తెలంగాణ రాజకీయాల్లో మాజీ మంత్రి కేటీఆర్ మసకబారుతున్నారా..? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయం దెబ్బకు బిఆర్ఎస్ పార్టీలో ఆయన కనుమరుగవుతున్నారా..? అంటే అవుననే సమాధానం వినపడుతోంది. గత ఆరు నెలలుగా తెలంగాణ రాజకీయం ఉత్కంఠ దిశగా పయనిస్తోంది. భారత రాష్ట్ర సమితిలో జరుగుతున్న పరిణామాలు ఏమలుపు తిరుగుతాయో అర్థం కాక ఆ పార్టీ కార్యకర్తలు మల్లగుల్లాలు పడుతున్నారు. అయితే ఇక్కడ రేవంత్ రెడ్డి చేస్తున్న రాజకీయంతో.. మాజీ మంత్రి హరీష్ రావు మీడియాలో ఎక్కువగా నానుతున్నారు. కవిత ఆరోపణల తర్వాత హరీష్ రావు కాస్త ఎక్కువగా హైలైట్ అయ్యారు.
Also Read : విజయసాయి రెడ్డి తర్వాత అన్నకే ఈడీ ఆహ్వానం..?
ఇక ప్రభుత్వంపై విమర్శలు చేసే విషయంలో కూడా హరీష్ రావు దూకుడుగా ఉండటంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా హరీష్ నే టార్గెట్ చేస్తున్నారు. ప్రభుత్వంపై ఇటీవలి కాలంలో హరీష్ చేస్తున్న ఆరోపణలతో అటు మంత్రులు కూడా హరీష్ నే టార్గెట్ చేసే పరిస్థితి వచ్చింది. దీనితో కేటీఆర్ మాట పెద్దగా వినపడటం లేదు. అప్పుడప్పుడు మాట్లాడిన సరే ఏదో ఒక రూపంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనను తీసిపారేస్తున్నారు. తాజాగా సికింద్రాబాద్ జిల్లా విషయంలో, గతంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సమయంలో కేటీఆర్ చేసిన విమర్శలకు రేవంత్ రెడ్డి పెద్దగా ప్రాధాన్యత ఇచ్చినట్టు కనపడలేదు.
Also Read : టీడీపీపై మోదీ సవతి ప్రేమ..?
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నప్పటికీ.. పార్టీ భవిష్యత్తు నాయకుడిగా చెప్పుకుంటున్నప్పటికీ.. కేటీఆర్ కు మాత్రం ప్రాధాన్యత దక్కడం లేదు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు అన్నీ తానై వ్యవహరించిన కేటీఆర్ ఇప్పుడు రేవంత్ రెడ్డి దెబ్బకు మీడియాలో కూడా కనపడటం కష్టంగా మారింది. అటు కార్యకర్తలు కూడా తెలియకుండానే హరీష్ రావును హైలెట్ చేస్తున్నారు. కవిత విషయం తర్వాత.. హరీష్ రావును కాపాడుకునేందుకు బిఆర్ఎస్ నాయకత్వం కూడా గట్టిగానే ప్రయత్నాలు చేసింది. మొన్నటి వరకు కేటీఆర్ కేంద్రంగా నడిచిన రాజకీయం ఇప్పుడు హరీష్ కేంద్రంగా తిరిగింది. తాజాగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం విషయంలో హరీష్ రావు చేసిన వ్యాఖ్యలతో మరోసారి రాజకీయం వేడెక్కింది. కేసులు పరంగా కూడా హరీష్ విషయంలో పెద్దగా తెలంగాణ ప్రభుత్వం దూకుడుగా వెళ్లడం లేదు అనే వ్యాఖ్యలు సైతం వినపడుతున్నాయి.

