టూరిస్ట్ లకు గోవాకు మధ్య దగ్గరి అనుబంధం ఉంటుంది. బడ్జెట్ లో ఉండటంతో చాలా మంది గోవా ప్రిఫర్ చేస్తూ ఉంటారు. విదేశీ అందాలు ఎక్కువగా ఉండటం, మద్యం తక్కువ ధరకు దొరకడం, విదేశీ తరహా బీచ్ లు.. ఇలా గోవా ఎక్కువగా పర్యాటకులను ఆకర్షిస్తూ ఉంటుంది. అయితే కొన్నాళ్ళుగా గోవా టూరిజం పడిపోతుంది అనే కామెంట్స్ వచ్చాయి. గోవా గతంలో మాదిరిగా రిచ్ లొకేషన్ కాదని, ఎవరు పడితే వాళ్ళు వెళ్తున్నారనే భావనలో చాలా మంది ఉండటంతో పెద్దగా గోవాకు వెళ్ళడం లేదనే అభిప్రాయాలు వినిపించాయి.
Also Read : చిక్కుల్లో జక్కన్న.. పోలీస్ కేసు నమోదు
అయితే దీనికి సంబంధించి.. తాజాగా జాతీయ మీడియా పలు లెక్కలను బయటపెట్టింది. కొన్ని నెలలుగా, సోషల్ మీడియాలో గోవా పర్యాటకం కుప్పకూలిపోతోందని పోస్ట్ లు వస్తున్న నేపధ్యంలో.. లెక్కలను విడుదల చేసారు. తాజా గణాంకాల ప్రకారం.. రాష్ట్ర పర్యాటక గ్రాఫ్ ఏమాత్రం దిగజారడం లేదని గుర్తించారు. వాస్తవానికి గ్రాఫ్ క్రమంగా పెరుగుతోందని తేల్చారు. ఈ ఏడాది జనవరి – సెప్టెంబర్ మధ్య చూస్తే.. గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే గోవా మొత్తం పర్యాటక వృద్ధి 6.23 శాతంగా నమోదైంది.
Also Read : మాడ్వీ హిడ్మా.. వైలేంట్ హిస్టరీ.. సిఎం అభ్యర్ధినే లేపేసిన చరిత్ర..!
దేశీయంగా వచ్చే వారి సంఖ్య 5.36 శాతం పెరిగి, 2024లో 69,24,938 నుండి 2025లో 72,96,068కి చేరుకుంది. అంతర్జాతీయంగా వచ్చిన వారి సంఖ్య 29.33 శాతం పెరిగి 2,59,820 నుంచి 3,36,031కి చేరుకుంది. 2023లో 86,28,162 మంది సందర్శకులు గోవాను సందర్శించగా, 2024లో ఈ సంఖ్య 1,04,09,196కు పెరిగింది. ఈ పెరుగుదలలో దేశీయ రాకపోకలు 2023లో 81,75,460 నుండి 2024లో 99,41,285కి పెరిగాయి. ఇదే కాలంలో విదేశీయుల సంఖ్య 4,52,702 నుండి 4,67,911కి పెరిగింది. కొత్త విమానయాన రూట్ లు పెరగడంతో.. ఇక్కడికి రష్యాలోని ఎకాటెరిన్‌బర్గ్, నోవోసిబిర్స్క్, మాస్కో, అలాగే కజకిస్తాన్ లకు కొత్త రూట్ లు ఉండటంతో.. విదేశీయుల సంఖ్య పెరిగింది. చార్టెడ్ విమానాల్లో వచ్చే వారి సంఖ్య కూడా ఎక్కువే.

