Wednesday, February 4, 2026 12:29 PM
Wednesday, February 4, 2026 12:29 PM

కుహానా మేధావుల కొత్త ఆట : టార్గెట్ చంద్రబాబు..!

కాచిన చెట్టుకే రాళ్ల దెబ్బలు అన్నట్లే, పనిచేసేవారిపైనే ఎక్కువ విమర్శలు వస్తాయి. పరీక్ష రాయగానే తప్పులు–ఒప్పులు తెలుస్తాయి. కానీ “నేను తెలివైన వాడిని, కాబట్టి పరీక్ష రాయను” అనడం ఎంత అర్థంలేనిదో… పని చేసే నాయకుడిని కూడా అదే విధంగా విమర్శించడం అంతే తేడా. ఇప్పుడు చంద్రబాబు విషయంలో కూడా ఇలాంటి ప్రచారమే నడుస్తోంది. చంద్రబాబు ఎప్పుడూ అభివృద్ధి — పరిశ్రమలు — విజన్ అనే మూడు అంశాల దారిలోనే నడిచారు. కానీ ఆ విజన్‌ను గుర్తించాల్సిన చోట ప్రజలు, మరీ ముఖ్యంగా టీడీపీ శ్రేణులు కూడా కొన్నిసార్లు అతి సాధారణంగా తీసుకుంటున్నారు. ఇతర ముఖ్యమంత్రులతో పోలిస్తే చంద్రబాబు ఆలోచనల పరిమాణం, అమలు శక్తి ఎంత విస్తృతమైందో పరిశీలిస్తే… ఆయనపై ఎవరూ సులభంగా మాట అనలేరు.

Also Read : ఆ నేతకు అండగా “కాపు” కాస్తోంది ఎవరు..?

హైదరాబాద్‌ను ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. సైబరాబాదు ఏర్పాటుతో ప్రారంభమైన అభివృద్ధి దేశం మొత్తం దృష్టిని తెలంగాణపైకి తిప్పింది. అయితే, ఆ అభివృద్ధినే తిరిగి తప్పుగా మలచి చూపించే ప్రయత్నాలు కూడా జరిగాయి. “హైదరాబాద్‌లో పెట్టుబడులు తెచ్చిందే రాష్ట్ర విభజనకు కారణం” అని చెప్పే విశ్లేషకులు ఉన్నారు. అయితే అదే నిజమైతే… తెలంగాణ ప్రజలు ఇప్పటికీ చంద్రబాబును ఎందుకు గౌరవంతో చూస్తారు? ఈ ప్రశ్నకు సమాధానం మాత్రం ఎవరూ ఇవ్వరు. ఒక రాష్ట్రం నిలదొక్కుకోవాలంటే.. ఇంజన్‌లా ముందుకు లాగే ఆర్థిక వ్యవస్థ అవసరం. అప్పుడు హైదరాబాద్‌లో ఐటీని బలంగా నిలబెట్టారు. ఇప్పుడు ఏపీలో అభివృద్ధిని ఒకేచోట కేంద్రీకరించకుండా, సమాన అభివృద్ధి లక్ష్యంగా తీసుకుని విశాఖ, రాయలసీమ, దొనకొండ ప్రాంతాల్లో ప్రత్యేక పరిశ్రమల స్థాపన కోసం అడుగులు వేస్తున్నారు.

ఇప్పుడు కొత్తగా తెరపైకి తెచ్చిన వాదన—“అమరావతికి పెట్టుబడులు రావడం లేదు” అనే కథనం. ఈ కథనానికి నిస్సిగ్గుగా ఊతమిస్తున్నవారు వైసీపీ పెంచిన కొందరు కుహానా మేధావులు, రాజకీయ విశ్లేషకుల వేషంలో ఉన్న ప్రచారకులు. చంద్రబాబుకు క్రెడిట్ దక్కకూడదన్న ఉద్దేశంతోనే ఈ కొత్త సిద్ధాంతాలు తయారు చేస్తున్నారు. ఆశ్చర్యం ఏమిటంటే… ఈ ప్రచారాన్ని టీడీపీలోని కొంతమంది కూడా తెలియకుండానే నమ్ముతున్న పరిస్థితి ఏర్పడింది. జగన్మోహన్ రెడ్డి పాలన సంక్షేమంపై నడిచింది. కానీ ఆ సంక్షేమం మాటున జరిగే విధ్వంసాలను ప్రజలు గమనించరని ప్రభుత్వం అనుకుంది. చివరికి ప్రజలు అన్నీ చూసి నిర్ణయం తీసుకున్నారు. “చేసింది చెప్పుకోలేకపోయాం” అని జగన్ బాధపడుతున్నా… అసలు సమస్య చేసిన పనికన్నా, చేసిన హానిలోనే ఉందని ప్రజలు స్పష్టంగా చెప్పేశారు.

Also Read : ‘అఖండ 2’ ప్రివ్యూ రిపోర్ట్ : బాలయ్య విశ్వరూపం

ఇప్పుడైతే చంద్రబాబు మరోసారి ఒక స్పష్టమైన విజన్‌తో పనిచేస్తున్నారు. కానీ ఆయన ఏం చేసినా—పెట్టుబడులు తెస్తే ఒకే ప్రాంతానికే తెచ్చారు అంటారు, తేవకపోతే పనేమీ చేయలేదంటారు. పెట్టుబడుల సదస్సు నిర్వహిస్తే “షో ఆఫ్” అంటారు, నిర్వహించకపోతే “ప్రయత్నం చేయలేదని” విమర్శిస్తారు. ఆయన వయసు కంటే, శక్తి కంటే ఎక్కువగా పని చేస్తుంటే… ప్రతి అడుగులోనూ లోపాలు వెతకడం, కనపడని చోట కూడా వంకరలు పెట్టడం ప్రారంభమైంది.

దీనికి తోడు టీడీపీతో సంబంధం ఉన్న కొంతమంది కుహానా మేధావులు కూడా అదే స్వరంలో మాట్లాడితే… అది నాయకుడికే కాదు, పార్టీ భవిష్యత్తుకే భారీ నష్టం.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తెలంగాణా సైనికులకు జనసేనాని...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న...

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

ఇప్పుడు వాళ్లంతా ఏమయ్యారు..?

కూటమి అంటే.. ఒక ఉమ్మడి కుటుంబం...

ఏపీ కేబినేట్ సంచలన...

తిరుమల కల్తీ లడ్డు వ్యవహారానికి సంబంధించి...

దమ్ముంటే అసెంబ్లీకి రా.....

గత రెండు రోజులుగా తనను ఉద్దేశించి...

బ్రేకింగ్: చంద్రబాబు –...

ఏపీలో ప్రస్తుతం జరుగుతోన్న రాజకీయ పరిణామాలు...

పోల్స్