భారత్ – పాకిస్తాన్ దేశాల మధ్య మే నెలలో నెలకొన్న పరిస్థితులు ఆందోళన కలిగించిన సంగతి తెలిసిందే. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ ప్రతీకార చర్యలకు దిగింది. అక్కడి నుంచి పాకిస్తాన్ కూడా భారత్ పై దాడులు చేసే ప్రయత్నం చేసింది. ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత్ చేసిన దాడుల దెబ్బకు, పాక్ లోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంశం చేసింది భారత్. ఇక ఈ వ్యవహారంపై భారత్ ను తక్కువ చేసి మాట్లాడే ప్రయత్నం పాకిస్తాన్ చేస్తూ వచ్చింది. అంతర్జాతీయ వేదికల్లో తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేసింది.
Also Read : భారత జట్టులో అతనిపై ఎందుకీ వివక్ష..?
తాజాగా 80వ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో భారత్ వర్సెస్ పాకిస్తాన్ గా మాటల యుద్ధం నడిచింది. ఆపరేషన్ సిందూర్ లో తాము విజయం సాధించామని పాక్ అధ్యక్షుడు షరీఫ్ చెప్పగా.. దీనికి ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత మిషన్ మొదటి కార్యదర్శి పెటల్ గహ్లోట్ మాట్లాడుతూ, ప్రపంచం చూడటానికి ఆధారాలు స్పష్టంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఈ ఘటనలో భారత దళాలు పాకిస్తాన్ వైమానిక స్థావరాలను ధ్వంసం చేయడం జరిగిందని.. ఆ నష్టానికి సంబంధించిన చిత్రాలు ప్రజలకు అందుబాటులో ఉన్నాయన్నారు.
Also Read : ఓజీ ఎఫెక్ట్.. అఖండ 2 ఎలా ఉంటుందో..?
పాక్ ప్రధానమంత్రి చెప్పినట్లుగా, ధ్వంసమైన రన్ వేలు, కాలిపోయిన హ్యాంగర్లు విజయంలా కనిపిస్తే తాము ఏం చేయలేమని, స్వాగతిస్తామని తెలిపారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలపై భారత్, జరిపిన దాడులకు సంబంధించిన ఫోటోగ్రాఫిక్ ఆధారాలను ఆమె చూపించారు. ఒక ఫోటో వెయ్యి మాటలు మాట్లాడుతుందని, భారత దళాలు బహవల్పూర్, మురిడ్కే ఉగ్రవాద స్తావరలాను భారత్ ధ్వంశం చేసిందని, ఉగ్రవాదులను ఫోటోలను కూడా మనం చూసాం అంటూ పాకిస్తాన్ గాలి తీసారు గహ్లాట్.