Sunday, March 22, 2026 01:53 AM
Sunday, March 22, 2026 01:53 AM

చెవిలో ఇయర్ బడ్స్ పెట్టొద్దు.. మరి ఎలా శుభ్రం చేసుకోవాలి..?

చాలా మంది వద్దన్న పనినే చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. అందులో ఒకటి చెవిలో కాటన్ స్వాబ్స్ పెట్టడం. దానిలో సుఖం వెతుక్కునే వారు కూడా ఉన్నారు. కానీ అది ఎంత ప్రమాదకరం అనేది వైద్యులు చెప్పినా సరే.. మేము అలా పెట్టలేదు, ఇలా పెట్టడం లేదంటూ కామెంట్స్ చేస్తూ ఉంటారు. ఎలా పెట్టినా.. చెవుడు రావడం ఖాయం అంటున్నారు డాక్టర్లు. శరీరంలోని ఇతర భాగాల మాదిరిగానే, మీ చెవులను శుభ్రం చేసుకోవాలనే బలమైన కోరిక ఉండవచ్చు. కానీ దాని కోసం పుల్లలు చెవిలో పెట్టడం కరెక్ట్ కాదట.

Also Read : మంచి చెడు తెలియట్లేదు.. ఎమ్మెల్యేలపై లోకేష్ ఫైర్

చాలా మంది సాధారణంగా ఇయర్‌ వాక్స్‌ ను తొలగించడానికి ఇయర్‌ బడ్‌లు లేదా కాటన్ స్వాబ్‌లను ఉపయోగిస్తారు. దీని గురించి తాజాగా.. హార్వర్డ్ మరియు స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయాలలో శిక్షణ పొందిన గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ సౌరభ్ సేథి ఓ వీడియో షేర్ చేసారు. అర్జెంట్ గా వాటిని చెవిలో పెట్టడం ఆపాలని కోరారు. చెవిలో కాటన్ స్వాబ్ పెట్టినప్పుడు.. వ్యాక్స్ బయటకు రాకుండా లోపలి వెళ్తుంది. అప్పుడు నొప్పి, ఇతర ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. లేదంటే కర్ణబేరి దెబ్బ తినే అవకాశం ఉంటుంది.

Also Read : లైట్ తీసుకోవద్దు.. జూబ్లీహిల్స్ ఎన్నికపై రేవంత్ సీరియస్

చెవిలో చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. మీరు వాటిని చెవిలో పెడితే.. ఆ స్కిన్ దెబ్బ తినే అవకాశం ఉంటుంది. చిల్లులు కూడా పడే అవకాశం ఉంటుంది. అదనంగా, శుభ్రపరచని వస్తువులను ఉపయోగించడం వల్ల చెవిలోకి బ్యాక్టీరియా ప్రవేశించి, ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది, దీని వలన నొప్పి, వాపు వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ మధ్య కాలంలో చెవి సమస్యలకు ప్రధాన కారణాలు.. చెవుల్లోకి కాటన్ స్వాబ్ లు పెట్టడం కారణమని వివరించారు. ఇక్కడ మీకు తెలియని విషయం ఏంటి అంటే.. చెవికి దానికి దానివి స్వయంగా శుభ్రం చేసుకునే స్వభావం ఉంటుంది. చెవిలో గుమిలి ఉండటం మంచిదేనట. చెవి మార్గాన్ని అది రక్షిస్తూ ఉంటుంది. సహజంగా దానికి అదే బయటకు వెళ్తుంది గాని.. పుల్లలు పెడితే వెళ్లదని సూచించారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దుమారం రేపుతున్న గరికపాటి...

మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహరావు...

బీఆర్ఎస్ వర్సెస్ కౌశిక్...

రాజకీయాల్లో దూకుడు స్వభావం ఉన్నా పర్వాలేదు...

టీటీడీలో కమాండ్ కంట్రోల్.....

ఏపీ సిఎం చంద్రబాబు మనువడు, మంత్రి...

బ్రేకింగ్: మొయినాబాద్ డ్రగ్స్...

మొయినాబాద్ డ్రగ్స్ ఉదంతంలో అత్యంత కీలకంగా...

గ్రాండ్ గా రామ్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

షిర్డీ సాయిని వెంటాడుతున్న...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని...

పోల్స్