జమ్మూ కాశ్మీర్ లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని భారత్ తీవ్రంగా పరిగణించింది. తమ పౌరులను పాక్ ఉగ్రవాదులు దారుణంగా హత మార్చడంతో పాకిస్తాన్ తో దౌత్య పరమైన సంబంధాలను తెంచుకుంది. ప్రస్తుతం సరిహద్దులను కూడా మూసి వేస్తూ నిర్ణయించింది. అటు పాకిస్తాన్ కూడా వాయి మార్గాన్ని మూసి వేసింది. సింధూ నది జలాల ఒప్పందం నుంచి మొదలుపెట్టి.. అంతర్జాతీయంగా పాక్ ను ఎండగట్టే వరకు భారత్ అడుగులు వేస్తోంది. ఇప్పటికే సరిహద్దుల్లో పెద్ద ఎత్తున బలగాలను మోహరించింది.
Also Read : అవును చెత్త పనులు చేస్తున్నాం: పాక్ సంచలన వ్యాఖ్యలు
ఐరాసాలో కూడా పాకిస్తాన్ పై నిప్పులు చెరిగారు భారత ప్రతినిది. సోమవారం ఐక్యరాజ్యసమితిలో పహల్గామ్ ఉగ్రవాద దాడిని భారత్ తీవ్రంగా లేవనెత్తింది. పాకిస్తాన్ సరిహద్దు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని, సరిహద్దు ప్రాంతాలను అస్థిరపరుస్తోందని మండిపడింది. న్యూయార్క్‌లో జరిగిన ఉగ్రవాద బాధితుల సంఘం నెట్‌వర్క్ ప్రారంభోత్సవంలో భారత్ మాట్లాడింది. ఐక్యరాజ్యసమితిలో భారత డిప్యూటీ శాశ్వత ప్రతినిధి, రాయబారి యోజన పటేల్ పాకిస్తాన్ వైఖరిపై తీవ్ర వ్యాఖ్యలు చేసారు.
Also Read : ముస్లిం నాయకుల స్వరం మారిందా..? అలెర్ట్ అయ్యారా..?
తమ దేశం అన్ని మార్గాల్లో ఉగ్రవాదులను కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నామని వెల్లడించింది. భారత్ ను సరిహద్దు ఉగ్రవాద బాధితురాలుగా భారత్ అభివర్ణించింది. ఉగ్రవాద గ్రూపులకు మద్దతు ఇస్తున్న పాక్ చరిత్రను కూడా ఎండగట్టింది. పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ తాము ఉగ్రవాదులను పెంచి పోషించామని, పశ్చిమ దేశాల కోసం చెత్త పనులు చేసామని చేసిన వ్యాఖ్యలను భారత్ ప్రస్తావించింది. అటు ప్రపంచ దేశాలు కూడా పాక్ వైఖరిని తీవ్రంగా తప్పుబట్టాయి. ఈ తరహా చర్యలను సమర్ధించలేమని స్పష్టం చేసాయి.

