Tuesday, October 28, 2025 01:45 AM
Tuesday, October 28, 2025 01:45 AM
roots

ఇజ్రాయిల్ కు చుక్కలు చూపిస్తున్న ఇరాన్.. యుద్ధం మొదలు

అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత మిడిల్ ఈస్ట్ దేశాల్లో పరిస్థితి ఆందోళన కలిగిస్తుంది. ముందు నుంచి ఈ దేశాల విషయంలో అమెరికా వైఖరి వివాదాస్పదంగానే ఉంటుంది. సహజ వనరుల కోసం అమెరికా ఈ దేశాల్లో చిచ్చు పెట్టి పబ్బం గడుపుకుంటూ వస్తోంది. ఇజ్రాయిల్ ను అడ్డం పెట్టుకుని ముస్లిం దేశాలపై దాడులకు దిగుతుంది అమెరికా. సద్దాం హుస్సేన్ బ్రతికున్న సమయంలో ఆయనను వేధించి హతమార్చిన అమెరికా ఇరాక్ ను దారిలోకి తెచ్చుకుంది.

Also Read : ఆ విషయంలో అన్నకు చెల్లి మద్దతు..!

ఇప్పుడు ఇరాన్ మీద గురి పెట్టింది. ఇరాన్ అధ్యక్షుడు అణు ఒప్పందానికి అంగీకరించకపోవడంతో.. ఇజ్రాయిల్ ద్వారా దాడులు చేయిస్తోంది అమెరికా. ఇరాన్ సైనిక అధికారులను వరుసగా ఇజ్రాయిల్ హత మారుస్తూ వస్తోంది. దీనికి ఇరాన్ కూడా అదే రేంజ్ లో సమాధానం ఇచ్చింది. ఇజ్రాయిల్ రాజధానిపై బాలిస్టిక్ మిస్సయిల్స్ ను పెద్ద ఎత్తున ప్రయోగించింది. ఈ దాడులతో ఒక్కసారిగా ఇజ్రాయిల్ వణికిపోయింది. ఇజ్రాయిల్ వద్ద ఉన్న రక్షణ వ్యవస్థ కూడా విఫలం కావడంతో.. ఆ దేశ ప్రజలకు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని పరుగులు తీశారు.

Also Read : తల్లికి వందనంపై విమర్శలు అందుకే రాలేదా..?

ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే రెండు దేశాల మధ్య యుద్ధం తీవ్రంగా జరిగే అవకాశాలు ఉండవచ్చు అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎప్పటికైనా ఇరాన్ తమకు ముప్పుగా మారే అవకాశం ఉందని భావిస్తున్న అమెరికా ఎలాగైనా సరే ఆ దేశాన్ని దారిలోకి తెచ్చుకోవాలని అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఇక ఇరాన్ విషయంలో పాకిస్థాన్ ను కూడా అడ్డం పెట్టుకునే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. అయితే ఇరాన్ కు మద్దతు ఇవ్వడానికి రష్యా ముందుకు వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. ఉగ్రవాదంపై పౌరులు ఇరాన్ కు సహకరించిన రష్యా ఇప్పుడు అమెరికాపై పోరులో ఇజ్రాయిల్ కు వ్యతిరేకంగా పోరాడే అవకాశాలు ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధంతో ప్రభావితం అవుతున్న ప్రపంచ వాణిజ్యం.. ఇరాన్, ఇజ్రాయిల్ దేశాల మధ్య యుద్ధం జరిగితే మాత్రం మరింతగా ఇబ్బంది పడే అవకాశాలుంటాయి.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్