Sunday, March 22, 2026 11:37 AM
Sunday, March 22, 2026 11:37 AM

బాలయ్యకు ఫిదా అయిపోయిన ఇండియా టుడే

నందమూరి బాలకృష్ణ.. ప్రస్తుతం ఇండియన్ సినిమాలో ఫామ్ లో ఉన్న సీనియర్ హీరోల్లో అతి తక్కువ మందిలో ఒకరు. బాలకృష్ణ పై ఇన్వెస్ట్ చేస్తే లాస్ ఉండకపోగా మినిమం గ్యారెంటీ హీరోగా గత ఐదేళ్ల నుంచి సెటిలైపోయారు బాలయ్య. బాలయ్యతో ఏ కార్యక్రమం చేసిన.. ఏ సినిమా చేసిన సూపర్ హిట్ కావడంతో నిర్మాతలు క్యూ కడుతున్నారు. ఇప్పుడు బాలకృష్ణ చేసిన అఖండ సీక్వెల్ కు… తెలుగు జనాలు వంకలు పెడుతుంటే బాలీవుడ్ మీడియా మాత్రం ఓ రేంజ్ లో హైపిస్తోంది. లేటెస్ట్ గా ఇండియా టుడే బాలకృష్ణ సినిమా కెరీర్ పై చేసిన ఓ ఎనాలసిస్ ఇప్పుడు సోషల్ మీడియాలో షేక్ చేస్తోంది.

Also read : బ్రేకింగ్: టీడీపీలో పదవుల పండుగ

సీనియర్ హీరోల్లో ఏ హీరోకి వర్కౌట్ అవ్వని ఫార్ములా బాలయ్యకు మాత్రమే వర్కౌట్ అవుతుందని.. తనను తాను మార్చుకోవడంలో బాలకృష్ణ సక్సెస్ అయ్యారని, అందుకే ఆయన సినిమాలు సక్సెస్ అవుతున్నాయని అభినందించింది. 1990ల నాటి ఫార్ములా ఇప్పటికీ బాలకృష్ణకు మాత్రమే వర్కౌట్ అవుతుందని తెలిపింది. సమరసింహారెడ్డి సినిమాతో తెలుగు సినిమా లైన్ బాలయ్య మార్చేశారని.. ఇప్పటికీ అదే ట్రెండ్ కంటిన్యూ అవుతోందని పేర్కొంది. లక్ష్మీ నరసింహ, చెన్నకేశవరెడ్డి వంటి సినిమాలు బాలకృష్ణ ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగా పెంచేసాయని తెలిపింది.

Also read : పీవీ మౌన కుమార్.. వంద ప్రశ్నలకు మౌనమే..?

ఇక లెజెండ్, సింహ వంటి సినిమాలతో బాలకృష్ణ రేంజ్ పెరిగిపోయిందని పేర్కొంది. అఖండ సినిమా తర్వాత నుంచి బాలకృష్ణ రూట్ మార్చి సక్సెస్ అయ్యారని తెలిపింది. గత నాలుగేళ్ల నుంచి బాలకృష్ణ సక్సెస్ అనేది ఏదో యాదృచ్ఛికం గా వచ్చింది కాదని, బాలకృష్ణ ఎన్నో ఏళ్ల శ్రమ అంటూ అభినందించింది. అలాగే అఖండ సీక్వెల్ విషయంలో బాలకృష్ణ చాలా కష్టపడ్డారని, ఎందరో హీరోలు 65 ఏళ్ల వయసులో తమను తాను తగ్గించుకుంటున్న సమయంలో బాలయ్య మాత్రం రిస్క్ చేయడానికి వెనుకడుగు వేయలేదని.. థియేటర్లలో తాండవం ఆడేశాడు అంటూ ఆకాశానికి ఎత్తేసింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతుంది. కాగా అఖండ సీక్వెల్ నార్త్ ఇండియాలో కూడా సూపర్ సక్సెస్ అయిన సంగతి తెలిసిందే.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దుమారం రేపుతున్న గరికపాటి...

మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహరావు...

బీఆర్ఎస్ వర్సెస్ కౌశిక్...

రాజకీయాల్లో దూకుడు స్వభావం ఉన్నా పర్వాలేదు...

టీటీడీలో కమాండ్ కంట్రోల్.....

ఏపీ సిఎం చంద్రబాబు మనువడు, మంత్రి...

బ్రేకింగ్: మొయినాబాద్ డ్రగ్స్...

మొయినాబాద్ డ్రగ్స్ ఉదంతంలో అత్యంత కీలకంగా...

గ్రాండ్ గా రామ్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

షిర్డీ సాయిని వెంటాడుతున్న...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని...

పోల్స్