Wednesday, February 4, 2026 04:23 PM
Wednesday, February 4, 2026 04:23 PM

తెలుగు పులి కోసం.. ఇంటర్నేషనల్ వేటగాళ్లు రంగంలోకి..?

పెద్ద పులుల పరిరక్షణ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా కష్టపడుతున్న సమయంలో అంతర్జాతీయ వేటగాళ్లు ఆందోళన కలిగిస్తున్నారు. పెద్దపులుల సంఖ్య పెరుగుతోంది అనే సంతోష పడేలోపే.. అంతర్జాతీయ వేటగాళ్లు, అంతర్జాతీయ స్థాయిలో వేసే ఉచ్చులను అడవుల్లోకి తీసుకొస్తూ పెద్దపులీలను వేటాడుతున్నారు. నాగార్జునసాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ జోన్ లో పెద్ద ఎత్తున పెద్దపులులు ఉన్నాయి. ప్రతి ఏటా ఇక్కడ పులుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇదే సమయంలో అంతర్జాతీయ స్మగ్లర్ల.. ఆగడాలు కూడా నల్లమల అటవీ ప్రాంతంలో పెరిగిపోతున్నాయి.

Also Read  : ఏపీలో ఆక్టివ్ అయిన బీజేపీ కోవర్టులు..?

అటవీ శాఖ అధికారులు తాజాగా గుర్తించిన కొన్ని ఉచ్చులు చూసి అక్కడి స్థానిక ప్రజలు కూడా ఆశ్చర్యపోయారు. ఆత్మకూరు డివిజన్లోని నాగులుటి రేంజ్ లో పులులను బంధించేందుకు ఉపయోగించే టైగర్ ట్రాప్ బయటపడింది. ఇలాంటి ఉచ్చులను అంతర్జాతీయ పులుల స్మగ్లర్లు మాత్రమే ఉపయోగిస్తారని అధికారులు అంటున్నారు. 12 ఏళ్ల క్రితం ఇదే డివిజన్లో వెలుగోడు రేంజ్ పరిధిలో ఇలాంటివి దొరికినట్లు చెప్తున్నారు. ఆ తర్వాత ఇప్పుడు ఇలాంటి ఉచ్చు కనపడి భయపెడుతోంది. గడిచిన మూడేళ్లలో ఎన్ ఎస్ టి ఆర్ లోని వేర్వేరు ప్రాంతాల్లో మూడు పెద్ద పులులు మెడకు ఉచ్చు బిగిసి చనిపోయి కనిపించాయి.

Also Read  : ఈ చిచ్చు ఎప్పుడు చల్లారుతుందో..?

పులుల గణాంకాల కోసం అటవీ శాఖ అధికారులు రంగం సిద్ధం చేస్తూ.. నల్లమల అటవీ ప్రాంతంలో సంచరిస్తున్నారు. ఈ క్రమంలో సిబ్బందికి మోటార్ సైకిల్ క్లచ్ వైర్లతో ఏర్పాటు చేసిన ఉచ్చులతో పాటుగా పులికాలను పట్టివేసేలా అత్యంత నైపుణ్యంతో తయారుచేసిన టైగర్ ట్రాప్ కూడా కనబడింది. ఈ విషయం తెలియడంతో వెంటనే అటవీ శాఖ అధికారులు పెద్ద ఎత్తున అడవిలో గాలింపు మొదలుపెట్టారు. అటు స్థానిక గ్రామాల ప్రజలను కూడా పోలీసులు అప్రమత్తం చేశారు. ఎవరైనా అనుమానిత వ్యక్తులు అడవిలో సంచరిస్తున్నట్లు గుర్తిస్తే తమకు సమాచారం ఇవ్వాలని, వారిని బంధించి ఉంచాలని ఆదేశించారు. అటు ఉచ్చుల కోసం పెద్ద ఎత్తున గాలింపు చేపట్టాలని కూడా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు వెళ్లాయి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

అందరికీ తలో రోగం.....

ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల...

తెలంగాణా సైనికులకు జనసేనాని...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న...

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

ఇప్పుడు వాళ్లంతా ఏమయ్యారు..?

కూటమి అంటే.. ఒక ఉమ్మడి కుటుంబం...

ఏపీ కేబినేట్ సంచలన...

తిరుమల కల్తీ లడ్డు వ్యవహారానికి సంబంధించి...

దమ్ముంటే అసెంబ్లీకి రా.....

గత రెండు రోజులుగా తనను ఉద్దేశించి...

పోల్స్