాయి.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

ఇదేం ప్రెస్ మీట్...

రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించడం,...

లోకేష్ అదుర్స్.. వార్...

నేపాల్ పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

తమిళనాడు పై పవన్...

తమిళనాడు ఎన్నికలను భారతీయ జనతా పార్టీ...

పోల్స్