Sunday, March 22, 2026 06:20 AM
Sunday, March 22, 2026 06:20 AM

ఉగ్రవాదులపై పోరుకు మహిళలు.. ఇండియన్ ఆర్మీ సంచలనం

జమ్మూ కాశ్మీర్ సహా ఉగ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం, భద్రతా బలగాలు ఎన్ని చర్యలు చేపట్టినప్పటికీ ఉగ్రవాద కార్యకలాపాలు మాత్రం ఆగటం లేదు. సరిహద్దుల నుంచి పెద్ద ఎత్తున ఉగ్రవాదులు భారత్ లోకి అక్రమంగా చొరబడుతున్నారని నిఘా వర్గాలు హెచ్చరిస్తూనే ఉన్నాయి. ఇటీవల కాలంలో చోటు చేసుకుంటున్న ఘటనలు.. ప్రభుత్వాలను కలవరపెడుతున్నాయి. స్థానికుల నుంచి ఉగ్రవాదులకు మద్దతు ఉండటంతో పెద్ద ఎత్తున జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలోకి చొరబాట్లు ఎక్కువయ్యాయి. ఉగ్రవాదులకు స్థానికంగా ఆర్థిక సహాయం కూడా కొందరు అందిస్తున్నారని ఆరోపణలు సైతం ఉన్నాయి.

Also Read : విజయ్ దేవరకొండ–రష్మిక పెళ్లి ఎప్పుడంటే..!

ప్రముఖ పర్యాటక ప్రదేశాల్లో సైతం ఉగ్రవాదులు దాడులకు దిగడంతో ఇప్పుడు వారిని ఎదుర్కొనేందుకు స్థానికుల సహకారం తీసుకోవాలని ఆర్మీ భావిస్తోంది. ఇందుకోసం గాను గ్రామ రక్షణ దళాలను జమ్మూ కాశ్మీర్లో ఏర్పాటు చేస్తోంది. సరిహద్దుల నుంచి చొరబడే ఉగ్రవాదులను ఎదుర్కోవడానికి.. వారికి పూర్తిస్థాయిలో శిక్షణ ఇస్తోంది. ఆత్మరక్షణ, ఎదురుదాడి, రైఫిల్స్ వినియోగం, బంకర్ల నిర్మాణం, గ్రేనైట్స్ వాడకం వంటి అంశాల్లో వారికి పూర్తిస్థాయిలో శిక్షణ ఇస్తున్నారు. ఇందులో మహిళలు, యువకులు ఉండటం విశేషం. ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే కంగారు పడకుండా ఉగ్రవాదులను కట్టడి చేసే విధంగా వారికి శిక్షణ ఇస్తున్నాయి బలగాలు.

Also Read : ప్రభాస్ చీర స్టోరీ చెప్పేసిన హీరోయిన్..!

మొత్తం లోయ ప్రాంతంలోని 17 గ్రామాల్లో 150 నుంచి 170 మందికి ఈ విధంగా శిక్షణ ఇస్తున్నారు అధికారులు. శిక్షణ పూర్తయిన వారికి సర్టిఫికెట్లు కూడా జారీ చేస్తున్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి కొంత ఆర్థిక సహాయం కూడా అందించేందుకు ఆర్మీ ముందడుగు వేసింది. ఉగ్రవాదులు చొరబడ్డారని విషయం తెలిసినప్పుడు ఏ విధంగా సమాచారం చేరవేయాలి అనే దానిపై కూడా ఆర్మీ వారికి శిక్షణ ఇవ్వటం గమనార్హం. గ్రామీణ ప్రాంతాల్లోనే ఉగ్రవాద కార్యక్రమాలు జమ్మూకాశ్మీర్ లో ఎక్కువగా ఉండటంతో ఇప్పుడు వారిని కట్టడి చేసేందుకు గ్రామాల నుంచే శిక్షణ ఇవ్వటం మొదలుపెట్టారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దుమారం రేపుతున్న గరికపాటి...

మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహరావు...

బీఆర్ఎస్ వర్సెస్ కౌశిక్...

రాజకీయాల్లో దూకుడు స్వభావం ఉన్నా పర్వాలేదు...

టీటీడీలో కమాండ్ కంట్రోల్.....

ఏపీ సిఎం చంద్రబాబు మనువడు, మంత్రి...

బ్రేకింగ్: మొయినాబాద్ డ్రగ్స్...

మొయినాబాద్ డ్రగ్స్ ఉదంతంలో అత్యంత కీలకంగా...

గ్రాండ్ గా రామ్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

షిర్డీ సాయిని వెంటాడుతున్న...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని...

పోల్స్