Monday, October 27, 2025 09:02 PM
Monday, October 27, 2025 09:02 PM
roots

ఆగని పాక్ ప్రయత్నాలు.. మళ్ళీ ఏడుగురిని పంపింది..!

ఓ వైపు అంతర్జాతీయ సమాజం నుంచి విమర్శలు వస్తున్నా, భారత ఆర్మీ దాడులు చేస్తున్నా అక్రమ చొరబాట్లు మాత్రం భారత్, పాక్ సరిహద్దుల్లో ఆగడం లేదు. ఓ వైపు భారత ఆర్మీ ప్రతీకార దాడులు చేస్తున్నా సరే ఉగ్రవాదుల వైఖరిలో మాత్రం మార్పు రావడం లేదు. తాజాగా జమ్మూ కాశ్మీర్‌లోని సాంబా జిల్లాలోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి శుక్రవారం తెల్లవారుజామున బిఎస్‌ఎఫ్ పెద్ద ఎత్తున ఉగ్రవాదులు చొరబాటుకు ప్రయత్నం చేస్తున్న సమయంలో.. వారిని అడ్డుకుంది.

Also Read : మన సైన్యం బలమెంత.. యుద్ధం వస్తే పాక్ పరిస్థితి ఏంటీ..?

జైష్-ఎ-మొహమ్మద్ (జెఎం) తో సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్న ఏడుగురు ఉగ్రవాదులను బీఎస్ఎఫ్ హతమార్చింది. మే 8న రాత్రి 11 గంటల ప్రాంతంలో సాంబా సరిహద్దు సమీపంలో అనుమానాస్పద కదలికలను బీఎస్ఎఫ్ గుర్తించింది. మే 8, 2025న దాదాపు రాత్రి 11 గంటల ప్రాంతంలో ఈ చొరబాటు ప్రయత్నం జరిగినట్లు బీఎస్ఎఫ్ పోస్ట్ చేసింది. భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య వేగంగా పెరుగుతున్న సైనిక ఉద్రిక్తతల మధ్య ఈ సంఘటన చోటు చేసుకుంది.

Also Read : యుద్ధం మొదలైందా..? పాక్ టార్గెట్ చేసిన సిటీలు ఇవే

మే 7న పాకిస్తాన్ మరియు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్రవాద శిబిరాలపై ఆపరేషన్ సిందూర్ లో భాగంగా భారత ఆర్మీ దాడులు చేసి దాదాపు 100 మంది ఉగ్రవాదులను హతమార్చిన అనంతరం పరిస్థితులు ఉద్రిక్తతను రేపుతున్నాయి. జమ్మూ, పఠాన్‌కోట్, ఉధంపూర్‌లోని బహుళ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకునేందుకు పాకిస్తాన్ చేసిన ప్రయత్నాలను కూడా భారత్ అడ్డుకుంది. ఇక సరిహద్దుల్లో నిఘాను మరింత పెంచింది ఆర్మీ. అటు స్థానికులపై కూడా పెద్ద ఎత్తున నిఘా పెట్టారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్