Wednesday, February 4, 2026 10:06 AM
Wednesday, February 4, 2026 10:06 AM

గ్రహాంతరవాసులపై భారత్ – జపాన్ అదిరిపోయే ప్రాజెక్ట్..

గ్రహాంతర వాసులు ఉన్నారా, లేరా..? దశాబ్ద కాలంగా ఖగోళ శాస్త్రవేత్తలను మదిని తోలచివేస్తోన్న ప్రశ్న. ముఖ్యంగా ఉత్తర, దక్షిణ అమెరికా ప్రాంతాల్లో యేవో ప్లేట్ లు, అనుమానాస్పద పదార్ధాలు కనిపించాయనే ప్రచారం ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. దీనిపై నాసా, రష్యా ఎన్నో పరిశోధనలు నిర్వహిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు వీటిపై భారత్ కూడా ఓ అడుగు వేస్తోంది. గ్రహాంతర వాసులకు సంబంధించి భారత్, జపాన్ కలిసి సంయుక్తంగా అడుగులు వేస్తున్నాయి.

Also Read : నెల్లూరు వైసీపీకి ఊహించని షాక్..!

ప్రపంచంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన ఖగోళ పరికరాలలో ఒకటైన థర్టీ మీటర్ టెలిస్కోప్ ను నిర్మించడానికి ప్రణాలికలు సిద్దం చేస్తున్నాయి. 30 మీటర్ల భారీ అద్దంతో కూడిన ఈ అత్యాధునిక ఆప్టికల్-ఇన్‌ఫ్రారెడ్ టెలిస్కోప్, విశ్వం గురించి ఎన్నో సంచలన విషయాలను బయటపెడుతుందని, విప్లవాత్మక మార్పులు తీసుకురావడం ఖాయం అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఈ విశ్వంలో మానవులేనా లేదంటే ఇంకో విశ్వం ఉందా అనే దానిపై పరిశోధనలు చేయడంలో కూడా ఇది సహకరిస్తుంది.

Also Read : రాజా సాబ్ షూటింగ్ ఇష్యూస్.. చేతులెత్తేసిన నిర్మాత

ఈ ప్రాజెక్ట్ ను భారత్ – జపాన్ లోని రెండు ప్రముఖ యూనివర్సిటీలు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాయి. కృష్ణ బిలాలు, సుదూర ప్రాంతంలోని గెలాక్సీలను అధ్యయనం చేయడం, భూమికి ఆవల జీవం యొక్క సంకేతాలను శోధించడం వంటి కార్యక్రమాలు చేపట్టనున్నారు. టెలిస్కోప్ యొక్క అద్ధమే ఈ పరిశోధనల్లో కీలక పాత్ర పోషిస్తుందని జపాన్ క్యాబినెట్ కార్యాలయంలోని జాతీయ అంతరిక్ష విధాన కమిటీ వైస్ చైర్ డాక్టర్ సాకు సునేటా వెల్లడించారు. సుదీర ప్రాంతాల్లో ఉన్న వాటిని గుర్తించడంలో అది కీలక పాత్ర పోషిస్తుంది. హవాయిలోని మౌనా కీ వద్ద నాలుగు వేల మీటర్ ల ఎత్తులో దీన్ని నిర్మిస్తున్నారు. జపాన్ ఇప్పటికే అక్కడ 8.2 మీటర్ల టెలిస్కోప్‌ ను ఇప్పటికే ఏర్పాటు చేసింది. 2030 తర్వాత ఇది అందుబాటులోకి వస్తుంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఇప్పుడు వాళ్లంతా ఏమయ్యారు..?

కూటమి అంటే.. ఒక ఉమ్మడి కుటుంబం...

ఏపీ కేబినేట్ సంచలన...

తిరుమల కల్తీ లడ్డు వ్యవహారానికి సంబంధించి...

దమ్ముంటే అసెంబ్లీకి రా.....

గత రెండు రోజులుగా తనను ఉద్దేశించి...

బ్రేకింగ్: చంద్రబాబు –...

ఏపీలో ప్రస్తుతం జరుగుతోన్న రాజకీయ పరిణామాలు...

సింఘాల్‌ సరే.. తర్వాత...

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి...

అందరి బ్రతుకు నాకు...

గతవారం పది రోజుల నుంచి ఏపీలో...

పోల్స్