Sunday, March 22, 2026 02:57 PM
Sunday, March 22, 2026 02:57 PM

భారత్ – పాక్ మ్యాచ్ విలువ ఇన్ని వేల కోట్లా..?

ఆధునిక క్రికెట్ ఆర్థిక వ్యవస్థలో, కొన్ని మ్యాచ్‌ లు ట్రోఫీల కంటే పెద్దవి. అందులో భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ముందు వరుసలో ఉంటుంది. టి20 ప్రపంచ కప్‌లో భారత్ వర్సెస్ పాక్ మ్యాచ్ అనేది షెడ్యూల్‌ లోని మ్యాచ్ మాత్రమే కాదు.. ఓ క్యాష్ బాంబ్. టోర్నీకి కొత్త హంగులు తీసుకొచ్చి, క్రికెట్ బోర్డ్ లకు భారీ ఆదాయం తీసుకోచ్చేది. ప్రసార కాస్ట్.. మ్యాచ్ టికెట్ లు, ప్రకటనలు ఇలా చూసుకుంటే కొన్ని వందల కోట్ల మార్కెట్ ఇది. ఇప్పుడు ఈ మ్యాచ్ పై నీలి నీడలు కమ్ముకున్నాయి.

Also Read : నకిలీ వివిఐపి పాసులు.. వెనకున్నది టిడిపి వారేనా..?

బంగ్లాదేశ్ కు మద్దతు ఇస్తూ పాకిస్తాన్ భారత్ విషయంలో కఠినంగా వ్యవహరిస్తోంది. భారత్ తో మ్యాచ్ ఆడేది లేదని పాకిస్తాన్ అంటుంది. అదే జరిగితే మాత్రం.. ఐసీసీ పాక్ విషయంలో కఠినంగా వ్యవహరించే సంకేతాలు కనపడుతున్నాయి. ఐసీసీ సీరియస్ అయితే మాత్రం.. పాక్ లో జరిగే డొమెస్టిక్ మ్యాచ్ లు, లీగ్ లు, ఇతర దేశాలతో ఆ దేశం ఆడే మ్యాచ్ లపై కూడా తీవ్ర ప్రభావం పడనుంది. ప్రసార హక్కులు, ప్రకటనల ప్రీమియంలు, స్పాన్సర్‌షిప్ యాక్టివేషన్లు, టికెట్ లు, చట్టపరమైన బెట్టింగ్, డౌన్‌స్ట్రీమ్ వాణిజ్య కార్యకలాపాలు, ఇతరత్రా అన్నీ కలిపితే భారత్ వర్సెస్ పాక్ మ్యాచ్ విలువ 500 మిలియన్ డాలర్లు.

Also Read : నాన్‌వెజ్ తిన్న వెంటనే నిద్రపోతున్నారా? ఎంత ప్రమాదమో తెలుసా..!

అంటే మన కరెన్సీలో రూ. 4,500 కోట్ల రూపాయలు. మరే ఇతర క్రికెట్ మ్యాచ్ కూడా దీని దరిదాపుల్లో కూడా లేదు. ప్రసారకులకు, ఇది ఒక కిరీట రత్నం లాంటిది. భారత్ వర్సెస్ పాకిస్తాన్ టి20 మ్యాచ్ కు ప్రకటనల ధరలు సాధారణంగా 10 సెకన్లకు రూ. 25-40 లక్షలు పలుకుతాయి. ఈ మ్యాచ్ ను ఆపేస్తే మాత్రం టోర్నీ ఆర్ధిక స్వరూపమే మారిపోతుంది. ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ కు ప్రకటనల ఆదాయం మాత్రమే రూ. 300 కోట్లుగా అంచనా వేసారు. ఇప్పుడు ఈ డబ్బులు పాక్ బోర్డు కట్టాల్సిందే. నివేదికల ప్రకారం, మ్యాచ్ జరగకపోతే రెండు బోర్డులు ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా దాదాపు 200 కోట్ల రూపాయల ఆదాయాన్ని కోల్పోతాయి. ఈ ఆట కోసం ప్రత్యేకంగా విమానాలు, హోటళ్ళు, టిక్కెట్లు బుక్ చేసుకున్న వేలాది మంది అభిమానులు కూడా నష్టపోయే అవకాశం ఉంటుంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దుమారం రేపుతున్న గరికపాటి...

మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహరావు...

బీఆర్ఎస్ వర్సెస్ కౌశిక్...

రాజకీయాల్లో దూకుడు స్వభావం ఉన్నా పర్వాలేదు...

టీటీడీలో కమాండ్ కంట్రోల్.....

ఏపీ సిఎం చంద్రబాబు మనువడు, మంత్రి...

బ్రేకింగ్: మొయినాబాద్ డ్రగ్స్...

మొయినాబాద్ డ్రగ్స్ ఉదంతంలో అత్యంత కీలకంగా...

గ్రాండ్ గా రామ్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

షిర్డీ సాయిని వెంటాడుతున్న...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని...

పోల్స్