Sunday, March 22, 2026 10:01 AM
Sunday, March 22, 2026 10:01 AM

మళ్లీ అధికారం.. సాధ్యమేనా..?

రాజకీయాల్లో ఎత్తుపల్లాలు సహజం. ఏ రాజకీయ పార్టీకి అయినా సరే.. గెలుపు ఓటములు సహజం. 9 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా వ్యహరించిన నారా చంద్రబాబునాయుడు.. పదేళ్ల పాటు ప్రతిపక్షంలో ఉన్నారు. అధికారంలోకి వచ్చేందుకు పాదయాత్ర చేశారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి పదేళ్లు పట్టింది. కేంద్రంలో ఎన్‌డీఏ కూటమి పరిస్థితి కూడా అంతే. అధికారం దక్కాలంటే ఎంతో ఓపిక ఉండాలి. సహనంతో వ్యవహరించాలి. కష్టపడాలి. ప్రజల్లో మంచిపేరు తెచ్చుకోవాలి. ఇంకా చెప్పాలంటే ప్రజా నాడి తెలుసుకోవాలి.

రాజకీయ నేతలు ఊహల్లో ఉండటం సహజం. ఎన్నికలప్పుడు ప్రతి రాజకీయ పార్టీ నేత కూడా మేమే గెలుస్తాం.. మాదే గెలుపు అంటూ ధీమా వ్యక్తం చేస్తారు. మా పార్టీ గెలుస్తుంది… నాకు పదవి వస్తుందని తన అనుచరులతో చెప్తారు. ఇలా ఊహించుకున్న నేతలంతా ఎన్నికల ఫలితాల వరకు ఉహల్లోననే ఉంటారు. అయితే నేతలు కర్ర విడిచి సాము చేస్తే మాత్రం ప్రమాదమే. ప్రత్యర్థి చేతిలో చావు దెబ్బ తినటం ఖాయమే. ఇప్పుడు వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇలాగే ఉన్నారు. ఇంకా చెప్పాలంటే త్రిశంఖు స్వర్గంలో ఉన్నారు. తన పరిస్థితి ఏమిటో తెలుసుకోకుండా.. ఇప్పటికీ ఊహా లోకంలోనే విహరిస్తున్నారు జగన్.

Also Read : జగన్ కు అల్జీమర్స్.. ఓ ఆట ఆడుకుంటున్న సోషల్ మీడియా..!

ఓ వైపు కూటమి సర్కార్ అభివృద్ధి, సంక్షేమం అమలులో చాలా బ్యాలెన్స్‌గా ముందుకు వెళ్తోంది. ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే.. సంక్షేమ పథకాల అమలులో ఎలాంటి ఆటంకం రానివ్వటం లేదు. అలాగే రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు పెట్టుబడుల ఆకర్షణ, మౌలిక వసతుల కల్పనపై చంద్రబాబు సర్కార్ దృష్టి పెట్టింది. రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను పరోక్షంగా కేంద్రానికి అప్పగించింది. పోలవరం ప్రాజెక్టుకు పూర్తిస్థాయిలో నిధులను కేంద్రం చెల్లిస్తోంది. అలాగే అమరావతి నిర్మాణానికి కావాల్సిన ఆర్థిక సహాయానికి కేంద్రం షూరిటీగా ఉంది. దీంతో అమరావతి నిర్మాణం పరుగులు పెడుతోంది. మరోవైపు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు పెద్ద పెద్ద సంస్థలు క్యూ కడుతున్నాయి. ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు కూడా బాగా పెరిగాయి. ఇలాంటి సమయంలో క్షేత్రస్థాయిలో పరిస్థితిని అంచనా వేసుకోవడం చాలా ముఖ్యం.

టీడీపీ నేతలు, వైసీపీ నేతలు ఒకేసారి ఇంటింటి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. తొలి అడుగు పేరుతో టీడీపీ నేతలు తాము ఏడాది కాలంలో అందించిన పథకాలను, చేసిన పనులను చెబుతుంటే.. అసలు ఏడాదిలో ఏం జరగలేదనేది వైసీపీ నేతల ప్రచారం. కొన్ని చోట్ల వైసీపీ నేతలకు చేదు అనుభవం ఎదురవుతోంది కూడా. కూటమి సర్కార్ పింఛన్ పెంచిందని, ఉచితంగా 3 గ్యాస్ సిలెండర్లు వస్తున్నాయని, ఉపాధి దొరుకుతుందని.. రహదారులు బాగు చేశారని.. ఇలా ఎన్నో అంశాలను వైసీపీ నేతలకు లబ్దిదారులు స్వయంగా చెబుతున్నారు. ఇప్పటికే ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి కూడా. అయితే వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డికి మాత్రం వాస్తవ పరిస్థితులు ఇంకా తెలిసినట్లు లేదు.

Also Read : మరోసారి విమర్శలకు ఛాన్స్..!

క్షేత్రస్థాయిలో పరిస్థితులను అంచనా వేయడంలో జగన్ విఫలమయ్యారే మాట ఇప్పుడు సొంత పార్టీ నేతల్లోనే వినిపిస్తోంది. కూటమి సర్కార్‌పై ప్రజల్లో అసంతృప్తి ఉన్నప్పటికీ.. అది వైసీపీ నేతలు చెబుతున్న స్థాయిలో లేదు. ఇంకా చెప్పాలంటే.. ప్రభుత్వంపై వ్యతిరేకత జగన్‌పై అభిమానంతో కాదంటున్నారు కూడా. ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచితంగా ప్రయాణం పథకం అమలు చేస్తే.. ప్రభుత్వంపై ఉన్న కాస్త వ్యతిరేకత కూడా పోతుందనేది కూటమి నేతల ఆశ. తల్లికి వందనంపై వైసీపీ నేతలు పదే పదే విమర్శలు చేశారు. ఇంకా చెప్పాలంటే లేనిపోని ఆరోపణలు చేశారు. అసలు పథకం అమలు చేయలేరని కూడా ప్రచారం చేశారు. కానీ చంద్రబాబు సర్కార్ మాత్రం.. ముందు నుంచి చెప్పినట్లుగానే చెప్పిన తేదీకి నిధులు విడుదల చేసింది. దీంతో వైసీపీ నేతల నోటికి తాళం పడింది. ఇప్పుడు ఉచిత బస్సు ప్రయాణంపై కూడా ఇదే పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత ప్రయాణం అమల్లోకి వస్తే.. ఉన్న కొద్దిపాటి అసహనం కూడా పోతుందని విశ్లేషకుల అభిప్రాయం.

మరో కీలక విషయం.. వైసీపీలో బలమైన నేతలంతా సైలెంట్ అయ్యారనే చెప్పాలి. సజ్జల రామకృష్ణారెడ్డి, అంబటి రాంబాబు, వరుదు కల్యాణి మినహా మిగిలిన నేతలు ఎవరు బయట కనిపించటం లేదు. పేర్ని నాని అప్పుడప్పుడు మాట్లాడుతున్నప్పటికీ.. కేసుల భయంతో సైలెంట్ అయ్యారు. అటు చట్టసభల్లో కూడా వైసీపీ వాణి వినిపించటం లేదు. పార్లమెంట్‌లో సరైన నేత లేరు. అసెంబ్లీకి వైసీపీ నేతలు రావటం లేదు. దీంత ప్రభుత్వాన్ని చూసి వైసీపీ భయపడుతోందనే మాట బాగా వినిపిస్తోంది. ప్రతిపక్ష హోదా లేకపోయినా సరే.. కనీసం అసెంబ్లీకి వెళ్లి ప్రశ్నించాలనేది సగటు ఓటరు భావన. 23 సీట్లు వచ్చినా సరే.. నలుగురు ఎమ్మెల్యేలు పార్టీ మారినా సరే.. చంద్రబాబు అసెంబ్లీకి వచ్చారని.. నోటీకి వచ్చినట్లు దుర్భాషలాడినా సరే.. ఆయన అసెంబ్లీలో ఉన్నారని గుర్తు చేస్తున్నారు కూడా.

Also Read : పొన్నవోలుకు ఓ దండం.. జగన్ వద్దకు పంచాయితీ..!

ఇక లిక్కర్ స్కామ్ కేసులో వాస్తవాలు వెలుగులోకి రావడంతో వైసీపీ ఇమేజ్ పూర్తిగా డామేజ్ అయ్యింది. దీంతో ఈ విషయంపై నిన్నటి వరకు మాట్లాడిన వైసీపీ నేతలంతా ఒక్కొక్కరుగా సైలెంట్ అయ్యారు. ఇది కూడా జగన్‌కు ప్రతికూల అంశమే. కూటమి సర్కార్‌పై ప్రజల్లో వ్యతిరేకత పెరిగి.. అది తనకు అనుకూలంగా మారుతుందనేది జగన్ భావన. కానీ.. కూటమిపై వ్యతిరేకత రాకుండా ప్రభుత్వం చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇవేవీ గ్రహించకుండానే.. జగన్ మాత్రం.. 2.0, అధికారం మనదే.. మళ్లీ గెలుస్తాం.. పోలీసుల గుడ్డలూడదీస్తాం.. నడి బజార్లో నిలబెడతాం.. తాట తీస్తాం.. అంటూ వార్నింగ్ ఇస్తున్నారు తప్ప.. తాను అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారో.. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందో.. తాను మళ్లీ అధికారంలోకి వస్తే.. ఏం చేస్తామో.. అనే అంశాలను ఏ మాత్రం వివరించటం లేదనేది పార్టీ సీనియర్ల మాట. ఇలాగే దూకుడుగా వ్యవహరిస్తే.. దాని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుందని కూడా హెచ్చరిస్తున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దుమారం రేపుతున్న గరికపాటి...

మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహరావు...

బీఆర్ఎస్ వర్సెస్ కౌశిక్...

రాజకీయాల్లో దూకుడు స్వభావం ఉన్నా పర్వాలేదు...

టీటీడీలో కమాండ్ కంట్రోల్.....

ఏపీ సిఎం చంద్రబాబు మనువడు, మంత్రి...

బ్రేకింగ్: మొయినాబాద్ డ్రగ్స్...

మొయినాబాద్ డ్రగ్స్ ఉదంతంలో అత్యంత కీలకంగా...

గ్రాండ్ గా రామ్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

షిర్డీ సాయిని వెంటాడుతున్న...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని...

పోల్స్