Saturday, September 13, 2025 02:35 PM
Saturday, September 13, 2025 02:35 PM
roots

భార్య ఎంట్రీతో జానీ మాస్టర్ కేసులో కీలక ట్విస్ట్

యువ డాన్సర్ ను వేధించిన కేసులో జానీ మాస్టర్ కు పోలీసు విచారణ పూర్తయింది. గత నాలుగు రోజుల నుంచి విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. నిన్నటితో విచారణ పూర్తి కాగా జానీ మాస్టర్ ఇచ్చిన వాంగ్మూలం ఇప్పుడు సంచలనంగా మారింది. ఇక తాజాగా బాధితురాలపై ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కు ఫిర్యాదు చేసిన జానీ మాస్టర్ భార్య సుమలత సంచలన విషయాలను ప్రస్తావించారు. కొరియోగ్రాఫర్ గా పని చేయడం కోసం నా భర్తను ట్రాప్ చేసి ప్రేమ పేరుతో పేధింపులకు గురి చేసిందని ఆమె ఆరోపించారు.

ఐదు సంవత్సరాలుగా నరకం అంటే ఏంటో నాకు చూపించిందని వాపోయిన ఆమె, నేను ఆత్మహత్యా యత్నం చేసుకునే వరకు తీసుకెళ్లింది అంటూ దుమ్మెత్తి పోశారు. నాకు అమ్మ వద్దు, నాన్న వద్దు.. నువ్వు పెళ్లి చేసుకో అంటూ జానీ మాస్టర్ ని తీవ్ర ఒత్తిడికి గురిచేసిందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. నా భర్త జానీ మాస్టర్ ను ఇంటికి రాకుండా అడ్డుకునేదని, కేవలం 2 నుంచి 3 గంటలు మాత్రమే ఇంటికి పంపేది అంటూ సుమలత తన ఫిర్యాదులో ప్రస్తావించారు. బాధితురాలు ఇంటికి వెళ్లి జానీ మాస్టర్ ను నువ్వు ఇష్టపడితే… ఆయన జీవితం నుంచి నేను వెళ్ళిపోతాను అని చెప్పానని ఆమె పేర్కొంది.

Read Also : డిక్లరేషన్ లో జగన్ దళితులను ఎందుకు లాగాడో తెలుసా?

బాధితురాలు మాత్రం మాస్టర్ నాకు అన్నయ్య లాంటివాడు.. మీరు నాకు వదిన అంటూ నమ్మించిందని, నా భర్తతో కాకుండా చాలా మంది మగవాళ్ళతో బాధితురాలు అక్రమ సంబంధం ఉందని ఫిర్యాదులో ప్రస్తావించారు సుమలత. అదే విధంగా ఇవన్నీ తెలుసుకున్న జానీ మాస్టర్ అమ్మాయిని దూరం పెట్టాడని.. దీంతో కక్ష కట్టి తన పైన లైంగిక దాడి చేశాడు అంటూ అక్రమ కేసు పెట్టిందని ఆమె వ్యాఖ్యానించింది. పేరున్న, డబ్బున్న మగవారిని టార్గెట్ చేసి ఇలా వేధింపులకు గురిచేస్తుంది అంటూ చెప్పిన సుమలత బాధితురాలతో పాటు అమ్మాయి తల్లి కూడా ఇబ్బందులకు గురి చేసిందని ఆమె పెట్టిన అక్రమ కేసు ఆరోపణలపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నానని చాంబర్ ఆఫ్ కామర్స్ ను కోరింది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

కేటీఆర్ కు రేవంత్...

భారత రాష్ట్ర సమితి విషయంలో ముఖ్యమంత్రి...

జగన్ పరువును వారే...

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అంటే.....

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

పోల్స్