Saturday, April 11, 2026 09:18 PM
Saturday, April 11, 2026 09:18 PM

కృత్రిమ షుగర్ తో పుట్టే పిల్లలపై ఎఫెక్ట్..?

చాలామంది బరువు తగ్గాలనో లేక షుగర్ పెరుగుతుందనో పంచదారకు బదులుగా ఆర్టిఫిషియల్ స్వీటనర్స్ వాడుతుంటారు. అయితే, ఇవి కేవలం మన ఆరోగ్యాన్నే కాదు, మన పుట్టబోయే తరాల ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఎలుకలపై జరిపిన తాజా పరిశోధనలో ఈ షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. తల్లిదండ్రులు తీసుకునే ఈ కృత్రిమ తీపి పదార్థాల వల్ల కలిగే దుష్ప్రభావాలు వారి పిల్లలకు కూడా సంక్రమిస్తాయని ఈ అధ్యయనం చెబుతోంది.

Also Read : రాజ్యసభ రచ్చ.. ఎవరిని వరిస్తుందో..!

ఈ పదార్థాల ప్రభావం వల్ల శరీరంలోని కణాల్లో జన్యుపరమైన మార్పులు వచ్చే అవకాశం ఉందని, అందుకే ఆ లక్షణాలు తర్వాతి తరాలకు బదిలీ అవుతున్నాయని పరిశోధకులు గుర్తించారు. ముఖ్యంగా జీవక్రియలు దెబ్బతినడం, ఎదుగుదలపై ప్రభావం చూపడం వంటివి జరుగుతాయని పరిశోధకులు గుర్తించారు. కేవలం తర్వాతి తరాలకు సంక్రమించడమే కాకుండా, వీటి వల్ల మన శరీరంలో అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని ఈ అధ్యయనం స్పష్టం చేస్తోంది. గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ సమస్యలు తలెత్తుతాయని నిపుణులు హెచ్చరించారు.

Also Read : మ్యారేజ్ సర్టిఫికెట్ వల్ల ఉపయోగాలేంటి..?

తరచుగా తలనొప్పి రావడం, నరాలకు సంబంధించిన ఇబ్బందులు కలగడం వంటివి జరుగుతాయట. కార్డియో వాస్కులర్ రిస్క్ పెరగడం వల్ల గుండెపోటు వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. మన జీర్ణ వ్యవస్థలో ఉండే మంచి బ్యాక్టీరియాను ఇవి చంపేస్తాయి. దీనివల్ల రోగనిరోధక శక్తి తగ్గిపోయి తరచుగా జబ్బుల బారిన పడే ప్రమాదం ఉంది. షుగర్ తగ్గించుకోవడానికి వాడితే, ఇవి మెటబాలిక్ కండిషన్స్ మార్చడం ద్వారా మళ్ళీ డయాబెటిస్ ముప్పునే పెంచుతాయని సూచిస్తున్నారు. డైట్ సోడాలు, షుగర్-ఫ్రీ కాఫీలు, స్వీట్లలో వాడే ఈ కృత్రిమ పదార్థాల పట్ల అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. సహజసిద్ధమైన ఆహారం కంటే ఇలాంటి ప్రత్యామ్నాయాల వైపు వెళ్లడం వల్ల దీర్ఘకాలంలో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

కేసీఆర్ యుద్ధం షురూ.....

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాల దిశగా...

ఆర్టీసీ ఉద్యోగుల కోసం...

ఈ మధ్య కాలంలో గుండెపోటు అనే...

వైసీపీపై షర్మిల విశ్వరూపం.....

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్...

దేశ చరిత్రలోనే తొలిసారి.....

భారత ఎన్నికల వ్యవస్థలో విమర్శలకు వేదికగా...

బీ అలర్ట్.. మెయిన్...

తెలుగు రాష్ట్రాల ప్రజలకు రైల్వే శాఖ...

బ్రేకింగ్: సింగర్ మంగ్లీపై...

ప్రముఖ గాయని మంగ్లీ మరో వివాదంలో...

పోల్స్