Wednesday, February 4, 2026 04:21 PM
Wednesday, February 4, 2026 04:21 PM

మాలేపాటి అరెస్టు.. లబోదిబో అంటున్న జగ్గు బ్యాచ్..!

తప్పు ఎవరు చేసినా సరే.. ఎప్పటికైనా శిక్ష తప్పదు.. కానీ తప్పు చేసిన వారిని అరెస్టు చేస్తే మాత్రం అక్రమం అంటున్నారు వైసీపీ నేతలు, అభిమానులు.. మరి ఇదేం లాజిక్కో అర్థం కావటం లేదు. అధికారం కోసం ఓటర్ల కాళ్లు, గడ్డాలు పట్టుకున్నారు. మా అన్న తోపు.. తురుం ఖాన్ అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఎలివేషన్స్ ఇచ్చారు. ఓటరు మహాశయులను ప్రసన్నం చేసుకునేందుకు ఎంతో వినయంతో నటించారు. ఇక మహిళల గురించి అయితే.. వాళ్లకున్నంత గౌరవం, భక్తి మరెవ్వరికీ లేవన్నట్లు నటించారు. జగన్ పాదయాత్ర సమయంలో అయితే.. అక్కచెల్లెమ్మలు, అవ్వా తాతలు.. అభిమానులు.. అంటూ సోషల్ మీడియాలో తెగ పోస్టులు పెట్టారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. వైసీపీ నేతల్లో.. ముఖ్యంగా జగన్ భక్తుల్లో ఉన్న సైకోలు నిద్ర లేచారు. మా పాలననే వంక పెడతారా.. మా అన్ననే మీరు అంటారా అంటూ రెచ్చిపోయారు. ఇంటా బయటా అనే తేడా లేకుండా.. మీడియా ముందు, సోషల్ మీడియాలో అనే విచక్షణ కోల్పోయిన సైకోలు.. ఇష్టం వచ్చినట్లు నోరు పారేసుకున్నారు. మహిళలపై కనీస గౌరవం లేకుండా చెలరేగిపోయారు. తప్పు చేస్తున్నారనే ఎవరైనా ప్రశ్నిస్తే.. వారి పై కూడా సైకోలు విరుచుకుపడ్డారు.

Also Read : మైలవరంలో వైసీపీ ఇసుక డాన్.. అంట కాగుతున్న టీడీపీ నేతలు..!

మాలపాటి భాస్కర్ రెడ్డి.. పుట్టింది నెల్లూరు జిల్లా.. పెరిగింది కృష్ణా జిల్లా.. ప్రస్తుతం ఉంటున్నది లండన్‌లో.. అక్కడ ఓ సూపర్ మార్కెట్ నిర్వహిస్తున్నాడు భాస్కర్ రెడ్డి. వైసీపీ అంటే అభిమానం. ఇంకా చెప్పాలంటే జగన్‌కు వీరాభిమాని. ఇంత వరకు తప్పులేదు. కానీ అభిమానం ముసుగులో రెచ్చిపోయాడు భాస్కర్ రెడ్డి. ముఖ్యంగా జగన్ అధికారంలో ఉన్న సమయంలో సోషల్ మీడియాలో భాస్కర్ రెడ్డి పెట్టిన పోస్టులు చూస్తే.. ఎవరికైనా సరే.. వీడు మనిషేనా అని అనిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే.. జగన్ సతీమణి వైఎస్ భారతీరెడ్డి పీఏ వర్రా రవీంద్రర్ రెడ్డి తర్వాత దారుణమైన కామెంట్లు పెట్టి.. వైసీపీ నేతలు, కార్యకర్తలు ఏ స్థాయికైనా సరే దిగజారుతారు అనేలా వ్యవహరించాడు. ఒక దశలో బోరుగడ్డు అనిల్ అయినా నయమేమో అని సొంత పార్టీ నేతలే వ్యాఖ్యానించారంటే.. మాలేపాటి భాస్కర్ రెడ్డి నోరు ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. జగన్‌ను ఎవరి విమర్శించినా సరే.. వారిపై సోషల్ మీడియాలో విషపు రాతలతో వ్యక్తిత్వ హననానికి తెగబడిన పిల్ల సైకో అనేది సొంత పార్టీలోనే వినిపిస్తున్న మాట.

Also Read : వీధి కుక్కలపై సుప్రీం సంచలన ఆదేశాలు..!

వైసీపీ ఓడిన తర్వాత మాలేపాటి భాస్కర్ రెడ్డి కంట్రోల్ అవుతారని అంతా భావించారు. కానీ లండన్‌లో ఉంటున్నా కదా.. నన్నేం చేస్తారులే అని మరింత రెచ్చిపోయాడు భాస్కర్ రెడ్డి. లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టులు మొదలైన తర్వాత కూడా.. మీ సంగతి జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉంటుందంటూ బెదిరింపులకు దిగాడు. అయితే తప్పు చేసిన వాళ్లు ఎవరైనా సరే ఫలితం అనుభవించాల్సిందే.. అనే విషయం భాస్కర్ రెడ్డికి సరిగ్గా సరిపోతుంది. నిజానికి భాస్కర్ రెడ్డిపై సొంత ఊర్లో కూడా కావాల్సినంత వ్యతిరేకత ఉంది. ఇక ఇటీవల అనారోగ్యం కారణంగా భాస్కర్ రెడ్డి తండ్రి మరణించారు. అంత్యక్రియల కోసం లండన్ నుంచి వచ్చిన భాస్కర్.. నేరుగా నెల్లూరు వెళ్లారు. సొంత ఊరు వెళితే ఇబ్బందులు వస్తాయని భయపడిన భాస్కర్ రెడ్డి.. తండ్రి మృతదేహాన్ని నెల్లూరు తరలించి.. అక్కడే అంత్యక్రియలు నిర్వహించారు. అయితే భాస్కర్ రెడ్డి కదలికల్ని ముందే గుర్తించిన పోలీసులు.. అంత్యక్రియలు పూర్తయ్యే వరకు ఓపిక పట్టారు. మళ్లీ లండన్ పారిపోతున్నాడని తెలుసుకున్న పోలీసులు.. మాలేపాటి భాస్కర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.

Also Read : నా బరువుతో నీకేం పని.. నటి సీరియస్..!

మాలేపాటి అరెస్టుతో వైసీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు రంగంలోకి దిగారు. భాస్కర్ రెడ్డిని అక్రమంగా అరెస్టు చేశారంటూ తెగ గోల పెడుతున్నారు. అసలు ఏం తప్పు చేశాడని పోలీసు స్టేషన్ మీద దాడికి కూడా యత్నించారు. ఇక భాస్కర్ రెడ్డి అయితే నన్ను కొట్టారు అన్న.. అరిచి అరిచి గొంతు కూడా పోయింది.. అంటూ ఇప్పుడు బేల పలుకులు పలుకుతున్నాడు. మరి జగన్‌కు వ్యతిరేకంగా ఉన్నారనే ఒక ఒక్క కారణంతో రఘురామ కృష్ణరాజు ఓ ఎంపీ అనే విషయం కూడా మర్చిపోయి.. హత్య చేయాలని చూసినప్పుడు ఎందుకు మాట్లాడలేదు అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తున్న ప్రశ్న. ఇక వైసీపీ కుక్కల డాక్టర్ చింతా ప్రదీప్ రెడ్డి అయితే.. తండ్రి అంత్యక్రియల కోసం ఇండియా వస్తే.. అరెస్టు చేసి కొట్టడం దారుణం.. అరెస్టులతో ఏం సాధించబోతున్నావు లోకేష్.. అంటూ భాస్కర్ రెడ్డి వీడియో పోస్టు చేశాడు. ఇక వాయిస్ ఆఫ్ ఆంధ్ర అంటూ వైసీపీ భజన చేస్తున్న సోషల్ సైకోలు.. జగన్ సైన్యాన్ని అడ్డుకుంటే.. ఏం జరుగుతుందో చూడు.. అంటూ బెదిరింపులకు దిగుతున్నారు. ఇదే సమయంలో తత్వం బోధపడిన నేతలు మాత్రం.. ప్రతి ఒక్కరి సోషల్ మీడియా అకౌంట్ మీద ఫోకస్ ఉంది.. మార్ఫింగ్ ఫోటోలు, బూతులు వేయడం వల్ల ఏ పార్టీకి లాభం ఉండదు.. వ్యక్తిగతంగా కూడా నష్టమే.. అయితే ఈ విషయం తెలుసుకోవడానికే కాస్త టైమ్ పట్టింది.. అని మెట్ట వేదాంతం మాట్లాడుతున్నారు. మొత్తానికి అధికారంలో ఉన్నప్పుడు సోషల్ మీడియాలో రెచ్చిపోయిన మాలేపాటి భాస్కర్ రెడ్డి వారు.. ఏ పార్టీలో ఉన్నా సరే.. తగిన మూల్యం చెల్లించుకోక తప్పదనే మాట అక్షర సత్యం. ఎవరైనా సరే.. ఏ పార్టీ అయినా సరే.. నోరు అదుపులో పెట్టుకుంటేనే.. మంచిది అనేది వాస్తవం.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

అందరికీ తలో రోగం.....

ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల...

తెలంగాణా సైనికులకు జనసేనాని...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న...

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

ఇప్పుడు వాళ్లంతా ఏమయ్యారు..?

కూటమి అంటే.. ఒక ఉమ్మడి కుటుంబం...

ఏపీ కేబినేట్ సంచలన...

తిరుమల కల్తీ లడ్డు వ్యవహారానికి సంబంధించి...

దమ్ముంటే అసెంబ్లీకి రా.....

గత రెండు రోజులుగా తనను ఉద్దేశించి...

పోల్స్