Wednesday, February 4, 2026 10:06 PM
Wednesday, February 4, 2026 10:06 PM

గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకున్న శ్రీలక్ష్మి

సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆల్ ఇండియా సర్వీస్ అధికారులైతే ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందరికో కలగా మిగిలిపోయే ఆల్ ఇండియా సర్వీస్ ఉద్యోగాలు సంపాదించే వారు భవిష్యత్తుపై చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి మాత్రం ఈ విషయంలో చాలా వెనుకబడి ఉన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఒక వెలుగు వెలిగిన శ్రీలక్ష్మి అప్పుడు గనుల శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేశారు. ఆ సమయంలో ఆమె తీసుకునే నిర్ణయాలు ఆమె ఉద్యోగ జీవితానికి మాయని మచ్చగా నిలిచాయి.

Also Read : నేను తగ్గను.. బెనిఫిట్ షోస్ ఉండవు: రేవంత్ క్లారిటీ

ఆమె అప్పట్లో పెట్టిన సంతకాలపై తీవ్రస్థాయిలో ఆరోపణలు వచ్చాయి. ఏ కారణంతో కళ్ళు మూసుకుని సంతకాలు పెట్టారు అంటూ జాతీయ దర్యాప్తు సంస్థ సిబిఐ తన చార్జిషీట్లో పేర్కొనడం ఒక సంచలనం. చిన్న వయసులోనే ఐఏఎస్ అధికారిగా బాధ్యతలు చేపట్టిన శ్రీలక్ష్మి సుదీర్ఘకాలం జైల్లో గడిపిన మహిళా ఐఏఎస్ అధికారిగా కూడా చరిత్రలో నిలిచిపోయారు. అయితే 2014 నుంచి 2019 వరకు తెలంగాణలో పనిచేసిన శ్రీలక్ష్మి వైఎస్ జగన్ 2019లో ముఖ్యమంత్రి కావడంతో ఆంధ్రప్రదేశ్ లో అడుగుపెట్టారు.

ఆ తర్వాత వైయస్ జగన్ ఆమెకు చాలా ప్రాధాన్యత ఇచ్చారు. గతంలో ఆమె పెట్టిన సంతకాలపై విశ్వాసం చూపించారు జగన్. ఇదే క్రమంలో తెలుగుదేశం పార్టీని ఆమె ఇబ్బందులు పెట్టారు అనే ఆరోపణలు కూడా అప్పట్లో వచ్చేవి. అందుకే ఆమె విషయంలో చంద్రబాబు నాయుడు సీరియస్ గా ఉన్నారు. చంద్రబాబుని ప్రసన్నం చేసుకోవాలని శ్రీలక్ష్మి ప్రయత్నాలు చేసిన అవి పెద్దగా ఫలించలేదు. అయితే ఇప్పుడు ఆమెకు బంగారం లాంటి అవకాశం చేజారిపోయింది. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శిగా ఉన్న నీరబ్ కుమార్ ప్రసాద్ మరో వారం రోజుల్లో పదవీ విరమణ చేయనున్నారు.

Also Read : ఏపీలో గవర్నమెంట్ క్రికెట్ అకాడమీలు.. న్యూ క్రీడా పాలసీ ప్లాన్ ఇదే

ఆ తర్వాత అత్యంత సీనియర్ అధికారిక శ్రీలక్ష్మి మాత్రమే ఏపీ ప్రభుత్వంలో ఉన్నారు. కానీ గతంలో ఆమె చేసిన వ్యవహారాలతో రాష్ట్ర ప్రభుత్వం ఆమెకు ఇప్పటివరకు పోస్టింగ్ ఇవ్వలేదు. ఐఏఎస్ అధికారులలో అత్యంత సీనియర్ అధికారి గా ఉండటంతో ప్రస్తుత సిఎస్ తర్వాత ఆమె బాధ్యతలు చేపట్టే అవకాశం ఉండేది. కానీ కేసుల్లో ఉండటంతో ఆమెను అసలు ప్రభుత్వం విధుల్లో కూడా చేర్చుకోవడం లేదు. ఆమె పేరు అసలు పరిశీలనలో కూడా లేదనే చెప్పాలి. ఇలా గోల్డెన్ ఛాన్స్ మిస్ అయ్యారు శ్రీలక్ష్మి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

గుంటూరు కారమా.. మజాకానా…!

గుంటూరు కారం పవర్ ఇన్నాళ్లకు కన్పించింది.....

బాబు-పవన్ భేటీ.. ఆ...

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్...

చంద్రబాబు సలహదారుగా మళ్లీ...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్...

అందరికీ తలో రోగం.....

ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల...

తెలంగాణా సైనికులకు జనసేనాని...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న...

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

పోల్స్