Sunday, March 22, 2026 03:12 AM
Sunday, March 22, 2026 03:12 AM

ఇండిగో గోల.. అసలెందుకీ రగడ..?

ఇండిగో సంస్థ విమానాలు రద్దు చేసింది.. కొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి. ఇది ఇప్పుడు దేశాన్ని కుదిపేస్తున్న అంశం. విమానాశ్రయాల్లో గంటల తరబడి పడిగాపులు కాస్తున్నారు ప్రయాణికులు. ఇంకా చెప్పాలంటే అక్కడే ఉన్న అరకొర మహిళా సిబ్బందిపై దాడి చేసినంత పని చేస్తున్నారు. మరి ఇంత హంగామా ఎందుకు.. ఇంత గందరగోళం ఎందుకు.. అసలు ఈ వివాదానికి కారణం ఏమిటీ.. దీని వెనుక ఉన్న అసలు సూత్రధారి ఎవరు.. అనేది ఇప్పుడు హాట్ టాపిక్. కానీ జాతీయ మీడియా.. ఇందులో ముఖ్యంగా నోరేసుకుని పడిపోయే రిపబ్లిక్ టీవీ మేనేజింగ్ డైరెక్టర్, ఎడిటర్ ఇన్ చీఫ్ హోదాలో ఉన్న అర్నబ్ గో స్వామి అయితే ఆ విషయంపై చర్చించకుండా.. కేవలం పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు విఫలమయ్యారు.. కాబట్టి.. తక్షణమే ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ కూడా చేస్తున్నారు. మరి ఇదే అర్నబ్.. తన షో‌లో కనీసం ఒక్క బీజేపీ నేతకు కూడా ఈ విషయంపై జరుగుతున్న చర్చలో అవకాశం ఎందుకు ఇవ్వలేదు అనేది ప్రశ్నకు జవాబు లేదనే చెప్పాలి.

Also Read : అర్నాబ్.. ఈ ప్రశ్నలకు జవాబు ఉందా..?

ఇండిగో విమాన సర్వీసులు సగానికి పైగా రద్దు అయ్యాయి. మిగిలిన చాలా వరకు ఆలస్యంగా నడుస్తున్నాయి. దీని వల్ల ఆయా సర్వీసుల్లో ప్రయాణ ఏర్పాట్లు చేసుకున్న ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కొందరు జరిగిన అసౌకర్యానికి దాడి కూడా చేస్తున్నారు. అయితే ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాల్సి ఉంది. డిసెంబర్ 1వ తేదీ నుంచి పైలట్ల కోసం కొత్త రూల్స్ అమల్లోకి వచ్చాయనే విషయం ఎంత మందికి తెలుసు..? అనే ప్రశ్నకు.. ఎవరి దగ్గర జవాబు లేదు. అలాగే అసలు ఇండిగో సంస్థ రోజుకు ఎన్ని సర్వీసులు నడిపిస్తోంది.. దాని కోసం ఎంత మంది సిబ్బంది అవసరమనే విషయం కూడా ఎవరికీ తెలియదు. వందల మంది ప్రయాణీకుల ప్రాణాలను జాగ్రత్తగా గమ్యం చేర్చే పైలెట్లపై పని ఒత్తిడి లేకుండా చూసేందుకు కేంద్ర పౌర విమానయాన శాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. పైలెట్లకు అలసట తగ్గించే విధంగా డ్యూటీ టైమ్ లిమిట్‌ను కేంద్రం ప్రకటించింది. ఇదే సరైన సమయం అని భావించిన కార్పొరేట్ దిగ్గజం అదానీ రంగంలోకి దిగారు. పైలెట్లు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ సిబ్బందికి కోచింగ్ ఇచ్చే ప్రైమ్ ఏరో సర్వీసెస్ సంస్థలో మెజారిటీ వాటను అదానీ గ్రూప్ సొంతం చేసుకుంది. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని 20 వేల పైలెట్లను తయారు చేస్తామని గొప్పగా ప్రకటించారు. మరోవైపు భారత్‌లో విమానయాన రంగంలో ఇండిగో సంస్థది మెజారిటీ వాట. తక్కువ ధరలో విమాన ప్రయాణ సౌకర్యం అందిస్తున్న సంస్థ కూడా ఇండిగో. దీనిలో వాటా దక్కించుకోవడమా.. లేక పూర్తిస్థాయిలో సొంతం చేసుకునేందుకు అదానీ ప్రయత్నం చేస్తున్నారనేది కాంగ్రెస్ నేతల మాట.

Also Read : మహిళలకు నిద్ర ఎంత కీలకమో తెలుసా..?

అయితే ఈ విషయాలు ఏవీ తెలియని సామాన్య ప్రజలు.. ఎయిర్ పోర్టులో తమకు జరిగిన అసౌకర్యానికి గగ్గొలు పెడుతున్నారు. ఇదే అదనుగా అర్నాబ్ గో స్వామి లాంటి మేథావి ముసుగు వేసుకున్న పెయిడ్ జర్నలిస్టులు.. ఇదంతా కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు వైఫల్యం అని టాపిక్ పూర్తిగా డైవర్ట్ చేసేందుకు నానా పాట్లు పడుతున్నారు. నిజానికి విమానం ఆలస్యమైంది. కొన్ని సర్వీసులు రద్దు అయ్యాయి. విమానయాన వ్యవస్థలో ఇంత పెద్ద ఎత్తున ఇలా జరగటం ఇదే మొదటి సారి. కానీ భారతీయ రైల్వే వ్యవస్థలో ప్రతి రోజూ దాదాపు అన్ని రైళ్లు ఆలస్యంగానే నడుస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే.. నువ్వు ఎక్కాల్సిన రైలు జీవిత కాలం ఆలస్యం అనే నానుడి కూడా ఉంది. కొన్ని రైళ్లు ఆకస్మికంగా రద్దు చేస్తారు. ఏమైనా అడిగితే.. ట్రాక్ అప్ గ్రేడ్.. మెయిటనెన్స్.. అని జవాబు చెప్తారు. ఆ రైళ్లలో రిజర్వేషన్ చేసుకున్న వారికి డబ్బు వాపసు ఇచ్చేస్తామంటారు. మరి అలా జరిగినప్పుడు రైల్వే శాఖ మంత్రి విఫలమైనట్లు కాదా అంటే.. గో స్వామి సైలెంట్ అయిపోతారు. అసోం, బెంగాల్ వంటి రాష్ట్రాల్లో శాంతి భద్రతల సమస్య తలెత్తినప్పుడు కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా రాజీనామా అడుగుతారా అనే ప్రశ్న.. సదరు ఈ గో స్వామి లాంటి మేథావిని వేసే ధైర్యం ఎవరికి ఉంటుంది. జాతీయ రహదారుల నిర్మాణంలో లోపాలుంటే.. గడ్కరి బాధ్యత వహిస్తారా.. ఇవన్నీ కాదు.. గుజరాత్‌లో మోర్బీ వంతెన కూలి వందల మంది చనిపోయినప్పుడు గుజరాత్‌లో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని కానీ.. ఆ రాష్ట్రానికి చెందిన ప్రధాని నరేంద్ర మోదీ కానీ బాధ్యత వహించాలని ఈ సదరు అరిచే గో స్వామి డిమాండ్ ఎందుకు చేయలేదు అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దుమారం రేపుతున్న గరికపాటి...

మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహరావు...

బీఆర్ఎస్ వర్సెస్ కౌశిక్...

రాజకీయాల్లో దూకుడు స్వభావం ఉన్నా పర్వాలేదు...

టీటీడీలో కమాండ్ కంట్రోల్.....

ఏపీ సిఎం చంద్రబాబు మనువడు, మంత్రి...

బ్రేకింగ్: మొయినాబాద్ డ్రగ్స్...

మొయినాబాద్ డ్రగ్స్ ఉదంతంలో అత్యంత కీలకంగా...

గ్రాండ్ గా రామ్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

షిర్డీ సాయిని వెంటాడుతున్న...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని...

పోల్స్