Monday, October 27, 2025 08:59 PM
Monday, October 27, 2025 08:59 PM
roots

వారం రోజుల్లో ఐపిఎల్ రీస్టార్ట్..?

ప్రస్తుత ఐపీఎల్ 2025 సీజన్‌ను ఒక వారం పాటు మాత్రమే నిలిపివేయాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నిర్ణయించిందని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ శుక్రవారం మధ్యాహ్నం విడుదల చేసిన అధికారిక తమ అధికారిక ప్రకటనలో వెల్లడించింది. ధర్మశాలలో గురువారం ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరుగుతున్న ఐపీఎల్ 2025 మ్యాచ్ ను, పరిసర ప్రాంతాల్లో బ్లాక్‌ అవుట్ కారణంగా ఆట మధ్యలో రద్దు చేసారు. ఇక అక్కడి నుంచి ఐపిఎల్ ను రద్దు చేస్తారని అందరూ భావించారు.

Also Read : అందరి పేర్లు రాసిపెట్టుకోండి..జగన్ 2.0లో తేలుస్తా..!

ఐపిఎల్ జట్ల యాజమాన్యాలు, బోర్డు పెద్దలతో కలిసి చర్చించిన తర్వాత టోర్నమెంట్ యొక్క కొత్త షెడ్యూల్, వేదికలను ఖరారు చేస్తామని ఐపిఎల్ గవర్నింగ్ కౌన్సిల్ వెల్లడించింది. అన్ని ఫ్రాంచైజీలు, వారి ఆటగాళ్ల ఆందోళన, మనోభావాలను, అలాగే బ్రాడ్ కాస్టర్లు, స్పాన్సర్లు, అభిమానుల అభిప్రాయాలను తెలుసుకున్న తర్వాతనే ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఈ నిర్ణయం తీసుకుందని ఓ ప్రకటనలో తెలిపారు. సాయుధ దళాల బలం, సామర్ధ్యాలపై బీసీసీఐకి పూర్తి విశ్వాసం ఉన్నప్పటికీ.. జట్టు యాజమాన్యాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని వ్యవహరించాలని బోర్డు భావించిందని.. జాతీయ మీడియాతో మాట్లాడిన ఓ అధికారి వెల్లడించారు.

Also Read : యుద్ధం మొదలైందా..? పాక్ టార్గెట్ చేసిన సిటీలు ఇవే

కాగా ఈ శుక్రవారం మధ్యాహ్నం జరిగిన ఓ సమావేశంలో బోర్డు కీలక ప్రకటన చేసింది. విదేశీ ఆటగాళ్లను వారి వారి దేశాలకు సురక్షితంగా పంపిస్తున్నామని, ఐపిఎల్ ను నిరవధికంగా వాయిదా వేస్తున్నామని వెల్లడించింది. దీనితో ఐపిఎల్ ను దుబాయ్ లేదా మరో దేశంలో నిర్వహిస్తారని అందరూ భావించారు. ఈ తరుణంలో వచ్చిన ఈ కీలక ప్రకటనతో అభిమానులు హర్షం వ్యక్తం చేసారు. ఇక ఐపిఎల్ నిర్వహణ విషయంలో అటు కేంద్రం అసహనం వ్యక్తం చేయడంతోనే నిలిపివేసినట్టు తెలుస్తోంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్