Wednesday, February 4, 2026 03:36 PM
Wednesday, February 4, 2026 03:36 PM

చెవిరెడ్డి వర్సెస్ పెద్దిరెడ్డి.. నలిగిపోతున్న జగన్..!

ఏపీ మద్యం కుంభకోణం వ్యవహారంలో పరిణామాలు ఏమలుపు తిరుగుతాయో పక్కన పెడితే.. ఆ పార్టీలో రాజకీయంగా ఈ పరిణామం మాత్రం అత్యంత ఇబ్బంది పెట్టే అంశంగానే చెప్పుకోవచ్చు. పార్టీలో కీలక నాయకులు ఈ వ్యవహారంలో ఉండటంతో.. మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఎక్కువగానే ఇబ్బంది పడుతున్నారు. సాధారణంగా అగ్ర నాయకులను అరెస్టు చేయరు అనే భావనలో ఉన్న జగన్ కు, మిథున్ రెడ్డి, చెవిరెడ్డిల అరెస్టు ఓ షాక్ అని చెప్పాలి. ఇక ఈ వ్యవహారానికి సంబంధించి మిథున్ రెడ్డి ఇప్పటికే బయటకు రాగా.. చెవిరెడ్డి మాత్రం జైల్లోనే ఉన్నారు.

Also Read : దేవాలయాలకు టీటీడీ అద్భుత కానుక..!

చెవిరెడ్డిని బయటకు తీసుకువచ్చేందుకు జగన్ ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ అది ఫలించడం లేదు. ఐపీఎస్ అధికారులను బయటకు తీసుకు రాగలిగిన జగన్.. చెవిరెడ్డి విషయంలో మాత్రం దూకుడుగా వెళ్లలేకపోతున్నారు. జాతీయస్థాయిలో ప్రయత్నాలు చేసినప్పటికీ చెవిరెడ్డి మాత్రం బయటకు రావడం లేదు. అయితే మిధున్ రెడ్డి మాత్రం వేగంగా బయటకు రావడంతో.. ఇప్పుడు ఆ పార్టీలో ఓ కీలక చర్చ మొదలైంది. పార్టీ కోసం చెవిరెడ్డి కష్టపడ్డారని.. ఆయనను పార్టీ అధిష్టానం పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కొంతమంది కార్యకర్తలు.

Also Read : లోకేష్‌కు ఇప్పట్లో ఆ ఆలోచన లేనట్లే..!

నందిగం సురేష్, బోరుగడ్డ అనిల్ కుమార్, వంశీ వంటి నాయకులు బెయిల్ మీద బయటకు వచ్చినప్పుడు.. చెవిరెడ్డిని బయటకు ఎందుకు తీసుకురావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిథున్ రెడ్డి విషయంలో జగన్ ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు చేశారని, మరి చెవిరెడ్డి ఏం పాపం చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఆ పార్టీ కార్యకర్తలు. అయితే మిధున్ రెడ్డి కుటుంబానికి చెవిరెడ్డికి మధ్య విభేదాలు ఉన్నాయని.. అందుకే చెవిరెడ్డి విషయంలో జగన్ దూకుడుగా వెళ్లలేకపోతున్నారంటూ మరి కొంతమంది కామెంట్ చేస్తున్నారు. గతంలో రోజా విషయంలో కూడా పెద్దిరెడ్డికి జగన్ సహకారం అందించారని.. ఇప్పుడు కూడా అదే కంటిన్యూ అవుతోందంటూ మండిపడుతున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

అందరికీ తలో రోగం.....

ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల...

తెలంగాణా సైనికులకు జనసేనాని...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న...

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

ఇప్పుడు వాళ్లంతా ఏమయ్యారు..?

కూటమి అంటే.. ఒక ఉమ్మడి కుటుంబం...

ఏపీ కేబినేట్ సంచలన...

తిరుమల కల్తీ లడ్డు వ్యవహారానికి సంబంధించి...

దమ్ముంటే అసెంబ్లీకి రా.....

గత రెండు రోజులుగా తనను ఉద్దేశించి...

పోల్స్