Tuesday, March 24, 2026 10:13 AM
Tuesday, March 24, 2026 10:13 AM

అర్నాబ్ తీరులో మార్పు ఎందుకు వచ్చింది..?

అర్నాబ్ గోస్వామి.. ఈ పేరు భారత్‌లో బాగా ఫేమస్. ఇంకా చెప్పాలంటే న్యూస్‌తో టచ్ ఉన్న వారికి అర్నబ్‌ను కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బీజేపీ అనుకూల జర్నలిస్ట్‌గా అర్నబ్ గోస్వామికి పేరు. అలాగే బీజేపీ ఎంపీ అధినేతగా ఉన్న రిపబ్లిక్ టీవీకి మేనేజింగ్ డైరెక్టర్‌గా అర్నబ్ పని చేస్తున్నారు. ఇక తన కెరీర్‌లో ఎక్కువ కాలం బీజేపీకి మద్దతుగానే గడిపారు. కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా విమర్శించే వ్యక్తిగా అందరికీ అర్నబ్ సుపరిచితం. ఏ చిన్న విషయం అయినా సరే.. అర్నాబ్ షోలో టార్గెట్ కాంగ్రెస్ అన్నట్లుగా సాగుతుంది. అయితే ఇటీవల అర్నాబ్ తీరుపై అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Also read : టీడీపీ మహిళా ఎమ్మెల్యే స్పీడ్.. ఫిదా అయిపోయిన క్యాడర్

మోదీ సర్కార్‌పై ఇప్పటి వరకు అర్నాబ్ ఈగ వాలనివ్వలేదు అనేది వాస్తవం. 2014 నుంచి ఇప్పటి వరకు మోదీని అర్నాబ్ వెనకేసుకొస్తూనే ఉన్నారు. మోదీతో ఉన్న పార్టీలకు మద్దతు తెలియజేస్తారు. మోదీని వ్యతిరేకించే పార్టీల గురించి ప్రత్యేక డిబేట్‌ కూడా పెడతారు. అలాంటి అర్నాబ్ తీరు ఇటీవల కొన్ని సందేహాలకు తావిస్తోంది. తాజాగా ఇండిగో ఎయిర్‌లైన్ సంక్షోభం విషయంలో.. ఆరావళి కొండలలో పర్యావరణ క్షీణత, ఢిల్లీ కాలుష్య సంక్షోభం వంటి అంశాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని ఇటీవల అర్నాబ్ చేసిన దాడులు రాజకీయ, మీడియా వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.

అయితే అర్నాబ్‌లో మార్పు వెనుక పెద్ద ప్లాన్ ఉందనేది రాజకీయ విశ్లేషకులు, సోషల్ మీడియాలో విస్తృతంగా వినిపిస్తున్న మాట. ఈ మార్పును ఆకస్మిక సైద్ధాంతిక విరామంగా కాకుండా.. అర్నాబ్ గోస్వామి వ్యూహంగా అర్థం చేసుకుంటున్నారు. అర్నాబ్ గోస్వామి ఇటీవలి విమర్శలు ఎక్కువగా సమస్యల ఆధారితమైనవని, విమాన ప్రయాణీకులకు అసౌకర్యం, పర్యావరణ విధ్వంసం వంటి ప్రజా జీవితాన్ని ప్రత్యక్షంగా ప్రభావితం చేసే విషయాలపై దృష్టి సారించాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. “the people are the real opposition”.. “ప్రజలే నిజమైన ప్రతిపక్షం” అని అర్నాబ్ చేసిన ప్రసంగం, గతంలో తనకున్న “ప్రజల జర్నలిస్ట్” ఇమేజ్‌ను తిరిగి పొందే ప్రయత్నం అని వ్యాఖ్యానిస్తున్నారు అన్నారు.

Also read : కార్యకర్తలకు లెటర్లు ఇవ్వరా..? ఎమ్మెల్యేలపై ఆగ్రహం..!

“గోడి మీడియా” అనే ట్యాగ్‌ను తొలగించడం అర్నాబ్ విశ్వసనీయత నిర్వహణలో ఒక భాగమని, ముఖ్యంగా 2029 ఎన్నికల కంటే ముందు , సంపాదకీయ నిజాయతీ ప్రదర్శించడం ద్వారా రిపబ్లిక్ టీవీ విశ్వసనీయతను మరింత బలోపేతం చేయడానికి ఆయన ప్రయత్నిస్తున్నారనే మాట కూడా వినిపిస్తోంది. ఇదే సమయంలో బీజేపీ నాయకత్వం అర్నాబ్‌ను ఉద్దేశపూర్వకంగా దూరంగా ఉంచడమే అని.. ఎందుకంటే నాయకత్వాన్ని అర్నాబ్ బ్లాక్‌మెయిల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఢిల్లీ మీడియా – మేనేజ్‌మెంట్ విధానంలో మార్పుల కారణంగా కాషాయ పార్టీలో తన ప్రభావాన్ని అర్నాబ్ కోల్పోతున్నారనేది మీడియా సర్కిల్‌లో వినిపిస్తున్న మాట.

అయితే, అర్నాబ్ మాత్రం బిజెపిపై నేరుగా ఎలాంటి రాజకీయ దాడులు చేయటం లేదు. కానీ వ్యూహాత్మకంగా వ్యవస్థాగత వైఫల్యాలు, అధికారిక లోపాలు, నిర్దిష్ట మంత్రిత్వ శాఖలను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది. నరేంద్ర మోడీని లేదా బీజేపీ భావజాలాన్ని అర్నాబ్ నేరుగా సవాలు చేయడం లేదు. “ఇది రిపబ్లిక్ టీవీ.. బిజెపి అనుకూల మీడియా సంస్థ కాదు, తటస్థ మీడియా అనే అభిప్రాయాన్ని ప్రజలలో కలిగించడం తప్ప మరొకటి కాదు… అని ఇప్పటికే పలుమార్లు అర్నాబ్ బహిరంగంగానే వ్యాఖ్యానించారు. బీజేపీ పెద్దలు కరుణిస్తే.. రాజకీయ పదవి వచ్చే అవకాశం ఉందనే మాట కూడా వినిపిస్తోంది. మరి ఇన్ని రోజులు చేసిన సేవకు ఆ మాత్రం ప్రతిఫలం ఉండాలి కదా అనేది పొలిటికల్ సర్కిల్‌లో వినిపిస్తున్న మాట.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దానంపైనే బీఆర్ఎస్ గురి..?...

2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి తర్వాత.....

అమరావతికి ఎన్నో ప్రత్యేకతలు..!

హైదరాబాద్‌ను అధిగమించేలా అమరావతిని అభివృద్ధి చేస్తామని...

శ్రీశైలం డ్యామ్ పునాదులు...

రెండు తెలుగు రాష్ట్రాల సాగు, జల...

కావలి టీడీపీలో గ్రూపు...

ఓ వైపు టీడీపీ అధిష్టానం, సిఎం...

జగన్‌తో ఒంటరి పోరాటం...

ఉమ్మడి కడప జిల్లాలో ఆ ఎమ్మెల్యే...

ఏపీలో ఏనుగు దంతాల...

వన్య ప్రాణుల భద్రత విషయంలో ప్రభుత్వాలు...

పోల్స్